న్యూస్‌రీల్‌ | Sakshi
Sakshi News home page

న్యూస్‌రీల్‌

Published Sat, Apr 20 2024 1:50 AM

-

దరఖాస్తుల ఆహ్వానం

ఆసిఫాబాద్‌అర్బన్‌: తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు మే 31వ తేదీ వరకు జిల్లాలో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపు నిర్వహించనున్నట్లు డీవైఎస్వో రమాదేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల సీనియర్‌ క్రీడాకారులు, పీడీలు, పీఈటీలు ఈ నెల 25వ తేదీలోపు డీవైఎస్వో కార్యాలయంలో క్రీడా సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి..

ఆసిఫాబాద్‌రూరల్‌: 2024–25 విద్యా సంవత్సరానికి దుర్గాబాయి దేశముఖ్‌ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ హైదరాబాద్‌లో మూ డేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి భాస్కర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు లేని, నిరుపేద, దివ్యాంగ బాలికలు మే 20వ తేదీ లోపు జిల్లా కేంద్రంలోని బాలల సంరక్షణ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌, డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికలకు 70 శాతం, దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న బాలికలకు విద్యతో పాటు ఉచిత వసతి ఉంటుందని తెలిపారు. అర్హులు భోనఫైడ్‌, మెమో, కులం, ఆదాయం, మరణ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

22న ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌కు హాజరు

కై లాస్‌నగర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అ ధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 22వ తేదీన జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సుగుణ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement