Sakshi News home page

జోషీ వల్లే యడ్డీకి అధికారం దూరం

Published Thu, Apr 18 2024 10:30 AM

మాట్లాడుతున్న దింగాలేశ్వర స్వామి  - Sakshi

హుబ్లీ: ధార్వాడ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్‌జోషీ వల్లే మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప ఇబ్బందులకు గురై అధికారాన్ని కోల్పోయారని దింగాలేశ్వర స్వామి ఆరోపించారు. బుధవారం నగరంలోని శాంతి నగర్‌లో సూఫీ సంతుల సంఘం రాష్ట్రాధ్యక్షుడి ఇంటికి వెళ్లి భేటీ చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడు అధికారాన్ని కోల్పోయిన యడియూరప్ప ఇప్పుడేమో జోషీకి మద్దతుగా నిలిచి నామినేషన్‌ వేయించారన్నారు. ఇదంతా చూస్తుంటే యడియూరప్పపై జాలి వేస్తోందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం దుస్సాహసం కాదని, సాహసం అని యడియూరప్పకు ఆయన బదులిచ్చారు. కాగా తాను గురువారం అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తానన్నారు. యడియూరప్ప తనతో మాట్లాడారన్నారు. అది ఆయనకు పార్టీ సూచించిన కర్తవ్యం అన్నారు. పోటీ చేసే నిర్ణయం దృఢమైనదని, ఎట్టిపరిస్థితిలోను తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. తన నామినేషన్‌ వేళ ప్రజలు విశేషంగా తరలివస్తారన్నారు. ముస్లింలు, రైతు సంఘాలు, మహిళలు నామినేషన్‌ వేళ తనకు మద్దతు ఇస్తారన్నారు. ముహూర్తం చూడనని, ప్రభుత్వం ప్రకటించిన నిర్ధిష్ట వేళల్లోనే నామినేషన్‌ దాఖలు చేస్తానన్నారు.

దింగాలేశ్వర స్వామి

నేడు నామినేషన్‌ వేస్తా

Advertisement

తప్పక చదవండి

Advertisement