Sakshi News home page

చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ బీజేపీతోనే సాధ్యం

Published Fri, Apr 12 2024 1:55 AM

మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌ 
 - Sakshi

మెట్‌పల్లి: ఎన్నికల్లో ఇచ్చి హామీ మేరకు పసుపు బోర్డు తెచ్చానని, అలాగే ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని కూడా పునరుద్ధరిస్తానని ఎంపీ అర్వింద్‌ తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో చాయ్‌ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. చక్కెర ఫ్యాక్టరీపై కాలయాపనకే కాంగ్రెస్‌ ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఎగుమతులు పెరిగి ఈ సీజన్‌లో రైతులకు మంచి ధర అందుతోందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశం మొత్తం మోదీ వైపు చూస్తోందని, ఈ ఎన్నికల్లో 400పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటలు నమ్మకుండా బీజేపీకి మద్దతు తెలపాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు, చెట్లపల్లి సుఖేందర్‌, బొడ్ల రమేశ్‌, దొనికెల నవీన్‌ తదితరులున్నారు.

చాయ్‌ పే చర్చలో ఎంపీ అర్వింద్‌

Advertisement
Advertisement