ప్రతి ఓటరుకూ స్లిప్పు అందించాలి | Sakshi
Sakshi News home page

ప్రతి ఓటరుకూ స్లిప్పు అందించాలి

Published Wed, Nov 15 2023 1:40 AM

కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ యాస్మిన్‌బాషా, చిత్రంలో జిల్లా అధికారులు - Sakshi

జగిత్యాల: జిల్లాలోని ఓటర్లందరికీ ఓటర్‌ స్లిప్పులు అందించాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని, అవసరమైన మేరకు సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉండే కంప్యూటర్‌ పరిజ్ఞానం గల యువతను వెబ్‌కాస్టింగ్‌కు వినియోగించుకోవాలన్నారు. గతంలో స్లిప్పులు అందలేదని ఫిర్యాదులు చాలా వచ్చాయని, పోలింగ్‌ కేంద్రాలవారీగా ముద్రించి పకడ్బందీగా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారిని ఏర్పాటు చేయాలని, పంపిణీకి ముందుగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలపాలని వివరించారు. ప్రతిరోజు నివేదిక అందించాలన్నారు.

వెబ్‌కాస్టింగ్‌కు జేఎన్‌టీయూ విద్యార్థులు

ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్‌కు జేఎన్‌టీయూ (నాచుపల్లి) కళాశాలకు చెందిన 500 మంది విద్యార్థుల సేవల ను వినియోగిస్తామని, వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ క ల్పించాలని కోరామని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అ న్నారు. ఓటరు స్లిప్పులు ప్రతి ఒక్కరికీ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, సీ విజిల్‌ యాప్‌ను ప్రతిఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకునేలా అవగాహన కల్పించామని వివరించారు. ఓటరు స్లిప్‌లు పంపిణీ చేసి సంతకం తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మోడల్‌, మహిళ, యువత, పీడబ్ల్యూ ప్ర త్యేకంగా ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్‌.లత, దివాకర, ఆర్డీవోలు నర్సింహమూర్తి, రాజేశ్వర్‌, దేవరాజ్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌

Advertisement
Advertisement