ఉత్తమ నాటిక కొత్త పరిమళం | Sakshi
Sakshi News home page

ఉత్తమ నాటిక కొత్త పరిమళం

Published Tue, Mar 28 2023 12:40 AM

ఉత్తమ నాటిక కొత్త పరిమళం   - Sakshi

తాడేపల్లిగూడెం : ఇండియా పాకిస్థాన్‌ దేశాల సరిహద్దుల వద్ద సమస్యలకు అద్దం పట్టిన కొత్త పరిమళం నాటిక బీవీఆర్‌ కళాకేంద్రంలో నిర్వహించిన 30వ జాతీయ ఆహ్వాన నాటిక పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. దీనిని శర్వాణి గ్రామీణ గిరిజన సంఘం, బోరివంక, శ్రీకాకుళం వారు ప్రదర్శించారు. ఆదివారం అర్ధరాత్రితో నాటిక పోటీలు ముగిశాయి. ఫలితాలను న్యాయనిర్ణేతలు ప్రకటించారు. సంసారాల్లో వేధింపులను ఎదుర్కొని ఎలా కాపురాలు చేసుకోవాలనే అంశంతో ఈ ప్రదర్శించిన ప్రేమతో నాన్న నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. దీనిని శ్రీసాయి ఆర్ట్స్‌ కొలకులూరు వారు ప్రదర్శించారు. జీవిత చరమాంకంలో భార్యాభర్తలను వేరువేరుగా ఉంచకూడదని, వారి తనువులు వేరైనా, మనస్సు ఒకటే అనే ఇతివృత్తంతో హేలాపురి కల్చరల్‌ అసోసియేషన్‌ ఏలూరు వారు ప్రదర్శించిన మనస్సున మనస్సై నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. కొత్తపరిమళం టీమ్‌కు నూతలపాటి సాంబయ్య మాస్టారు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక నాటక కళాపరిషత్‌ల సమాఖ్య అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు జ్ఞాపికలను అందజేశారు.

ప్రేమతో నాన్నకు ద్వితీయం

ముగిసిన నాటిక పోటీలు

ద్వితీయ ఉత్తమ ప్రదర్శన ప్రేమతో నాన్న
1/2

ద్వితీయ ఉత్తమ ప్రదర్శన ప్రేమతో నాన్న

తృతీయ ఉత్తమ ప్రదర్శన మనస్సు నమనస్సై
2/2

తృతీయ ఉత్తమ ప్రదర్శన మనస్సు నమనస్సై

Advertisement
Advertisement