డబుల్‌ సెంచరీతో షురూ- నిఫ్టీ హాఫ్‌ సెంచరీ | Sakshi
Sakshi News home page

డబుల్‌ సెంచరీతో షురూ- నిఫ్టీ హాఫ్‌ సెంచరీ

Published Fri, Aug 28 2020 9:41 AM

Sensex double century- Nifty half century- Banking up - Sakshi

సెప్టెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ చేయగా.. నిఫ్టీ హాఫ్‌ సెంచరీ సాధించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 225 పాయింట్లు జంప్‌చేసి 39,338కు చేరింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 11,626 వద్ద ట్రేడవుతోంది. వరుసగా ఐదో రోజు గురువారం యూఎస్‌ ఇండెక్స్‌ ఎస్‌అండ్‌పీ సరికొత్త గరిష్టం వద్ద నిలవడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. 

మీడియా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, బ్యాంకింగ్‌, మెటల్, ఐటీ 1.3-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌, బీపీసీఎల్‌, జీ, ఓఎన్‌జీసీ, ఐవోసీ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌, ఐసీఐసీఐ, యూపీఎల్‌, టెక్‌ మహీంద్రా 3.7-1.2 శాతం మధ్య ఎగశాయి. అయితే టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్రిటానియా, హీరో మోటో 1-0.5 శాతం  మధ్య నీరసించాయి.

ఎన్‌ఎండీసీ ప్లస్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఎన్‌ఎండీసీ, ఐడియా, సెయిల్‌, భెల్‌, కెనరా బ్యాంక్‌, జీఎంఆర్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఐబీ హౌసింగ్‌, బీవోబీ, జిందాల్‌ స్టీల్‌, బీఈఎల్‌, పీవీఆర్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 8.4-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క డీఎల్‌ఎఫ్‌, జూబిలెంట్‌ ఫుడ్, కమిన్స్‌, బ్రిటానియా, బెర్జర్‌ పెయింట్స్‌ 1.2-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.9-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1277 లాభపడగా.. 518 నష్టాలతో కదులుతున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement