ఈ రాశివారు కార్యక్రమాలలో విజయం సాధిస్తారు | Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశివారు కార్యక్రమాలలో విజయం సాధిస్తారు

Published Sun, Mar 20 2022 6:19 AM

Today Horoscope In Telugu 20-03-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం తిథి బ.విదియ ఉ.11.29 వరకు తదుపరి తదియ, నక్షత్రం చిత్త రా. 12.12 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం ఉ.8.34 నుండి 10.08 వరకు, దుర్ముహూర్తం సా.4.32 నుండి 5.20 వరకు అమృతఘడియలు... సా.5.57 నుండి 7.29 వరకు.

సూర్యోదయం        :  6.07
సూర్యాస్తమయం    :  6.06
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 


మేషం...కార్యక్రమాలలో విజయం. ఆప్తుల నుంచి శుభసందేశాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాలు కొన్ని తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం...కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం....వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం....శుభకార్యాలకు హాజరవుతారు. ఆప్తుల నుంచి కీలక సందేశం. భూవివాదాలు తీరే సమయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

సింహం... అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

కన్య....సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. ధన,వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

తుల...వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోనని సమస్యలు.

వృశ్చికం...సన్నిహితులతో సఖ్యత. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా ఉంటాయి. పనులు సకాలంలో చక్కదిద్దుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

ధనుస్సు....మిత్రుల నుంచి ఆహ్వానాలు. రుణబాధలు తొలగుతాయి. ఊహించని ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం....వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

కుంభం....పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. భూవివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మీనం.....సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. నూతన విద్యావకాశాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement