Today Rashifal In Telugu | Today Horoscope In Telugu 14-03-2022 - Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు దక్కుతాయి, ప్రముఖులతో పరిచయాలు..

Published Mon, Mar 14 2022 6:19 AM

Today Horoscope In Telugu 14-03-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం,ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం,తిథి శు.ఏకాదశి ఉ.10.33 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం పుష్యమి రా.8.54 వరకు తదుపరి ఆశ్లేష, వర్జ్యం..లేదు, దుర్ముహూర్తం ప.12.33 నుండి 1.22 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.44 వరకు అమృతఘడియలు...ప.1.54 నుండి 2.44 వరకు..

రాశి ఫలాలు..
మేషం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
వృషభం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో సమస్యలు.
కర్కాటకం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం.
కన్య: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
తుల: పరిచయాలు విస్తరిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
వృశ్చికం: దూరప్రయాణాలు. పనుల్లో తొందరపాటు. ధనవ్యయం. కుటుంబంలో కొత్త సమస్యలు. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
ధనుస్సు: శ్రమ పెరుగుతుంది. సోదరులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.
మకరం: నూతన పరిచయాలు. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
కుంభం: పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు అందుతాయి. వాహనాలు కొంటారు. సోదరులతో సఖ్యత. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు. దూరప్రయాణాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.
 

Advertisement
Advertisement