ఈ రాశివారికి ఆస్తి లాభ సూచనలు | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి ఆస్తి లాభ సూచనలు

Published Tue, Feb 2 2021 6:45 AM

Daily Horoscope In Telugu 2-2-2021 - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి బ.పంచమి సా.6.24 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం హస్త రా.12.46 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం ఉ.10.01 నుంచి 11.33 వరకు, దుర్ముహూర్తం ఉ.8.50 నుంచి 9.34 వరకు, తదుపరి రా.10.56 నుంచి 11.47 వరకు అమృతఘడియలు... రా.7.06 నుంచి 8.34 వరకు.

సూర్యోదయం :    6.36
సూర్యాస్తమయం    :  5.51
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు:
మేషం: ఆశ్చర్యకరమైన రీతిలో సొమ్ము అందుతుంది. వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలస్థితిలో ఉంటాయి.

వృషభం: వ్యతిరేకుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

మిథునం: పనుల్లో గందరగోళం. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కుటుంబంలో ఒడిదుడుకులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తిలాభం. చిన్ననాటి మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు,ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరతాయి.

సింహం: వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య: ఆహ్వానాలు అందుతాయి.. బాకీలు వసూలవుతాయి. కష్టానికి ఫలితం కనిపిస్తుంది. పరపతి పెరుగుతుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

తుల: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి లాభ సూచనలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకులు.

కుంభం: ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.

మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. 

Advertisement
Advertisement