Sakshi News home page

కలెక్టర్‌, ఎస్పీ సుడిగాలి పర్యటన

Published Fri, Mar 29 2024 1:50 AM

- - Sakshi

● నర్సీపట్నం, గొలుగొండలో పోలింగ్‌ కేంద్రాలు, చెక్‌పోస్టుల తనిఖీ

నర్సీపట్నం/గొలుగొండ: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు రవి పట్టన్‌శెట్టి ఎస్పీ మురళీకృష్ణతో కలిసి గురువారం నర్సీపట్నం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పోలింగ్‌ కేంద్రాలను, చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలిచ్చారు. ముందుగా నర్సీపట్నం మండలం గబ్బాడ ప్రాథమిక పాఠశాలలో 182, 183 పోలింగ్‌ కేంద్రాలను, అనంతరం ఎర్రన్నపాలెం చెక్‌పోస్టును తనిఖీ చేశారు. అనంతరం గొలుగొండ మండలం జోగంపేటలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను తనిఖీ చేశారు. ఆపై కృష్ణదేవిపేటలో చెక్‌పోస్టును తనిఖీ చేశారు. అల్లూరి, అనకాపల్లి జిల్లా సరిహద్దు కావడంతో ఇక్కడ చెక్‌పోస్టు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక్కడ పోలింగ్‌ కేంద్రాలతోపాటు ఏఎల్‌పురంలో పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా నగదు, మద్యంతోపాటు ఎన్నికల తాయిలాలకు సంబంధించి ఎటువంటి వస్తువులు రవాణా చేసినా కేసు నమోదు చేయాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కింద స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నర్సీపట్నం ఆర్డీవో జయరాం, కృష్ణదేవిపేట ఎస్‌ఐ ఉపేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మద్యం, మాదక ద్రవ్యాల సరఫరాపై చర్యలు: కలెక్టర్‌

తుమ్మపాల: మద్యం, మాదక ద్రవ్యాల సరఫరాపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి తెలిపారు. గురువారం తాడేపల్లి నుంచి ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌, ఎస్పీ కె.వి.మురళీకృష్ణ పాల్గొన్నారు. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు తాటిపర్తి, ఏఎల్‌పురం, కోనాం, గొలుగొండ ప్రాంతాల వద్ద నాలుగు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. పోలీసు ఎకై ్సజ్‌ శాఖల అధికారుల నిరంతర నిఘా ఉంటుందన్నారు. పోలీసు సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ఉత్పత్తి, నివారణకు పోలీసు ఎకై ్సజ్‌ శాఖల అధికారులు ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు, నడక మార్గాల్లోనూ నిఘా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ బి.విజయభాస్కర్‌, ఎకై ్సజ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement