-
IPL 2024: గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ
గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 89 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 65 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. సందీప్ వారియర్ బౌలింగ్‌లో అభిషేక్ పోరెల్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఢిల్లీ 90 బంతుల్లో 25 పరుగులు చేస్తే గెలుస్తుంది రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 6 బంతుల్లో 7 పరుగులు చేసి పృథ్వీ షా ఔటయ్యాడు. సందీప్ వారియర్ బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్‌కు క్యాచ్ ఇచ్చి షా పెవిలియన్ బాట పట్టాడు. టార్గెట్ 90.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ 10 బంతుల్లో 20 పరుగులు చేసి ఫ్రేసర్ ఔటయ్యాడు. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌కు క్యాచ్ ఇచ్చి ఫ్రేసర్ పెవిలియన్‌కు చేరాడు. టార్గెట్ 90.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ 90 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్ ఫ్రేసర్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 2 బంతుల్లో ఒక్క పరుగు చేశాడు. 1.5 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 25/0గా ఉంది. ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. 89 పరుగులకే కుప్పకూలిన గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌పై ఎదురుదాడికి దిగింది. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌కీపర్ రిషబ్ పంత్ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్ కోల్పోయిన గుజరాత్ 66 పరుగుల వద్ద గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా (10) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ 48 పరుగుల వద్ద గుజరాత్ ఆరో వికెట్ కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 9వ ఓవర్లో అభినవ్ మనోహర్ (8), షారుక్ ఖాన్‌లను (0) రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 61/6గా ఉంది. రషీద్ ఖాన్ (12), రాహుల్ తెవాటియా (8) క్రీజ్‌లో ఉన్నారు. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్ గుజరాత్ టైటాన్స్ 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదో ఓవర్ ఆఖరి బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (2) ఔటయ్యాడు. మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ 4.1వ ఓవర్: మూడు బంతుల వ్యవధిలో గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్ ఐదో బంతికి ముకేశ్ కుమార్ సాహాను (2) క్లీన్ బౌల్డ్ చేయగా.. ఐదో ఓవర్ తొలి బంతికి సాయి సుదర్శన్ (12) రనౌటయ్యాడు. 4.5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 30/3గా ఉంది. డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 1.5వ ఓవర్: 11 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (8) ఔటయ్యాడు. సాహా, సాయి సుదర్శన్ క్రీజ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) కొనసాగుతుంది. తుది జట్లు.. గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, స్పెన్సర్ జాన్సన్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ -
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్‌లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్‌హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్‌రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్‌మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. -
IPL 2024, DC VS KKR: ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్
ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్ ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పంత్ ఔట్ మెరుపు అర్దశతకం బాదిన అనంతరం పంత్ (55) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చితక్కొడుతున్న పంత్.. 23 బంతుల్లో ఫిఫ్టి వెంకటేశ్ అయ్యర్ వేసిన 12వ ఓవర్లో పంత్ చెలరేగిపోయాడు. నాలుగు ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు పిండుకున్నాడు. పంత్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని కేవలం 23 బంతుల్లోనే పూర్తి చేశాడు. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోర్ 125/4గా ఉంది. పోరాడుతున్న పంత్, స్టబ్స్ 273 పరుగల లక్ష్య ఛేదనలో 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీని రిషబ్ పంత్ (11 బంతుల్లో 23; 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 9 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్ 83/4గా ఉంది. పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలుతుంది. 33 పరుగులకే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అనంతరం వార్నర్ (18) ఔటయ్యాడు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోర్ 40/4గా ఉంది. రిషబ్ పంత్ (6), ట్రిస్టన్ స్టబ్స్ (1) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 27 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పోరెల్ (0) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 26 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ స్టార్క్ (0) ఔటయ్యాడు.డేవిడ్ వార్నర్‌కు (11) జతగా అభిషేక్ పోరెల్ (0) క్రీజ్‌లోకి వచ్చాడు. 273 పరుగుల లక్ష్యం.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగుల వద్ద వైభవ్ అరోరా బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి పృథ్వీ షా (10) ఔటయ్యాడు. వార్నర్‌తో (10), మిచెల్ మార్ష్ జత కలిశాడు. వీరంగం సృష్టించిన కేకేఆర్ బ్యాటర్లు.. ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. టాపార్డర్ బ్యాటర్లు పోటాపోటీపడి విధ్వంసం సృష్టించారు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్ నమోదైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన 277 స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రఘువంశీ ఔట్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి అనంతరం రఘువంశీ ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ క్యాచ్ పట్టాడు. 14 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 181/3గా ఉంది. రసెల్ (9), శ్రేయస్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రఘువంశీ కేకేఆర్ యువ ఆటగాడు రఘువంశీ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 171/3గా ఉంది. రఘువంశీకి జతగా రసెల్ (5) క్రీజ్‌లో ఉన్నాడు. చితకబాది ఔటైన నరైన్.. కేకేఆర్ స్కోర్ 164/2 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసిన సునీల్ నరైన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతికి మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 164/2గా ఉంది. రఘువంశీకి (49) జతగా రసెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసిన కేకేఆర్ సునీల్ నరైన్ (32 బంతుల్లో 74; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) , రఘువంశీ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) ధాటికి కేకేఆర్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన నరైన్ కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ శివాలెత్తిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కేకేఆర్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ 4.3వ ఓవర్: 60 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ (18) ఔటయ్యాడు. విధ్వంసం సృష్టిస్తున్న సునీల్ నరైన్ కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. ఇషాంత్ వేసిన మూడో ఓవర్లో నరైన్ మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు బాదాడు. ఫలితంగా ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 58/0గా ఉంది. నరైన్‌తో పాటు ఫిలిప్ సాల్ట్ (16) క్రీజ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 3) ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి ఏడో స్థానంలో నిలిచింది. తుది జట్లు.. కోల్‌కతా నైట్‌రైడర్స్: ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్‌కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ -
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 30 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,992 భక్తులు దర్శించుకున్నారు. అందులో 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.53 కోట్లుగా లెక్క తేలింది. నిఘా వేశాం.. ఆందోళన వద్దు తిరుమలలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేగుతున్న వేళ అటవీశాఖ అధికారులు స్పందించారు. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. "మార్చి 4 నుండి ఇప్పటి వరకు 5 సార్లు చిరుత సంచారం గుర్తించాము. 250 అధునాతన కెమెరాలను ఏర్పాటు చేసాం. 4g నెట్ వర్క్ కెమెరాల ద్వారా జంతువుల సంచారం వెంటనే అలర్ట్ చేస్తుంది. క్రూర మృగాల సంచారం, చిరుతలు సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది అలెర్ట్ చేస్తాం. టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, వైల్డ్ లైఫ్ సిబ్బంది నడకదారిలో భద్రత చర్యలు చేపడుతాము.. ఏడవ మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తులను గుంపులుగా పంపుతాము భయపడాల్సిన అవసలేదు అన్నారు. అలాగే.. ప్రభుత్వం నియమించిన జాయింట్ కమిటీ ఇప్పటికి మూడు మార్లు తిరుమలలో పర్యటించారు. ఏప్రిల్ మొదటి వారంలో జాతీయస్థాయి వైల్డ్ లైఫ్ కమిటీ సమావేశం అవుతుంది. నడకదారిలో తీసుకోవల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనున్నారు.. భక్తులు అటవీ ప్రాంతంలో వెళ్ల రాదు, శేషాచల కొండల్లో నీటికి కొరత లేదు, ఏనుగులు ప్రతి సంవత్సరం ఒకచోట నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంటాయి. అధునాతన థర్మల్ డ్రోన్ కెమరా రాత్రి సమయంలో కూడా జంతువుల సంచారం పై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు". -
IPL 2024: సన్‌రైజర్స్ చేతిలో చిత్తైన ముంబై ఇండియన్స్
IPL 2024 SRH VS MI Match Highlights And Updates: బ్యాటర్ల ఊచకోత.. ముంబైను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. ఫలితంగా ఆరెంజ్ ఆర్మీ 31 పరుగుల తేడాతో ముంబైను చిత్తు చేయడంతో పాటు లీగ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 12 ఓవర్ల వరకు సన్‌రైజర్స్ ధీటుగా బదులిచ్చింది. అయితే ఆ తర్వాత స్కోర్ నెమ్మదించడంతో ముంబై ఓటమి ఖరారైంది. ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), నమన్ ధిర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్), రొమారియో షెపర్డ్ (6 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సన్‌రైజర్స్ శిబిరంలో కలకలం సృష్టించారు. ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ముంబై గెలుపుకు 30 బంతుల్లో 93 పరుగులు అవసరం ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 30 బంతుల్లో 93 పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా (20), టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉన్నారు. 15 ఓవర్ తొలి బంతికే కమిన్స్ తిలక్ వర్మ (64) ఔట్ చేశాడు. 15 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 185/గా ఉంది. రఫ్ఫాడిస్తున్న తిలక్.. 10 ఓవర్లలో ముంబై స్కోర్ 141/2 తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో తిలక్ 3 సిక్సర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. తిలక్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/2గా ఉంది. తిలక్‌తో (52) పాటు నమన్ ధిర్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. 7.3 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌కు ధీటుగా ముంబై ఇండియన్స్ బదులిస్తుంది. ముంబై 7.3 ఓవర్లలనే 100 పరుగుల మార్కును తాకింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (16), తిలక్ వర్మ (19) క్రీజ్‌లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 102/గా ఉంది. టార్గెట్ 278.. ధీటుగా బదులిస్తున్న ముంబై 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధీటుగా బదులిస్తుంది. ఆ జట్టు 5 ఓవర్ల అనంతరం 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (2), తిలక్ వర్మ (1) క్రీజ్‌లో ఉన్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్ల వీరంగం.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు ముంబై ఇండియన్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు సుడిగాలి అర్దశతకాలు బాదారు. ట్రవిస్ హెడ్ 24 బంతుల్లో 62, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 80 పరుగులు (నాటౌట్) చేశారు. మార్క్రమ్ సైతం తానేమీ తక్కువ కాదని 28 బంతుల్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్లాసెన్ హెన్రిచ్ క్లాసెన్ కేవలం 23 బంతుల్లో బౌండరీ, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 18 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 243/3గా ఉంది. క్లాసెన్‌తో పాటు మార్క్రమ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు. 14.4 ఓవర్లలోనే 200 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ కేవలం 14.4 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును తాకింది. మార్క్రమ్ (31), క్లాసెన్ (26) క్రీజ్‌లో ఉన్నారు. 12 ఓవర్లలోనే 173 పరుగులు చేసిన సన్‌రైజర్స్ 11వ ఓవర్ ఆఖరి బంతికి అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔటయ్యాడు. పియూశ్ చావ్లా బౌలింగ్‌లో నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 173/3గా ఉంది. మార్క్రమ్ (21), క్లాసెన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అభిషేక్ (54), మార్క్రమ్ (13) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన హెడ్.. పెను విధ్వంసం సృష్టించిన అనంతరం హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కొయెట్జీ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 117/2గా ఉంది. అభిషేక్ (32), మార్క్రమ్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. పవర్ ప్లేలో (81/1) సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక స్కోర్. 7 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ ఆటగాళ్లు శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ట్రవిస్ హెడ్ (22 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. హెడ్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో అభిషేక్ శర్మ సైతం చెలరేగిపోయాడు. పియూశ్ చావ్లా వేసిన ఆ ఓవర్లో అభిషేక్ మూడు సిక్సర్లు బాదాడు. తొలి బంతికే వికెట్ తీసిన హార్దిక్ 4.1 ఓవర్: హార్దిక్ పాండ్యా తన స్పెల్ తొలి బంతికే వికెట్ తీశాడు. టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (11) ఔటయ్యాడు. వీరంగం సృష్టిస్తున్న ట్రవిస్ హెడ్ సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ వీరంగం సృష్టిస్తున్నాడు. కేవలం 10 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. యువ పేసర్ మపాకా వేసిన మూడో ఓవర్లోనే హెడ్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో హెడ్ వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. 4 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. హెడ్ (32),మయాంక్ అగర్వాల్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 27) సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30య గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలై బోణీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపాలైంది. తొలి మ్యాచ్‌లో దెబ్బతిన్న ఇరు జట్లు బలాబలాల విషయంలో సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మకు ఆ జట్టు తరఫున 200వ మ్యాచ్ కావడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేన మపాకా ముంబై ఇండియన్స్ సబ్స్: డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా సన్‌రైజర్స్ హైదరాబాద్ సబ్‌లు: నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, ఉపేంద్ర యాదవ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కాంగ్రెస్‌కు మరో దెబ్బ! పార్టీకి పరిశీలకుల గుడ్‌బై!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఆ్రస్టేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్‌డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
Advertisement