-
రైలు ప్రయాణికులకు అలర్ట్.. రిజర్వేషన్ సేవలకు బ్రేక్!
ఢిల్లీ, చుట్టుపక్కల రాష్ట్రాలలో నడిచే రైళ్లకు రిజర్వేషన్ చేయాలనుకుంటున్న ప్రయాణికులు శుక్రవారం రాత్రికి ముందే చేసేయండి. ఎందుకంటే ఢిల్లీ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)కు సంబంధించిన అన్ని సేవలు శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు పనిచేయవు. అయితే, సర్వీసులు నిలిచిపోయిన సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే అసౌకర్యానికి గురవుతారని రైల్వే పేర్కొంది. చాలా కొద్ది మంది మాత్రమే ఈ సేవలను ఉపయోగిస్తున్నారని రైల్వే చెబుతోంది. పీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ఐదు నగరాల నుండి పనిచేస్తుంది. వీటిలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, గౌహతి ఉన్నాయి. ఢిల్లీ పీఆర్ఎస్ వ్యవస్థను శుక్రవారం రాత్రి తాత్కాలికంగా మూసివేయనున్నారు. అంటే ఢిల్లీ పీఆర్ఎస్ ద్వారా నిర్వహించే అన్ని రైళ్లలో రిజర్వేషన్, రద్దు, విచారణ (139, కౌంటర్ సర్వీస్), ఇంటర్నెట్ బుకింగ్‌తో సహా అన్ని రకాల సేవలు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11.45 గంటల నుండి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 04.15 గంటల వరకు దాదాపు 04.30 గంటల పాటు నిలిచిపోతాయి. ఈ సమయంలో ఢిల్లీ పీఆర్ఎస్కు సంబంధించిన ఏ పనిని మరే ఇతర నగరంలోని పీఆర్ఎస్ నుండి చేయలేము. రిజర్వేషన్ లేదా మరేదైనా పనిని పూర్తి చేయాలనుకుంటే, శుక్రవారం రాత్రికి ముందే పూర్తి చేయండి.. లేకపోతే మీరు శనివారం ఉదయం మాత్రమే పూర్తి చేయగలుగుతారు. -
రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?
సాధారణంగా రైలు ప్రయాణాల్లో ఒక్కొసారి విలువైన వస్తువులు పొరపాటున మర్చిపోతుంటాం. చాలామంది వాటిని తిరిగి పొందేందుకు(క్లైయిమ్ చేసుకునేందుకు) ప్రయత్నించారు. ఆ ఇంకెక్కడుంటుంది. ఈపాటికి ఎవరో ఒకళ్లు పట్టుకుపోయి ఉంటారులే అనుకుంటారు. ఓ మూడు, నాలుగురోజులు అబ్బా..! అలా ఎలా వదిలేశాను? అని తెగ బాధపపడిపోతూ.. మర్చిపోయే యత్నం చేస్తారు. చాలామటుకు అందరూ ఇలానే చేస్తారు. అలా బాధపడనక్కర్లేకుండా ఆ వస్తువులను ఎలా తిరిగి సంపాదించుకోవాలి? వాటిని రైల్వే అధికారులు, సిబ్బంది ఏం చేస్తారు తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!. రైలులో ఎవ్వరైనా ఏదైన విలువైన వస్తువు మర్చిపోతే బాధపడుతూ కూర్చొనవసరం లేదు. పైగా ఇక దొరకదనుకుని డిసైడ్ అయ్యే పోనక్కర్లేదు. ఏం చేయాలంటే?..మనం వస్తువుని రైల్లో మరచిన వెంటనే చేయాల్సింది.. మన టిక్కెట్‌ని జాగ్రత్త చేయాలి. ఇప్పుడూ మొబైల్ ఫోన్‌కి టికెట్ వచ్చినట్లు మెసేజ్ వస్తుంది కాబట్టి దాన్ని డిలీట్ చేయకూడదు. ఆ తర్వాత మనకు సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌కి వెళ్లి అక్కడ అధికారులకు తెలియజేయాలి. వారు విచారించి మీరు ప్రయోణించిన ట్రైయిన్ తాలుకా లిస్ట్ తీసి.. ఆ రైలు లాస్ట్ స్టేషన్ వద్ద సిబ్బంది కలెక్ట్ చేసిని వస్తువుల సమాచారం లిస్ట్‌ని తీయడం జరుగుతుంది. ఆయా వ్యక్తులు పలానా ట్రెయిన్లో తాము ఈ వస్తువు మర్చిపోయామని పూర్తి వివరాలను తెలియజేస్తే..ఆ జాబితాలో ఉందా లేదా అనేది నిర్థారిస్తారు అధికారులు. ఆ తర్వాత సదరు వ్యక్తి కోల్పోయిన వస్తువు వివరాలు, ప్రయాణించిన ట్రైయిన టిక్కెట్ ఆధారంతో అతడి వస్తువని నిర్థారించుకుంటారు. ఆ తర్వాత రైల్వే అధికారులు అతడు పొగొట్టుకున్న వస్తువులను అందచేయడం జరుగుతుంది. అలాగే ఇలా రైలులో యాత్రికులు మర్చిపోయిన వస్తువులను రైల్వే సిబ్బంది కలెక్ట్ చేసి రైల్వే మాస్టర్‌కి అందజేస్తారు. ఆ తర్వాత ప్రయాణికులెవరైనా.. వచ్చి కలెక్ట్ చేసుకోవాడానికి వస్తారేమో!.. అని కొన్ని రోజులు వేచి చూస్తారు. రానీ పక్షంలో వాటిని వేలం ద్వారా విక్రయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే రైల్వే అధికారిక మార్గదర్శకాలను తెలుసుకుంటే సరిపోతుంది. అది ఐఆర్సీటీసీ సైట్లో లేదా రైల్వేస్టేషన్ అడిగి సవివరంగా తెలుసుకోవచ్చు. ఇక నుంచి రైలులో వస్తువు పోతే దొరకదని వదిలేయకండి. కనీసం రైల్వే హెల్ప్ సెంటర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే యత్నం చేయండి. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!) -
చర్లపల్లి టెర్మినల్ నుంచి త్వరలో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నాలుగో రైల్వే టెర్మినల్‌గా చర్లపల్లి స్టేషన్ సేవలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే రూ.221 కోట్లతో చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్‌ను విస్తరించారు. సరుకు రవాణాకు పార్శిల్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రస్తుతం పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్ల రాకపోకలను నియంత్రించవలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే చర్లపల్లి స్టేషన్ విస్తరణ పూర్తి కావడంతో మార్చి నుంచి కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాని మోదీతో ప్రారంభం! ప్రధాని మోదీతోనే త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. అదే రోజు రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే... ► షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045/18046) త్వరలో సికింద్రాబాద్‌కు బదులు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్‌కు నడిచే చార్మి నార్ ఎక్స్‌ప్రెస్ (12603/12604) చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► గోరఖ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి నడుపనున్నారు. మరో 6 రైళ్లకు హాల్టింగ్... ► హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757/12758), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్‌ప్రెస్ రైళ్లను మార్చి నుంచి చర్లపల్లి స్టేషన్లో నిలుపనున్నారు.ఈ మేరకు రైల్వేబోర్డు అనుమతులను ఇచ్చింది. -
40వేల నార్మల్ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు పెంచుతాం
-
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 27 వరకు విశాఖపట్నం–సికింద్రాబాద్ (08579), ఫిబ్రవరి 8 నుంచి మార్చి 28 వరకు సికింద్రాబాద్–విశాఖపట్నం (08580), ఫిబ్ర వరి 5 నుంచి మార్చి 25 వరకు విశాఖపట్నం–తిరుపతి (08583), ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు తిరుపతి–విశాఖపట్నం (08584), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు విశాఖపట్నం–బెంగళూరు (08543) ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 1 వరకు బెంగళూరు–విశాఖపట్నం (08544), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు భువనేశ్వర్–తిరుపతి (02809), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు తిరుపతి–భువనేశ్వర్ (02810), ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 29 వరకు పాట్నా–సికింద్రాబాద్ (03253), ఫిబ్రవరి 7 నుంచి మే 1 వరకు హైదరాబాద్–పాట్నా (07255), ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 26 వరకు సికింద్రాబాద్–పాట్నా (07256), ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 25 వరకు ధనాపూర్–సికింద్రాబాద్ (03225), ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 28 వరకు సికింద్రాబాద్–ధనాపూర్ (03226), ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్ 28 వరకు బెంగళూరు–ధనాపూర్ (03242) రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని పలు సెక్షన్లలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 2న నర్సాపూర్–హుబ్లీ (17225), ఫిబ్రవరి 3న హుబ్లీ–నర్సాపూర్ (17226), హుబ్లీ–గుంతకల్లు (07337), గుంతకల్లు–హుబ్లీ (07338), బల్గెవి–కాజీపేట (07335), ఫిబ్రవరి 4న కాజీపేట–బల్గెవి (07336) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్‌పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement