-
పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
సాక్షి నెట్వర్క్: ఓటమి భయం వెంటాడుతుండటంతో టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు హాజరయ్యే ఉద్యోగులను ప్రలోభపెట్టేలా.. ఎన్నికల నియమావళి యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అకృత్యాలకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసింది.వివిధ ప్రాంతాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాలకు పోలీసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాగా.. వారిని సామ, దాన, దండోపాయాలతో లోబర్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే నగదు పంపిణీ చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై పచ్చదండు దాడులకు యత్నించింది. టీడీపీ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలుగా పనిచేసిన వారితో ఉద్యోగులకు ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు. కొన్నిచోట్ల పోలింగ్ అధికారులను, పోలీసులను సైతం బెదిరించారు.విశాఖలో ఇలా..సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ఏయూ తెలుగు, ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో చేపట్టారు. పోలింగ్ కేంద్రం ఎదురుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు అనుచరులు హల్చల్ చేశారు. వెలగపూడి అనుచరుడు కాళ్ల శంకర్, టీడీపీ నాయకుడు పోతన్న రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొట్ట వెంకట రమణ అక్కడే ఉండి ప్రత్యక్షంగా టీడీపీకి ప్రచారం చేశారు. వెలగపూడికి చెందిన రెండు ప్రచార వాహనాలు ఏయూ ఇన్‌గేట్, అవుట్ గేట్ మధ్యలో భారీ శబ్ధంతో కూడిన మైక్‌లను పెట్టుకుని అటూఇటూ తిరుగుతూ ప్రచారం చేశారు. కొంతమంది ఓటర్లకు డబ్బులు పంపిణీ, మరికొందరికి గూగుల్‌పే, ఫోన్ పే చేస్తూ ప్రలోభాలకు గురి చేశారు.చిత్తూరులోనూ ఇదే పద్ధతితిరుపతిలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం పేరుతో టీడీపీ నేతలు హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రాలకు అత్యంత సమీపంలోనే కొందరు ఓటర్లకు బలవంతంగా నగదు పంపిణీకి యత్నించారు. ఎన్నికల అధికారులను, పోలీసుల హెచ్చరికలను సైతం ఏమాత్రం లెక్కచేయలేదు. ఉద్యోగ సంఘ మాజీ నేతలు కొందరు ప్రలోభాల పర్వానికి సహకరించారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో టీడీపీ ప్రచార వాహనాలు యథేచ్ఛగా తిరిగినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు.చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేశారు. పుంగనూరులో ఓటర్లను బెదిరించారు. పూతలపట్టులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. పలమనేరులోని ఓ హోటల్లో ఉద్యోగులకు విందు ఏర్పాటు చేశారు. నగరిలో ఉపాధ్యాయులకు యూనియన్ మాజీ నేతల ద్వారా ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు.పులివెందులలో అధికారికి బెదిరింపువైఎస్సార్ జిల్లా పులివెందులలో పోలింగ్ ట్రైనింగ్ అధికారి సంగం మహేశ్వరరెడ్డిపై టీడీపీ నాయకులు అక్కులుగారి విజయ్‌కుమార్‌రెడ్డి, దర్బార్‌బాషా, అంజుగట్టు రవితేజారెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఆయనను దుర్భాషలాడుతూ బయటకు నెట్టివేశారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. టీడీపీ నాయకులు అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగకుండా ఇలాంటి వివాదాలకు పాల్పడుతున్నట్టు అవగతమవుతోంది.బద్వేలులోని జెడ్పీ హైస్కూల్లోని ఫెసిలిటేషన్ సెంటర్‌కు సమీపంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో తిష్టవేసిన టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీచేశారు. కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు షేక్‌హుస్సేన్ ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కాడు.తిరుపతిలో తాయిలాల ఎరతిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లోని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద టీడీపీ, జనసేన అభ్యర్థులు హల్చల్ చేశారు. ముందురోజు రాత్రే కొందరు ఉద్యోగులకు తాయిలాల ఎర చూపారు. శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సెంటర్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ హడావుడి చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించిన ఆయనను పోలీసు అధికారులు ప్రశ్నించడంతో సుధీర్ మీ అంతు చూస్తా అంటూ బూతు పురాణం అందుకున్నారు.గుంటూరులో తికమకపెట్టేలా..గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగులను తికమకపెట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నేతలు పోస్టింగ్‌లు పెట్టారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా.. అధికారుల మధ్య సమన్వయలోపం, అవగాహన రాహిత్యం బట్టబయలయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి కార్యాలయం నుంచి బ్యాలెట్ ఓటింగ్ వద్ద గొడవ జరుగుతోందని, రెచ్చగొట్టే విధంగా మెసేజ్‌లు పెట్టారు. -
Viral Video: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్ దాడి
విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులు, తోటి ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్మిస్ట్రెస్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో తీసినందుకు టీచర్‌పై దాడి చేసిన నిర్వాకం మరవక ముందే రాష్ట్రంలో ఆగ్రాలో మరో ఘటన చోటుచేసుకుంది.ఆగ్రాలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఓ ప్రిన్సిపల్-టీచర్‌పై దాడికి పాల్పడింది. బూతులు తిడుతూ, దుస్తులు చెరిగేలా భౌతిక దాడికి దిగింది. సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్ గొడవకు దిగింది. అంతేగాక టీచర్‌పై దాడి చేసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి.అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్‌తో అతడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024 -
ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనం ఏమైంది?
గజ్వేల్/పాపన్నపేట: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలకు మోసం జరిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయు లకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు వేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మాట నిలుపుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ రాకముందే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కావాల్సినంత సమయమున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. మార్చి 31న పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు అందాల్సిన డబ్బులను బాండ్ల రూపంలో ఇస్తారని లీకులు వస్తున్నాయని చెప్పారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ ఉనికే లేదని.. కేవలం రాముడిని చూపుతూ ఆ పార్టీ ఓట్లు పొందాలని ప్రయత్నిస్తోందని అన్నారు. వీడియోలతో విమర్శనాస్త్రాలు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగు తోంది. శుక్రవారం పాపన్నపేట మండలం కొత్తపల్లి లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వీడి యో క్లిప్పింగ్‌లు ప్రదర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్‌లను చూపుతూ.. ఇవి అమలు అయ్యాయా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. -
‘‘డిజిటల్ యుగంలో డా.అంబేద్కర్ భావజాలం’’ పుస్తకంపై విజయభాను కోటే రివ్యూ
పుస్తక సమీక్ష: “Dr. Ambedkar’s Ideology in the Digital Era” (రచయిత- డా. జేమ్స్ స్టీఫెన్ మేకా (రిజిస్ట్రార్-ఆంధ్ర విశ్వవిద్యాలయం) ప్రపంచం మరుపులో కూరుకుపోతున్నట్లు కనిపించినప్పుడు, కొంతమంది వ్యక్తులు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రతిధ్వనులను కలిగించే స్వరాలను ఎక్కుపెడతారు. డాక్టర్ జేమ్స్ స్టీఫెన్ మేకా గారిని తన తాజా పుస్తకం "డాక్టర్ అంబేద్కర్స్ ఐడియాలజీ ఇన్ ది డిజిటల్ ఎరా" గురించి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అదే భావోద్వేగం కలిగింది. “మీ పుస్తకం శీర్షిక వినూత్నంగా ఉంది. అసలు డిజిటల్ శకానికి, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వారధి కట్టాలని మీకు ఎలా అనిపించింది?” ఈ ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ జేమ్స్ స్టీఫన్ చూపించిన వీడియో చూసి నేను, నా సహచరుడు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురయ్యాము. డాక్టర్ అంబేడ్కర్ చైర్ గా సేవలు అందించిన డాక్టర్ జేమ్స్ స్టీఫన్ వంటి అంబేడ్కరిస్ట్ ను టీవీ కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు వేదనకు గురిచేసింది. ఈ కార్యక్రమంలో అడిగిన ఒక ప్రశ్నకు హాట్ సీట్ లో పాల్గొంటున్న వ్యక్తి మాత్రమే కాక కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులు కూడా అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం తెలియని పరిస్థితుల్లోకి భారతదేశం వెళ్లిపోతోందని అర్థం అయిన ఆయన ఆ సమస్యను తీవ్రమైన సమస్యగా గుర్తెరిగి, పరిష్కారంగా ఈ పుస్తకాన్ని రచించారు. ఆ “మీలో ఎవరు కోటీశ్వరుడు” ప్రోగ్రామ్ వీడియోలో అడిగిన ప్రశ్న, “వీరిలో బాబాసాహెబ్ గా పేరొందిన వారు ఎవరు? దీనికి పార్టిసిపెంట్‌కు జవాబు తెలియక, షోలో భాగంగా “ఆడియన్స్ పోల్” ఎంచుకోవడం, అందులో అంబేడ్కర్ కు 27శాతం మాత్రమే ఓటింగ్ రావడం, చివరికి వల్లభాయి పటేల్ అని జవాబు చెప్పడంతో తనకు సమస్య తాలూకా తీవ్రత అర్థంఅయిందనీ, పనులెన్ని ఉన్నా, లోపల మండుతున్న ఒక నిప్పు రవ్వ నిద్రపోనివ్వని కారణంగా ఈ రచన జరిగిందని చెప్తారు డా. జేమ్స్ స్టీఫన్. అంబేడ్కర్ అనుచరులు ఆయనను ఆప్యాయంగా, అభిమానంతో పిలిచే పేరు “బాబాసాహెబ్”. బాబా అంటే తండ్రి, సాహెబ్ అంటే సార్ అనే గౌరవ సంబోధన. అంబేడ్కర్ “బాబాసాహెబ్” గా భారతదేశం లోనే కాక అంతర్జాతీయంగా కూడా పేరు పొందారు. మన దేశంలో విశ్వవిద్యాలయాలు ఆయన పేరుతో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో ఒక జిల్లా, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా. అంబేడ్కర్ జయంతిని ఘనంగా జరిపే భారతావనిలో నేటి యువత ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యతను. ఆ వ్యక్తి భారతదేశానికి చేసిన అత్యున్నత సేవను, ఆ వ్యక్తి చరిత్రలో వేసిన ముద్రను తెలియని స్థితిలోకి జారిపోతున్నారన్న ఆలోచన, ప్రస్తుతం సమాజంలో, ముఖ్యంగా నేటి యువతలో అంబేడ్కర్ గురించిన అవగాహన పెంచడానికి, డిజిటల్ వ్యవస్థను వినియోగించడం ఎలా అన్న అంశాన్ని లోతైన అధ్యయనాల ద్వారా ఈ పుస్తకంలో తెలియజేశారు. అంతే కాక అంబేడ్కర్ సిద్ధాంతాలు నేటి డిజిటల్ యుగానికి ఏ రకంగా అవలంబించవచ్చో తెలియజేశారు. ఈ 20 అధ్యాయాల పుస్తకం నిజమైన అంబేద్కర్‌ను ప్రపంచానికి పరిచయం చేయవలసిన ఆవశ్యకతను వెల్లడిస్తుంది. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు అందించబడాలని నిక్కచ్చిగా చెబుతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఇండియా వీడీఎం ఇండియా ఆన్ ద మూవ్ ఛైర్మన్ ఆచార్య శ్రీ అజయ్ కుమార్ "ఈ పుస్తకం అంబేద్కర్ యొక్క విజన్, ఒక గొప్ప నాయకుని ఆశయాలు మరియు ఆలోచనలను డిజిటల్ యుగం యొక్క పరివర్తన శక్తితో సమకాలీకరించే ఉన్నతమైన పనిని పూర్తి చేస్తుంది." అన్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి సిద్ధాంతాలను ప్రస్తుత కాలానికి అన్వయించాలంటే ఆ వ్యక్తి గురించిన లోతైన అధ్యయనం చెయ్యాలి, ఆ సిద్ధాంతాలు ఏ కాలానికైనా అవలంబించదగినవని తెలియాలంటే, అనుసంధాన ప్రక్రియ బలంగా ఉండాలి. ఈ పుస్తకంలో రచయిత చేసినది అదే! చరిత్ర భవిష్యత్తుకు పునాదిగా పనిచేస్తుంది. మనం డాక్టర్ అంబేద్కర్‌ను కేవలం గురువుగా మాత్రమే కాకుండా, వారి ఆలోచనలు మరియు దృష్టిని మన భవిష్యత్తుకు అన్వయించగల వ్యక్తిగా కూడా గుర్తుంచుకోవాలి. ఏ కాలానికైనా వర్తించే ఆలోచనలను కొద్ది మంది మాత్రమే ప్రతిపాదించగలరు. అలాంటి వారిలో డాక్టర్ అంబేద్కర్ ఒకరు. డాక్టర్ అంబేద్కర్ జీవితం అన్ని కాలాలకు ఆదర్శంగా నిలుస్తుంది. జ్ఞానాన్ని ఆయుధంగా వాడుకున్న యోధుని గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. భారతదేశపు మొదటి న్యాయ మంత్రిగా ఆయన ఎప్పుడూ గుర్తింపు పొందారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని పాటించినంత కాలం ఆయన మన పౌర జీవితాల్లో జీవిస్తారు. అంబేద్కర్ తన విద్యను సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఉపయోగించారు. మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలకు ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేసుకునే హక్కు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 20 అధ్యాయాలుగా విభజించబడ్డ ఈ పుస్తకంలో ఒక్కో అధ్యాయాన్ని పుస్తకం యొక్క మూల లక్ష్యాన్ని నిర్మాణాత్మకంగా చేరేలా రచించారు. డాక్టర్ అంబేడ్కర్ జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతూ ఆయన ఎదుర్కొన్న వివక్ష ఎంత కాలం, ఎలా ఆయన జీవితాన్నివెంటాడిందో తెలియజేస్తూ, ఆయనలో వివక్షకు వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు ధోరణి, ఆ తిరుగుబాటుకు సూచనగా ఆయన విద్యను ఆయుధంగా ఎంచుకోవడం, ఆ తిరుగుబాటును వ్యక్తీకరించడానికి ఆయన రచనను ఆయుధంగా, వ్యక్తీకరణ సాధనంగా ఎంచుకోవడం గురించి సూక్ష్మంగా అయినా, పదునుగా తెలియజేస్తారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ భావజాలం అప్పట్లో ఒక తిరుగుబాటుగానే పరిగణించబడింది. తన సిద్ధాంతాలను సమాజ మార్పుకు పునాదులుగా చేయడానికి ఒక వ్యక్తి చేసిన అనితరసాధ్య, నిరంతర సంఘర్షణల ఫలితమే అంబేడ్కరిజం. ఆయన సిద్ధాంతాలు లేదా భావజాలం యొక్క పురోగతి వేల యుద్ధాలను దాటిన అనుభవంగా మనం చెప్పవచ్చు. ఇక డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి గల నాయకుడని ఆయన రచనలు చదివే ఈ నాటి యువతకు అర్థం అవుతుంది. ఆయన దృష్టిలో సమ న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక చేర్పు అనే అంశాలను నేటి సాంకేతిక యుగానికి అనుసంధానం చేస్తూ, డిజిటల్ డివైడ్ లేని సమాజం వైపు అడుగులు వేయడం వలన సాంకేతిక సమసమాజ చేర్పుకు నాంది పలకాలని పిలుపును ఇవ్వడం ఈ పుస్తకం యొక్క ఒక ముఖ్య ఉద్దేశ్యం. సాంకేతిక విప్లవం నేటి కాలపు విజయం అని అభివర్ణించే ఈ కాలంలో విద్య మరియు సాంకేతిక సాధికారత గురించి, సాంకేతిక ప్రజాస్వామ్యం గురించి రచయిత లేవనెత్తిన అంశాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇక ఈ కాలంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య సమాచార గోప్యత లేకపోవడం లేదా సమాచార దోపిడీ (మనకు తెలియకుండానే మన సమాచారం ఇతరులు వినియోగించడం. ఉదాహరణకు మనకు తెలియని కంపెనీల నుండి, బ్యాంకుల నుండి మనకు ఫోన్ రావడం రోజూ జరుగుతూనే ఉంటుంది. అది సమాచార చౌర్యం అని తెలిసినా మనకు ఏమి చెయ్యాలో తెలియదు) గురించి వివరించారు రచయిత. ప్రపంచ సమాజం మొత్తం ఇపుదు డిజిటల్ ఆక్టివిజం లోనే ఉందన్నది వాస్తవం. సాంకేతిక క్రియాశీలత వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి అని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతూనే ఉంటారు. అయితే ఈ సాంకేతిక క్రియాశీలత వలన ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయి. ఉదాహరణకు బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ సేవలను గురించి చెప్పుకోవచ్చు. మరి సామాజిక మాధ్యమాల విషయానికి వస్తే నేడు వార్తా పత్రికల కన్నా సామాజిక మాధ్యమాల ద్వారా వార్తలను తెలుసుకునేవారి సంఖ్య పెరిగింది. ఈ మాధ్యమాలు చర్చావేదికలుగా మారాయి. దేశపు సాధారణ పౌరుల నుండి అత్యున్నత అధికారులు, రాజకీయ నాయకులు కూడా తమ అకౌంట్ల ద్వారా సమాచారాన్ని, ప్రకటనలను వెలువరిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న సాంకేతిక క్రియాశీలత ద్వారా సామాజిక మార్పు సాధ్యాసాధ్యాల గురించి రచయిత విపులంగా చర్చిస్తారు. ఆల్గారిథమిక్ బయాస్ అనేది సమాజంలో ఇప్పటికే ఉన్న పక్షపాతాలను ప్రతిబింబించే డేటాపై అల్గారిథమ్‌లను రూపొందించినప్పుడు లేదా శిక్షణ ఇచ్చినప్పుడు సంభవించే దైహిక మరియు అన్యాయమైన వివక్షను సూచిస్తుంది. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను నిలబెట్టడానికి, అల్గారిథమిక్ డెసిషన్ మేకింగ్‌లో ఇటువంటి పక్షపాతాలను నిశితంగా పరిశీలించి సరిదిద్దడానికి కృషి చేయాలి. డాక్టర్ అంబేడ్కర్ భావజాలాన్ని నేటి సాంకేతిక యుగం లో సామాజిక న్యాయం మరియు సమత్వం గురించి చర్చిస్తూ, అట్టడుగు వర్గాలను ఈ డిజిటల్ యుగంలో సామాన్య హక్కుదారులుగా ఎలా చేర్చాలో చర్చిస్తారు. సాంకేతిక యుగంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్షలను కూకటివేళ్ళతో ఎలా పెకిలించాలో దిశానిర్దేశం చేస్తారు. అలాగే డిజిటల్ విద్య అవసరత, తద్వారా ఉపాధి లేదా సామాన అవకాశాల ఆవశ్యకత గురించి చర్చిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ సమసమాజ స్థాపన కొరకు పాటు పడ్డారు. అది విద్య, సాధికారత వలనే సాధ్యం అవుతుందని భావించారు. ఈ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుని, సాంకేతిక సాధికారత, సామాజిక సమానత్వం తీసుకురావడంలో సాంకేతికత పాత్ర గురించి వివరిస్తూ, జీవితకాల అభ్యాసం వలన వనగూరే లాభాలను గురించి ప్రకటిస్తారు. ఈ పుస్తకంలో ఒక మంచి అంశం చాలా చోట్ల కేస్ స్టడీస్ (ఉదాహరణ అధ్యయనాలు) ను తీసుకోవడం. డాక్టర్ అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను పునాదిగా చేసుకుని నేటి కాలపు స్థితులకు అనుగుణంగా పౌరులను చైతన్యపరచడంలో రచయిత సఫలీకృతులు అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూరదృష్టి గల సంఘ సంస్కర్త మరియు భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి. ఈ ఆదర్శాల గురించి లోతైన అంతర్దృష్టులను అందించారు. డిజిటల్ వ్యాపారంలో సైతం అసమాన్యతల తొలగింపు గురించి చర్చిస్తూ పౌర నిర్వహణ లేదా పౌర భాగస్వామ్యం గురించి రాసిన విధానం పౌరులందరినీ ఆలోచింపజేస్తుంది. అట్టడుగు వర్గాలకు అందని కొన్ని ప్రయోజనాలు, అనుమతి అసమాన్యతల గురించి చర్చిస్తూ భౌగోళిక అంశాలను గురించి వివరించడం, ఆన్లైన్ అభ్యాస మార్గాలలో అసమానతల నిర్మూలనకు మార్గాలను నిర్దేశించడం జరిగింది. అసమానతలు దేశ ఆర్థికాభివృద్ధిపై చూపే ప్రభావం, వ్యవస్థాపకత లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి కారణాలను తెలియజేస్తుంది ఒక అధ్యాయం. ఇక ఆన్లైన్ అంశాలలో బ్లాగింగ్, వీడియోల ద్వారా సమాచార ప్రచారం, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార ప్రసారం మొదలైన ఎన్నో విషయాలను చర్చిస్తాయి ఇందులోని అధ్యాయాలు. నేటి కాలంలో టెలీ మెడిసిన్, ఆన్లైన్ హెల్త్ కేర్ మొదలైన అంశాలను కూడా తన పుస్తకంలో చేర్చారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ సూత్రాల ఆధారంగా సాంకేతిక అసమానతలను అధిగమించేందుకు సోపానాలను ఒక అధ్యాయంలో వివరించారు రచయిత. సమాచారం సాధికారతకు సోపానం అంటారు రచయిత. అందుకే డిజిటల్ గ్రంధాలయాలకు ఓపెన్ యాక్సెస్ గురించి మాట్లాడుతారు. అందరికీ సామాన విద్య గురించి మాట్లాడుతూ ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అంటారు. డిజిటల్ విద్య అంతరాన్ని తగ్గించడంపై అందరం దృష్టి పెట్టాలి. అలాగే డిజిటల్ లిటరెసీను పెంపొందించే కార్యక్రమాల ఆవశ్యకత, డిజిటల్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జ్ఞానసముపార్జనను ప్రజాస్వామీకరించడం వంటి విలువైన అంశాలను ఈ పుస్తకంలో చేర్చారు. ఈ ప్రక్రియలో భాగంగా మనం ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలకు పరిష్కారాలను, డాక్టర్ అంబేడ్కర్ చారిత్రక ఉద్యమాలను ఉదాహరణలుగా చూపుతూ చర్చించారు. డిజిటల్ వేదికల సద్వినియోగం, అంతర్జాతీయ సహకారం యొక్క ఆవశ్యకత, వెసులుబాటు అవకాశాలు, మార్గాలు, సమాచార భద్రత, సమాచార జీవావరణ వ్యవస్థ (డేటా ఏకొ సిస్టమ్), సమాచార దోపిడీ వలన కలిగే హాని, సమాచార ఆధారిత వివక్ష, సమాచారం యొక్క నైతిక వినియోగం, నిఘా పటిష్టత మొదలైనవాటి గురించిన సంక్షిప్త సమాచారం ఈ పుస్తకంలో ఉంది. రచయిత గోప్యతను మానవ హక్కుగా పేర్కొంటూ రాసిన అధ్యాయం అందరూ చదివి తీరాలి. ఈ అంశాలన్నింటినీ డాక్టర్ అంబేడ్కర్ దృష్టికి, సిద్ధాంతాలకీ అన్వయించి వివరించిన విధానం బావుంది. అదే విధంగా ఆన్లైన్ నేరాలు, సైబర్ బుల్లియింగ్ మొదలైన వేధింపుల గురించి, ఫిర్యాదు పద్ధతుల గురించి ఈ పుస్తకంలో విపులంగా ఉంది. సురక్షితమైన ఆన్లైన్ వేదికల సృష్టి యొక్క ఆవశ్యకతను వివరించారు. కృత్రిమ మేధస్సు సాంకేతికతలో పురోగతి, తద్వారా ఎదుర్కొనే సవాళ్ళు, నైతిక అనిశ్చితి గురించి వివరిస్తూ, సామాజిక సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ గవర్నెన్స్, డిజిటల్ వ్యవస్థాపకతల గురించి డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలతో పోలుస్తూ కొన్ని అధ్యాయాలు రాశారు. వెనుకబడిన సమూహాలకు అందుబాటులో సాంకేతికత ఉండాలన్నది ఆయన వాదన. తద్వారా సామాన అవకాశాలు దక్కుతాయని ఉదాహరణ అధ్యయనాల ద్వారా నిరూపించిన తీరు అమోఘం. డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలను నేటి సాంకేతితక ద్వారా ప్రచారం చేయడానికి పూనుకోవాల్సిన ఆవశ్యకత అవగతం అవుతుంది చదివిన ప్రతి ఒక్కరికీ. అంబేడ్కర్ గురించి అందరికీ తెలియాలి! నేటి సమాజానికే కాదు, ఏ కాలానికైనా ఆయన దార్శనికత వెలుగు చూపే దివ్వె అవుతుందని తెలియాలి! అంబేద్కర్ భావజాలాన్ని డిజిటల్ యుగానికి చేర్చాలనే ఆలోచన భారతదేశ పౌరులతో పాటు మొత్తం ప్రపంచ పౌరులలో అంబేద్కర్ భావజాలం యొక్క అక్షరాస్యతను మెరుగుపరుస్తుందన్నది వాస్తవం. ఈ పుస్తకం మన అందరి భవిష్యత్ ఆలోచనా సరళి మార్పును, భవిష్యత్ తరాలకు అంబేడ్కర్ ఆశయాలను చేర్చేందుకు తీసుకోవలసిన చర్యల ఆవశ్యకతను సూచిస్తుంది. శరవేగంతో పరుగులు పెడుతున్న అభివృద్ధి భారతదేశాన్ని ఏ స్థాయిలో నిలబెట్టగలదో అంచనా వేసేందుకు కొన్ని అధ్యయనాలు, కొన్ని ఆచరణలు అవసరం అని అందరికీ తెలుసు. భారతదేశ భవిష్యత్తు గురించి అత్యున్నత దృక్పథాన్ని కలిగి ఉన్న జాతీయ నాయకుడికి భిన్నమైన భావజాలం ఉంది. దూరదృష్టి కలిగిన ఆ దార్శనికుని మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అందిపుచ్చుకోగలిగితే, అది భారతదేశాన్ని అభివృద్ధిలో శిఖరాగ్రంలో ఉంచగలదన్న విషయాన్ని అర్థం చేసుకుని, సాంకేతికత పరంగా కూడా ఆ భావజాలాన్ని వినియోగించుకోగలగాలి. ఇంత విపులంగా అంబేడ్కర్ ఆశయాల సాధన కొరకు నేటి కాలం సాంకేతికతను సమ్మిళితం చేయగలిగే విధానాలను సూచిస్తూ రచించిన ఈ పుస్తకం ఎంతో మంది పరిశోధకులు, పౌరులు, విద్యార్థులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక పరిజ్ఞాన అభ్యాసకులకు మార్గదర్శిగా ఉండగలదు. - విజయభాను కోటే ఫ్రీలాన్స్ రైటర్, టీచర్, హ్యుటగాజీ ఎక్స్పర్ట్ 8247769052 (పుస్తకం దొరుకు చోటు: Amazon: Dr. Ambedkar's Ideology in The Digital Era https://a.co/d/9erV5My) -
భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటం.. దానికితోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు.. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్‌లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement