-
షారుఖ్ ఖాన్ చర్యతో ఆశ్చర్యపోయిన గంగూలీ.. వెంటనే..
కోల్‌కతా నైట్ రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.అంతేకాదు.. ఆప్యాయంగా దాదాను ముద్దాడి అభిమానం చాటుకున్నాడు. షారుఖ్ చర్యతో తొలుత ఆశ్చర్యపోయిన గంగూలీ.. తర్వాత అతడిని హత్తుకుని హర్షం వ్యక్తం చేశాడు.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్- ఢిల్లీ తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కేకేఆర్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(3/16) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకోగా.. పేసర్లలో మిచెల్ స్టార్క్(1/43), వైభవ్ అరోరా(2/29), హర్షిత్ రాణా(2/28), స్పిన్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్(1/24) రాణించారు.వీరిలో స్టార్క్ ఒక్కడు ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్(33 బంతుల్లో 68) సొంతగడ్డపై ఢిల్లీ మీద ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ వెనుక నుంచి వెళ్లి ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీని హత్తుకున్నాడు. వెంటనే బుగ్గ మీద ముద్దు పెట్టి ఆప్యాయత ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. the way Shah Rukh Khan ran up to Sourav Ganguly to hug and kiss him, such a wholesome moment, KKR reunion 💜 pic.twitter.com/9I0yenj0V4— sohom (@AwaaraHoon) April 29, 2024 కాగా ఐపీఎల్-2024లో కేకేఆర్‌కు తొమ్మిదింట ఇది ఆరో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ పదకొండింటికి ఐదు మాత్రమే గెలిచి ఆరో స్థానంలో ఉంది. A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
చరిత్ర సృష్టించిన సాల్ట్.. గంగూలీ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పరుగుల వరద పారించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడిన చోట.. సాల్ట్ 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో ఏకంగా 68 పరుగులు రాబట్టాడు. తద్వారా ఢిల్లీ విధించిన 154 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేకేఆర్ 16.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.ఇక తన అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును సాల్ట్ బద్దలు కొట్టాడు. ఢిల్లీ డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ ముందే సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు1. ఫిలిప్ సాల్ట్- ఆరు ఇన్నింగ్స్‌లో 344 రన్స్- 20242. సౌరవ్ గంగూలీ- ఏడు ఇన్నింగ్స్‌లో 331 రన్స్- 20103. ఆండ్రీ రసెల్- ఏడు ఇన్నింగ్స్‌లో 311 రన్స్- 20194. క్రిస్ లిన్- తొమ్మిది ఇన్నింగ్స్‌లో 303 రన్స్- 2018.కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లువేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా, సోమవారంటాస్: ఢిల్లీ.. బ్యాటింగ్ఢిల్లీ స్కోరు: 153/9 (20)కేకేఆర్ స్కోరు: 157/3 (16.3)ఫలితం: ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(కేకేఆర్)- 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.టాప్ స్కోరర్ ఆఫ్ ది మ్యాచ్: ఫిలిప్ సాల్ట్(68).A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
రోహిత్‌తో కలిసి అతడే ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్-2024 కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, అదే సమయంలో యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడనే విషయం కూడా మర్చిపోద్దని దాదా పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ జట్టు ఎంపికకు ఐపీఎల్-2024 ప్రదర్శన కీలకం కానుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2022 తర్వాత సుదీర్ఘకాలం టీ20 జట్టుకు దూరమైన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఇటీవల స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మెగా టోర్నీలో వీరిద్దరు ఓపెనర్లుగా దిగనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో కోహ్లి ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 379 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113 నాటౌట్) కూడా ఉంది. మరోవైపు.. రోహిత్ శర్మ కూడా శతకంతో చెలరేగాడు. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులతో ప్రస్తుతం టాప్-5లో ఉన్నాడు. వీరిద్దరు ఇలా ఫామ్‌లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇక రాజస్తాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభంలో తడబడ్డా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అజేయ సెంచరీ(104)తో దుమ్ములేపి రేసులోకి దూసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు. 40 బంతుల్లోనే సెంచరీ చేయగల సత్తా విరాట్ కోహ్లికి ఉంది. వెళ్లి హిట్టింగ్ ఆడటమే పనిగా పెట్టుకోవాలి. 5-6 ఓవర్ల తర్వాత ఫలితం అదే కనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం వరల్డ్‌కప్‌లో రోహిత్- విరాట్ కలిసి ఓపెనింగ్ చేయాలి. సెలక్టర్ల మనసులో ఏముందో మనం అంచనా వేయలేం. కానీ నేను మాత్రం ఇది బాగుంటుందనే అనుకుంటున్నా. అలా అని యశస్వి జైస్వాల్ పేరును సెలక్టర్లు మర్చిపోతారని భావించడం లేదు. అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. నిలకడైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఏదేమైనా యువ, అనుభవజ్ఞులైన జట్టుతో టీమిండియా వరల్డ్‌కప్ బరిలోకి దిగాలి’’ అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా మే 26న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC 2024: వరల్డ్‌కప్ జట్టులో రిషభ్ పంత్?
ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన టీమిండియా స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అద్బుత ఆట తీరు కనబరుస్తున్నాడు. గతంలో మాదిరి తనదైన శైలిలో షాట్లు బాదుతూ అభిమానులను అలరిస్తున్నాడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా పూర్తి స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సేవలు అందిస్తున్నాడు ఈ కెప్టెన్ సాబ్. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రదర్శన ఆధారంగా టీమిండియా వరల్డ్‌కప్ బెర్తులు ఖరారు కానున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ ఇప్పటికే రేసులో ముందు వరుసలో ఉండగా.. పంత్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ వరల్డ్‌కప్ సెలక్షన్ గురించి బీసీసీఐ మాజీ బాస్, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ జట్టులో పంత్? వరల్డ్‌కప్ జట్టులో పంత్ చోటు దక్కించుకోగలడా అన్న ప్రశ్నకు బదులిస్తూ..‘‘ఇంకొన్ని మ్యాచ్‌లు పూర్తి కానివ్వండి. ప్రస్తుతం అతడు బాగా ఆడుతున్నాడు. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. No look Pant 🫨#IPLonJioCinema #TATAIPL #DCvKKR pic.twitter.com/OLhLl28aAn — JioCinema (@JioCinema) April 3, 2024 సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌లలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోవారం గడిస్తే గానీ నేను ఈ ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వలేను. సెలక్టర్లు పంత్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడే అంచనా వేయలేను. ప్రస్తుతానికి పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఆటగాడిగా రాణిస్తున్నా.. కెప్టెన్ విఫలం! కాగా డిసెంబరు, 2022లో పంత్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడగా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా దాదాపు ఏడాదిన్నర పాటు అతడు ఆటకు దూరమయ్యాడు. ఇక రీఎంట్రీలో ఆటగాడిగా రిషభ్ పంత్ రాణిస్తున్నా కెప్టెన్‌గా మాత్రం విజయాలు అందుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. మూడింటిలో ఓడిపోయింది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హార్దిక్‌ది తప్పు కాదు.. దయ చేసి హేళన చేయవద్దు: గంగూలీ
ఐపీఎల్-2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లకు చాలా కీలకం. ఢిల్లీ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించగా.. ముంబై అయితే ఇంకా బోణే కొట్టలేదు. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి గాడిలో పడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ నూతన సారథి హార్దిక్ పాండ్యాకు గంగూలీ మద్దతుగా నిలిచాడు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను ఎవరూ హేళన చేయవద్దని అభిమానులను దాదా కోరాడు. కాగా రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఎంపికైనప్పటి నుంచి అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలో సైతం హార్దిక్‌కు ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. హార్దిక్ ఎక్కడ కన్పించిన రోహిత్ రోహిత్ అంటూ అభిమానులు బోయింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో హార్దిక్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోవడం కూడా అతడి కష్టాలను రెట్టింపు చేసింది. వెంటనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. "దయచేసి అభిమానులు హార్దిక్ పాండ్యాను బూయింగ్(హేళన) చేయవద్దు. అది కరెక్ట్ కాదు. ముంబై ఫ్రాంచైజీ హార్దిక్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది. అటువంటిప్పుడు అతడేం తప్పు చేశాడు. ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయానికి హార్దిక్‌ను తప్పుబట్టడం సరికాదు. క్రీడల్లో కెప్టెన్సీ మార్పు సహజం. భారత జట్టుకైనా కావచ్చు ఫ్రాంచైజీలకైనా ఏ ఆటగాడు తన ఇష్టానుసారం కెప్టెన్ కాలేడు. అది మెనెజ్‌మెంట్ నిర్ణయం. రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ఆటగాడు. అతని పెర్ఫార్మెన్స్ వేరే స్ధాయిలో ఉంటుంది.కెప్టెన్‌గా ఒక ఆటగాడిగా రోహిత్ ఒక అద్బుతమని" ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంగూలీ పేర్కొన్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement