-
Black Salt Benefits : బ్లాక్ సాల్ట్‌తో ఇన్ని లాభాలా?
కోవిడ్-19 సంక్షోభం తరువాతఅందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి బ్లాక్ సాల్ట్ లేదా నల్ల ఉప్పు. నల్ల ఉప్పుతో ఎలాంటి ప్రయోజ నాలున్నాయో తెలుసుకుందాంఉప్పులేని వంటిల్లు లేదు. కానీ మనం రెగ్యులర్‌గా వాడే తెల్ల ఉప్పుతో కంటే కూడా బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కలిగిన బ్లాక్‌సాల్ట్ ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. ఇది రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో సహాయపడే ఈ నల్ల ఉప్పు చాలాబాగా పనిచేస్తుంది. అలాగే నల్ల ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచిది. నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మందికి తెలియదు.ఎసిడిటీ, మెరుగైన జీర్ణక్రియ తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి నల్ల ఉప్పు నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నల్ల ఉప్పును సరైన పరిమాణంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. బ్లాక్ సాల్ట్ చాట్ లేదా సలాడ్ అయినా వాటి రుచిని పెంచుతుంది. ఇది అనేక యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాల నిధి.గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా దీని వినియోగం చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మితిమీరి ఎలాంటిది తీసుకున్నా హానికరం కాబట్టి, దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.బరువు తగ్గడానికినల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది.సలాడ్, పానీయం వంటి మొదలైన వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే మంచిది.నోటి ఆరోగ్యం గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు వేసి నిద్రించే ముందు పుక్కిలిస్తే దంతాలు బలపడతాయి. దీంతో పంటి నొప్పి, కుహరం సమస్యలు కూడా నయం అవుతాయి. చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన సమస్యను కూడా వదిలించుకోవచ్చు.చర్మ సమస్యలు నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అందుకే నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిది. సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు. నోట్: ఇది కేవలం సమాచారంగా మాత్రమే అని గమనించగలరు. బీపీ రోగులు ఉప్పును ఎంత పరిమితంగా వాడితే అంత మంచిది. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
Beauty Tips: చర్మం మృదువుగా.. ముడతలు లేకుండా ఉండాలంటే..?
పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. చాలా రకాల వ్యాధులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు. చర్మం పొడిబారడం, చారలు, నలుపు, మచ్చలుగా మారడం లాంటివి. మరి ఈ సమస్యలనుండి చర్మం మృదువుగా, నిగారింపుగా ఉండాలంటే.. కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. ముఖ చర్మం మృదువుగా ముడతలు లేకుండా ఉండాలంటే చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోవడం అవసరం. ఇందుకు బీట్రూట్ దుంప బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ను చెక్కు తీసి సన్నగా తురుముకుని రసం తీసుకోవాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి ΄్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. అలాగే కొన్ని గులాబీ ఆకులను తీసుకుని వాటికి తగినన్ని నీటిని చేర్చి మెత్తగా రుబ్బుకుని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే ముఖం తేమగా ఉంటుంది. ఇది ముఖానికి గులాబీ రంగుని ఇస్తుంది. ఇవి అందుబాటులో లేక΄ోయినా లేదా తగిన సమయం లేకున్నా, ముఖంపై రోజ్‌వాటర్‌ను చల్లుకున్నా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముఖంపై, బుగ్గల పైన తేనె రాసుకుని ఆరాక శుభ్రం చేసుకున్నా ముఖం స్మూత్‌గా.. మెరుస్తూ కనిపిస్తుంది. ఇవి చదవండి: క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి.. -
చికెన్ స్కిన్ గురించి విన్నారా? వేసవికాలంలో ఇబ్బంది పెట్టే వ్యాధి..!
చికెన్‌ఫాక్స్ లాంటి ఆటలమ్మ, పొంగు, తట్టు తరహా చర్మ వ్యాధులను చూశాం. గ్రామాల్లో మాత్రం ఈ వ్యాధిని అమ్మవారు చూపింది అంటారు. ఓ వారం రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇప్పటికీ చాలా చోట్ల దీనికి మందులు వాడరు ప్రజలు. వేపాకు, పసుపుతో తగ్గించుకుంటారు. అయితే దీనికి కూడా టీకాలు వంటివి వచ్చేశాయి ఇప్పుడు. కానీ కొత్తగా ఇదేంటీ..? చికెన్ స్కిన్ .. అంటే.. ఇది కూడా ఒక విధమైన చర్మ వ్యాధే. గానీ తీవ్రత ఎక్కువ. వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు. శోభి తర్వాత భయానకమైన చర్మవ్యాధి ఇదే. ముఖ్యంగా వేసవికాలంలో పలువురిని వేధించే సమస్య ఇది. అయితే కొందరికి నయం అయినా, మరికొందరికి మాత్రం జీవితాంతం వేధిస్తుంది. అసలేంటి వ్యాధి? ఎలా వస్తుంది ? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..! వైద్య పరిభాషలో చికెన్ స్కిన్‌ను కెరటోసిస్ పిలారిస్ అని పిలుస్తుంటారు. ఈ వ్యాధి వచ్చిన రోగి చర్మంపై చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. రాను రాను గులాబీ లేదా ఎరుపు రంగు మచ్చలుగా మారతాయి. ఇవి ఎక్కువగా చేతులు, ముఖం, తొడలు, చెంపలు, వీపు పైభాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఆ మచ్చలు చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి. వాటి వల్ల దురద కూడా ఏర్పడుతుంది. నలుగురిలో అదే పనిగా శరీరాన్ని గోకుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ.. ఎండాకాలంలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. పైగా నలుగురిలో తిరగలేక నానాఅవస్థలు పడతారు. దీనికి ప్రధాన కారణం చర్మంపై కెరాటిన్ ఏర్పడటం. ఎందుకంటే..? ఈ కెరాటిన్ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. చర్మంపై వెంట్రుకల కుదుళ్ళు పెరగకుండా చేస్తుంది. ఫలితంగా చర్మంపై చిన్న పరిమాణంలో ఎర్రటి గడ్డలు ఏర్పడతాయి. ఈ కెరాటోసిస్ అనేది జన్యు మార్పుల వల్ల వస్తుందని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. తామర, మధుమేహం కెరాటోసిస్ పిలారిస్ కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది. ఉబ్బసం, అలర్జీ, అధిక బరువు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ చికెన్ స్కిన్ వల్ల ఏర్పడే గడ్డలు కొందరిలో వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొందరిలో అయితే జీవితాంతం వేధిస్తూ ఉంటాయి. చికెన్ స్కిన్ నుంచి బయటపడాలంటే .. ముందుగా పొడి చర్మాన్ని నివారించాలి. కెరాటో లిటిక్ ఏ వంటి మాయిశ్చరైజింగ్ లోషన్లను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అయితే చికెన్ స్కిన్ బారిన పడ్డవారు చర్మంపై వచ్చిన ఆ గడ్డలను గిచ్చడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. అంతేకాదు కొంతమంది రాపిడితో కూడిన ఎక్స్ ఫోలీయేటర్తో గడ్డల మీద స్క్రబ్ చేస్తుంటారు. దీనివల్ల చర్మం మరింత ప్రమాదంలో పడుతుంది. అంతేగాదు బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఈ వ్యాధి బారనే పడ్డట్టు ఇన్స్టాగ్రాం వేదికగా తెలిపింది. ఈ వ్యాధి ఏంటో ఎలా బయటపడాలి అనే దాని గురించి కుణ్ణంగా తెలుసుకునే పనిలో ఉన్నాని కన్నీటిపర్యంతమయ్యింది. అందువల్ల సమస్య ఆదిలో ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించి సత్వరమే సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దీని గురించి మరింత క్షుణ్ణంగా వ్యక్తిగత వైద్యులను, నిపుణులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
పాపులర్ వీడియో గేమర్‌కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!
ఇటీవల కాలంటో ప్రముఖ సెలబ్రెటీలు, ఆటగాళ్లు కేన్సర్ బారిన పడుతున్నారు. ఒక్కసారిగా వారిలో చురుకుదనం కోల్పోయి డల్‌గా అయిపోతున్నారు. పాపం అక్కడకి లేని మనో నిబ్బరాన్నంతా కొని తెచ్చుకుని మరీ ఈ భయానక వ్యాధితో పోరాడుతున్నారు. కొందరూ ప్రాణాలతో బయటపడగా.. మరికొందరూ ఆ మహమ్మారికి బలవ్వుతున్నారు. అచ్చం అలానే ఓ ప్రసిద్ధ వీడియో గేమర్ ఈ కేన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. అతని కొచ్చిన కేన్సర్ ఏంటంటే.. ప్రోఫెషనల్ వీడియో గేమ్ ప్లేయర్ ట్విచ్ స్ట్రీమర్ నింజా చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయం విని ఒక్కసారిగా అతని అభిమానులంత షాక్‌కి గురయ్యారు. అతడి పాదాలపై ఒక పుట్టుమచ్చ ఉంది. అది అసాధారణంగా పెద్దది అవ్వడం ప్రారంభించింది. దీంతో వైద్యులను సంప్రదించాడు స్ట్రీమర్. అన్ని పరీక్షలు చేసి మెలనోమా కేన్సర్ అని నిర్థారించారు వైద్యులు. అయితే వైద్యులు ప్రారంభ దశలోనే ఈ కేన్సర్‌ని గుర్తించారని పేర్కొన్నాడు సోషల్ మీడియా ఎక్స్‌లో. దయచేసి అందరూ చర్మానికి సంబంధించిన చెకప్‌లు చేసుకోండి అని అభిమానులను కోరాడు. ఇంతకీ అతనికి వచ్చిన మెలనోమా కేన్సర్ అంటే..! మెలనోమా అనేది మెలనోసైట్స్ నుంచి ఉద్భవించే ఒక రకమైన చర్మ కేన్సర్. ఇది మెలనిన్ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మెలనోమా సాధారణంగా సూర్యరశ్మికి బహిర్గతమయ్యే చర్మంపై ప్రారంభమవుతుంది. చాలా మెలనోమాలు అతినీలలోహిత కాంతికి గురికావడం వల్ల సంభవిస్తాయి. మెలనోమా దశను అనుసరించి చికిత్స విధానం మారుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. ఈ మెలనోమా కేన్సర్ చర్మంపై ఎక్కడైనా తలెత్తుతుందని నిపుణుల చెబుతున్నారు. చాలా పుట్టుమచ్చలు, గోధుమ రంగు మచ్చలు వంటి వాటిల్లో చర్మంపై అసాధారరణ పెరుగదల ఉంటే ఇది వస్తుంది. వీటిని ఏబీసీడీఈలు అనే అగ్లీ డక్లింగ్ గుర్తు ద్వారా మెలనోమాని గుర్తించడం జరుగుతుంది. అంతేగాదు ఆ ప్రదేశంలోని అనుమానాస్పద కణజాలాన్ని చర్మవ్యాధి నిపుణుడు బయాప్సీ చేయించి , క్యాన్సర్ కణాలు ఉన్నాయా, లేదా అని నిర్ణయిస్తాడు. అలా ఈ కేన్సర్‌ని గుర్తించడం జరిగాక, సిటీ స్కాన్లు, పీఈటీ స్కాన్లు సాయంతో ఏ దశలో ఉందనేది నిర్థారిస్తారు. చికిత్స.. ఇతర కేన్సర్ల కంటే ఇందులో చర్మం వద్ద కణాజాలం కాబట్టి తీసివేయడం కాస్త సులభం. గాయాన్ని తొలగించేటప్పడే క్యాన్సర్ ప్రమేయం ఎంతవరకు ఉందో నిర్థారించి తొలగించాక, పూర్తిగా తొలగిపోయాయా లేదా అని నిర్ధారించుకోవడానికి పాథాలజీ పరీక్షలకు కూడా పంపడం జరుగుతుంది. మెలనోమా చర్మంలోని పెద్ద ప్రాంతాలో ఉంటే మాత్రం చర్మాన్ని అంటుకట్టుట వంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేన్సర్ శోషరస కణుపులకు వ్యాపించే ప్రమాదం ఉంటే.. శోషరస కణుపు బయాప్సీని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ వంటివి కూడా అవసరమవ్వచ్చు. ఇక నింజా 2011 నుంచి వృత్తిపరంగా పలు వీడియో గేమ్‌లు ఆడి స్ట్రీమర్‌గా మారాడు. ఇక్కడ ట్విచ్ అనేది ప్రధానంగా వీడియో గేమ్‌లపై దృష్టి సారించే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్. అయితే ఇది సంగీతం, సృజనాత్మక కళలు, వంట మరిన్నింటిని కవర్ చేసే స్ట్రీమ్‌లను కూడా కలిగి ఉంటుంది. దీనిద్వారా ఎంతో మంది ప్రముఖులతో లైవ్‌స్ట్రీమ్‌లో వీడియో గేమ్‌లు ఆడి పేరు తెచ్చుకున్నాడు. దీని కారణంగానే అతనికి వేలాదిమంది ఫాలోవర్లుఉన్నారు. మైక్రోసాఫ్ట్ స్ట్రీమిగ్ ఫ్లాట్‌ఫాం మిక్సర్ కోసం 2019లో ట్విచ్ని వదిలిపెట్టాడు. ఆ మిక్సర్ షట్‌డౌన్ అయ్యాక మళ్లీ ట్విచ్కి తిరిగి వచ్చాడు. ఈ స్ట్రీమింగ్ ద్వారా అంతర్జాతీయ ప్రశంసల తోపాటు మిలయన్ల డాలర్లును సంపాదించాడు. (చదవండి: తండ్రి మిలియనీర్..కానీ కొడుక్కి 20 ఏళ్ల వరకు ఆ విషయం తెలియదు!) -
డైట్లో ఈ వంటకాన్ని చేరిస్తే..మెరిసే గ్లాస్ స్కిన్ మీ సొంతం!
కొరియన్ గ్లాస్ స్కిన్‌లా చర్మం ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం అని కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్‌లను ట్రై చేస్తుంటారు. వాటన్నింటి కంటే కూడా ఈ కొరియన్ వంటకాన్ని మీ డైట్లో చేర్చుకుంటే చక్కటి మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అకాల వృద్ధాప్యా ఛాయలను కూడా దూరం చేస్తుంది. ఏంటా వంటకం అంటే.. కొరియన్ కిమ్చి అనే ప్రసిద్ధ వంటకం మీ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతిమంతంగా చేయడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కిమ్చి అనేది సాంప్రదాయ కొరియన్ పులియబెట్టిన ఆహారం. దీన్ని కొరియన్లు ప్రతిరోజు తమ ఆహరంలో భాగం చేసుకుంటారు. ఇది సాధారణంగా చక్కెర, ఉప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, మిరపకాయ మసాల వంటి వాటిని జోడింది పులియబెట్టిన క్యాబేజీతో తయారు చేస్తారు. ఈ కిమ్చిని కావాలంటే ముల్లంగా, సెలెరీ, క్యారెట్, దోసకాయ, బచ్చలి కూర వంటి ఇతర కూరగాయలను ఉపయోగించి కూడా తయారు చేయవచ్చు. ఇది పులియబెట్టడం వల్ల ఉబ్బినట్లుగా ఉండి, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీన్నీ మన రోజువారీ డైట్లో భాగం చేసుకుంటే కొరియన్లలాంటి గ్లాస్ స్కిన్‌ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మెటిమలు లేని, మృదువైన హైడ్రేటెడ్ చర్మాన్ని పొందొచ్చని చెబుతున్నారు కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ నీతి గౌర్. ఈ వంటకం చర్మాన్ని ఏవిధంగా మేలు చేస్తుందా సవివరంగా చూద్దాం. ప్రోబయోటిక్స్: కిమ్చిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి పేగు ఆరోగ్యానికి తోడ్పడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఇందులో ఉండే గట్ మైక్రోబయోమ్ చర్మ సంరక్షణ తోపాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది . శరీరంలో ప్రోబయోటిక్స్ సమతుల్య గట్ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా సంభావ్యంగా చర్మం మంటను తగ్గించి..మొటిమలు, తామర వంటి వాటిని రాకుండా చేస్తుంది యాంటీఆక్సిడెంట్లు: కిమ్చిలో వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిలో విటమిన్లు ఏ, సీ ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కీలకమైనవి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, పర్యావరణ ఒత్తిళ్లు, యూవీ రేడియేషన్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సీడెంట్లు ఒత్తిడిని తగ్గించి..ముఖాన్ని యవ్వనంగా నిగనిగలాడేలా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్: కిమ్చీని తయారీలో కిణ్వ ప్రక్రియ కారణంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. మొటిమలు, రోసేసియా, అకాల వృద్ధాప్యం వంటివి దూరం చేస్తుంది. అలాగే ఎక్కువగా చర్మ పరిస్థితులలో వచ్చే వాపు వంటివి రానియ్యదు. విటమిన్లు, మినరల్ కంటెంట్: కిమ్చిలో విటమిన్లు ఏ,సీ, కే వంటి పోషకాలకు మంచి మూలం. అలాగే కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. కొల్లాజెన్ సంశ్లేషణ, గాయం వంటి వాటి నుంచి సంరక్షిస్తుంది. (చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్‌తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement