-
Siri Hanmanth- Shrihan: తొమ్మిదేళ్లుగా లవ్.. పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన సిరి హన్మంత్ (ఫోటోలు)
-
నలుగురి ఆవారా కుర్రాళ్ల కథే ‘మా ఆవారా జిందగీ’
ఆవారాగా తిరిగే నలుగురు ఆవారా కుర్రాళ్ళు నాలుగేళ్లు చదవాల్సిన బి.టెక్ ను ఎనిమిదేళ్లు చదివి బయటికి వచ్చిన తరువాత వారికి జాబ్స్ దొరకక ఇంట్లో వారికి సమాధానం చెప్పుకోలేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? తమ క్యారెక్టర్స్‌తో ఈ ఆవారా కుర్రోళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేశారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘మా ఆవారా జిందగీ’. బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే నటీ నటులుగా దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘మా ఆవారా జిందగీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 23 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర దర్శకుడు దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..నలుగురి ఆవారా కుర్రాళ్ల పనులు ఎలా ఉండబోతున్నాయి? ఆ పనులకు కామెడీ ఎలా లింక్ చేశారు? అనే ఫన్ ఓరియెంటెడ్, యూత్ ఫుల్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటితరం ఆడియన్స్ మెచ్చే కథ ఎంచుకొని దానికి కావాల్సినంత ఫన్ యాడ్ చేశాం. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ నవ్వుకునేలా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంటుంది. జూన్ 23 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. (చదవండి: మంచు మనోజ్ భార్య అరుదైన ఫీట్.. సోషల్ మీడియాలో వైరల్!) ఈ మూవీలో బోల్డ్ సబ్జెక్టు ఉన్నా నా నుంచి అందరూ ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్ వస్తుందని ఊహించరు. నన్ను ఇష్టపడే వాళ్ళు నా యాక్టింగ్ ను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. ఈ కథకు మమ్మల్ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’అని నటుడు శ్రీహాన్ అన్నారు.‘ఫస్ట్ టైం సినిమాలో నటిస్తున్నాను. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది’అని నటుడు అజయ్ అన్నారు.ఈ కార్యక్రమంలో నటుడు చెర్రీ, మహేందర్ నాథ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త బైక్ కొన్న శ్రీహాస్.. ఆ పాటతో పార్టీ అడిగిన సిరి, వీడియో వైరల్
బుల్లితెర జోడి శ్రీహాన్, సిరి హన్మంత్ల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కలిసి నటించిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ ప్రేమికులుగా మారారు. అయితే ఈ జంటకు బాగా పేరొచ్చింది మాత్రం బిగ్‌బాస్ రియాల్టీ షో వల్లే. బిగ్‌బాస్ ఐదో సీజన్లో సిరి, ఆరో సీజన్లో శ్రీహాన్ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరు తమదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. శ్రీహాన్ అయితే చివరి వరకు హౌస్‌లో ఉండి రన్నరఫ్‌గా నిలిచాడు. వాస్తవానికి అతను కూడా విన్నరనే చెప్పాలి. ఆడియన్స్ వేసిన ఓట్ల పరంగా శ్రీహాన్ విజేతగా నిలిచినప్పటికీ.. నాగార్జున ఆఫర్ చేసిన రూ.40 లక్షల సూట్ కేసుకి తలొంచడంతో రేవంత్ విజేతగా నిలిచాడు. మొత్తానికి బిగ్‌బాస్ కారణంగా శ్రీహాన్.. అటు అభిమానుల్ని పెంచుకోవడంతో పాటు, ఇటు డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. ప్రస్తుతం ఆ డబ్బుతో లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా శ్రీహాన్ కొత్త బైక్‌ని కొన్నాడు. ప్రియురాలు సిరి, అతని కుమారుడు(సిరి, శ్రీహాన్ కలిసి ఓ పిల్లాడిని దత్తత తీసుకున్నారు)తో కలిసి కొత్త బైక్‌కి పూజలు కూడా చేయించారు. దీనికి సంబంధించిన వీడియోని సిరి తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘వేర్ ఈజ్ ద పార్టీ’పాట రూపంలో బాయ్ఫ్రేండ్ని పార్టీ అడిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by siri shrihan vibes 💙✨ (@siri_shrihan_vibes) -
షణ్ముఖ్‌తో అతి సన్నిహితం.. తప్పు చేశానంటూ స్టేజ్‌పై సిరి కన్నీళ్లు!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో షణ్ముఖ్- సిరిల ఫ్రెండ్షిప్ హద్దు మీరిన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిపించినా వీడి ఉండలేకపోతున్నామని వాపోయారు. కానీ ఎప్పుడైతే సిరి బాయ్‌ఫ్రెండ్, నటుడు శ్రీహాన్ బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చాడో అతడికి ముఖం చూపించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది సిరి. ఇక శ్రీహాన్.. నన్ను వదిలేస్తున్నావా? అని ఒక డైలాగ్ విసరడంతో సిరిని మరింత తిట్టిపోశారు నెటిజన్లు. ఇక కట్ చేస్తే షో అయిపోయాక వాళ్లిద్దరూ ఎప్పటిలాగే కలిసిపోయారు. నెగెటివిటీకి చెక్ పెడుతూ మరింత దగ్గరయ్యారు. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా స్టార్ మా నిర్వహించిన స్పెషల్ ఎపిసోడ్లో శ్రీహాన్, సిరి జంట పాల్గొంది. వారితో పాటు మిగతా బుల్లితెర రియల్ కపుల్స్ కూడా ఈ ఈవెంట్లో సందడి చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సిరి తాను తప్పు చేశానంటూ స్టేజ్‌పైనే నిర్మోహమాటంగా ఒప్పేసుకుంది. శ్రీహాన్‌కు గోల్డ్ రోజు ఇచ్చి ప్రపోజ్ చేసిన సిరి, అతడు చాలా యూనిక్ అంటూ పొగిడింది. శ్రీహాన్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు అతడిని చాలా మిస్ అయ్యానని, గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ షర్ట్‌పై ముద్దులు పెట్టేదాన్ని అని చెప్పింది. అనంతరం ఆ షర్ట్‌ను ప్రియుడు శ్రీహాన్‌కు గిఫ్ట్ ఇచ్చింది. అలా పలు గిఫ్ట్‌లతో శ్రీహాన్‌ను సర్ప్రైజ్ చేసిన సిరి అనంతరం మాట్లాడుతూ.. ‘చిన్న, చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ స్టేజ్‌పై ఎవరు దాన్ని ఒప్పుకోరు. నేను నిజంగానే తప్పు చేశాను.. అది నాకు తెలియకుండానే జరిగింది’ అంటూ కన్నీరు పెట్టుకుంది. దీంతో సిరిని శ్రీహన్ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. దీంతో అక్కడ ఉన్న యాంకర్ రవి, రష్మీతో పాటు మిగతా కంటెస్టెంట్స్ సైతం స్టేజ్‌పైకి వచ్చి సిరిని ఓదార్చారు. కాగా బిగ్‌బాస్ షో అనంతరం షణ్ముఖ్‌కు దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: కిరాక్ ఆర్పీ చేపల పులుసు బిజినెస్ వారి భిక్షే: రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్ సీక్రెట్ డేటింగ్.. ఎట్టకేలకు మూడుమూళ్ల బంధంతో ఒక్కటైన హీరోహీరోయిన్ -
శ్రీహాన్‌తో పెళ్లి ఎప్పుడో చెప్పిన సిరి!
షార్ట్ ఫలింస్, రీల్స్‌తో పాపులర్ అయిన జంటలో సిరి హన్మంత్, శ్రీహాన్ జంట ఒకటి. రీల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరు జంటగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా రిలేషన్లో ఉంటున్న వీరిద్దరు బిగ్‌బాస్ షోతో బాగా పాపులర్ అయ్యారు. సిరి హన్మంత్ బిగ్‌బాస్ 5వ సీజన్లో, శ్రీహన్ బిగ్‌బాస్ 6వ సీజన్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌజ్‌లో తనదైన ఆట, చలాకితనంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న సిరి మరోవైపు విపరీతమైన నెగిటివిటీని కూడా మూటగట్టుకుంది. చదవండి: ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డు ఖాయం, రాసిపెట్టుకొండి: హాలీవుడ్ నిర్మాత హౌజ్‌లో తన కో-కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో అతి సన్నిహితంగా మెదిలి ట్రోల్స్ బారిన పడింది. బయటకు వచ్చాక శ్రీహాన్‌తో ఆమెకు అభిప్రాయభేదాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికి మనస్పర్థలు తొలగడంతో ఇద్దరు ఒక్కటయ్యారు. అయితే బిగ్‌బాస్ 5వ సీజన్ తర్వాత విడిపోయిన షణ్ముఖ్, దీప్తి సునేయన మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సిరీ బర్త్‌డే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ 6వ సీజన్లో రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్ గర్ల్‌ఫ్రెండ్ సిరి బర్త్‌డేను చాలా గ్రాండ్ సెలబ్రెట్ చేశాడు. ఆమెకు కాస్ట్లీ డైమండ్ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చాడు. చదవండి: నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలనే ఇలా చేస్తున్నారు: కిరణ్ అబ్బవరం ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటించిన సిరి శ్రీహాన్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ సిరి-శ్రీహాన్ పెళ్లిపై ప్రశ్నించాడు. ‘శ్రీహాన్‌ను మీరు త్వరగా పెళ్లి చేసుకోండి. మాకు చూడాలని ఉంది’ అని కోరాడు. ఇందుకు సిరి స్పందిస్తూ.. తప్పుకుండా.. త్వరలోనే చేసుకుంటామని సమాధానం ఇచ్చింది. అయితే ఎప్పుడు చేసుకుంటారనేది మాత్రం క్లారిటీగా చెప్పలేదు. మరోవైపు ఈ ఏడాది సిరి-శ్రీహాన్‌లు పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లు వారి సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కాగా కొంతకాలంగా రిలేషన్లో సిరి-శ్రీహాన్ ఓ బాబును దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement