-
తలైవా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వేట్టైయాన్. ఈ చిత్రాన్ని జైభీమ్ చిత్రం పేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజినీకాంత్ మాజీ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తలైవా నటిస్తోన్న 170వ చిత్రం. ఈ మూవీ తర్వాత రజినీకాంత్ 171వ చిత్రంలో నటించనున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమాపై అసత్య ప్రచారం ఎక్కువైందనే చెప్పాలి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్ ప్రకటన, టీజర్‌ను వరుసగా విడుదల చేయడంతో ఈ చిత్రానికి సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. దీంతో అంతకు ముందే ప్రారంభం అయిన రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం వేట్టైయాన్ చిత్రం మరుగున పడిందనే చెప్పాలి.కాగా.. తాజాగా వేట్టైయాన్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రం షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని.. ఈ ఏడాది అక్టోబర్‌లో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించారు. దీంతో ఇకపై వేట్టైయాన్ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వంటి ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్ర వర్గాలు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో దుషారా విజయన్, అమితాబ్‌బచ్చన్, ఫాహత్ ఫాజిల్, రానా, మంజువారియర్, రితికాసింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 100 days of #Vettaiyan shooting 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Jailer | #Rajinikanth | #superstar @rajinikanth | #Coolie | #VettaiyanFromOctober | #ThalaivarNirandharam | #SuperstarRajinikanth | #Hukum | #CoolieDisco | #Jailer2 | #ThalaivarNirandharam | #CoolieTitleTeaser pic.twitter.com/psri6cXUtQ— Suresh balaji (@surbalutwt) April 27, 2024 -
షూటింగ్లో భారత్‌కు 21వ ఒలింపిక్ బెర్త్
పారిస్ ఒలింపిక్స్ చివరి క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత మహిళా స్కీట్ షూటర్ మహేశ్వరి చౌహాన్ రజత పతకం సాధించింది. దాంతో భారత్‌కు 21వ ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. దోహాలో ఆదివారం జరిగిన స్కీట్ ఈవెంట్ ఫైనల్లో మహేశ్వరి ‘షూట్ ఆఫ్’లో 3–4తో ఫ్రాన్సిస్కా క్రొవెట్టో (చిలీ) చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 60 షాట్ల తర్వాత ఇద్దరూ 54–54తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. -
షూటింగ్లో భారత్‌కు 20వ ఒలింపిక్ బెర్త్
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్‌కు 20 బెర్త్ ఖరారైంది. రియో డి జనీరోలో జరుగుతున్న చివరి ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ పలక్ గులియా కాంస్య పతకం సాధించింది. తద్వారా భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, 18 ఏళ్ల హరియాణా అమ్మాయి పలక్ 217.6 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన మరో షూటర్ సంయమ్ 176.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. -
షూటింగ్‌లు మానేసి ప్రజాసేవకు సిద్ధమా?
కిర్లంపూడి: ముఖానికి రంగు వేసుకునే వారిని ప్రజలు నమ్మరని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం విమర్శించారు. షూటింగ్‌లు మానేసి, హైదరాబాద్‌లోని ఆస్తులు పూర్తిగా అమ్మేసి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీ రామారావును మాత్రమే ప్రజలు విశ్వసించారన్నారు. తన కుమారుడికి సీఎం పీఠం కట్టబెట్టడానికే చంద్రబాబు ప్రజాగళం యాత్ర తప్ప మరొకరికి అధికారం ఇవ్వడానికి కాదన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజికవర్గాల నేతలు ముద్రగడను, యువనేత ముద్రగడ గిరిబాబును కిర్లంపూడిలోని వారి నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ముద్రగడ నాయకత్వంలో పిఠాపురంలో వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చెప్పారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ అఖండ మెజార్టీతో మరోసారి గెలిచి, ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ల పాటు రామరాజ్యం స్థాపిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీలో అన్నివర్గాలకు సముచిత స్థానం ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, బీసీలకు సముచిత స్థానం కల్పించి, పదవులు ఇ చ్చిన ఏకైక ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్‌దేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పిస్తున్న వైఎస్సార్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు. ముద్రగడ పద్మనాభం మద్దతుగా నిలవడంతో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి అధికారం అప్పగిస్తే రాష్ట్ర భవిష్యత్తు నియంతల చేతిలోకి పోతుందని హెచ్చరించారు. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోటోలు లీక్.. స్టార్ డైరెక్టర్ కఠిన నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్‌లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్‌గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించారు. త్వరలోనే రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్లో పాల్గొననున్నారు. Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX — Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024 Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥 Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc — αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement