-
ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్‌లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్‌ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) బ్రేక్‌ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా.. అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్‌ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్‌గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్‌లు , సలాడ్లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్‌గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్‌లో జరగనుంది. -
Forbes richest list 2024: టాప్–10లో ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్ టాప్–10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్ టాప్–9గా నిలిచారు. 2023లో ముకేశ్ సంపద 83.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. దేశీయంగా సంపదలో టాప్–2గా నిలుస్తున్న గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు క్షీణించిన సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ 90 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌ను సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! జాబితా ఇలా ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో 2,781 మంది వ్యక్తులు చోటు సాధించారు. గతేడాది జాబితాతో పోలిస్తే 141 మందికి అదనంగా చోటు లభించింది. 2023తో పోలిస్తే కుబేరుల ఉమ్మడి సంపద 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2 ట్రిలియన్ డాలర్లను తాకింది. సరికొత్త రికార్డ్ నమోదైన 2021తో పోలిస్తే 1.1 లక్షల కోట్ల డాలర్లు జత కలసింది. ఫ్యాషన్స్, కాస్మెటిక్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్లతో టాప్ ర్యాంకును, 195 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ రెండో ర్యాంకునూ కొల్లగొట్టారు. 177 బిలియన్ డాలర్లతో ఫేస్బుక్ జుకర్‌బర్గ్ టాప్–3గా నిలిచారు. -
అచ్చం అనంత్ మామలాగే..క్యూట్ కృష్ణ ఫోటో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా ఇషా, 2018 డిసెంబరులో వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఇషా, ఆనంద్ జంటకు కవలలు - కృష్ణ (కుమారుడు) ఆదియా (కుమార్తె) జన్మించారు. అటు తల్లిగా, ఇటు వ్యాపార నిర్వహణలోనూ అంబానీ వారసురాలిగా తన సత్తా చాటుకుంటోంది. ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన ట్విన్స్‌తో సందడిగా కనిపించింది ఇషా. ఇషాతో ట్విన్స్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అయ్యాయి. ముఖ్యంగా ఇషా కుమారుడు కృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ ఫోటోలు అచ్చం మేనమామ అనంత్ అంబానీలా ఉండటం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ సూట్లో రాయల్ లుక్‌లో చిరునవ్వుల చిందిస్తున్న ఇషా కుమారుడు కృష్ణ, తమ్ముడు అనంత్ కార్బన్ కాపీలా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. " అచ్చం అనంత్ అంబానీ లాగానే ఉన్నాడు అని ఒకరు, "అనంత్ మాము జైసా లగ్తా హై" అని మరొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదుఆ చిన్నారి ధీరూభాయ్ అంబానీలా ఉన్నాడని మరికొందరు కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మామ, అల్లుళ్ల పోలికల ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
పారామౌంట్ గ్లోబల్‌తో రిలయన్స్ డీల్
న్యూఢిల్లీ: పారామౌంట్ గ్లోబల్ సంస్థ భారత్‌లోని టీవీ వ్యాపార విభాగం వయాకామ్ 18లో తమకున్న 13.01 శాతం వాటాలను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి విక్రయించనుంది. ఇందుకు సంబంధించి పారామౌంట్ గ్లోబల్‌కి చెందిన రెండు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 4,286 కోట్లుగా ఉంటుందని వివరించింది. రిలయన్స్‌కి చెందిన టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌కి వయాకామ్18 అనుబంధ సంస్థ. కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా అందులో రిలయన్స్‌కి 57.48 శాతం వాటా ఉంది. పారామౌంట్ గ్లోబల్‌తో ఒప్పందం పూర్తయ్యాక ఇది 70.49 శాతానికి పెరుగుతుంది. తమ కంటెంట్‌కి సంబంధించి వయాకామ్18కి లైసెన్సును ఇకపైనా కొనసాగిస్తామని పారామౌంట్ వెల్లడించింది. నియంత్రణ సంస్థల అనుమతులు, రిలయన్స్–స్టార్ డిస్నీ జాయింట్ వెంచర్ పూర్తి కావడం తదితర అంశాలకు లోబడి ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొంది. మీడియాలో రిలయన్స్ మరింత పటిష్టం.. 2014లో నెట్వర్క్18లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన రిలయన్స్ ఆ తర్వాత నుంచి మీడియా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. భారత్‌లో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేసుకునేందుకు వాల్ట్ డిస్నీ, రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందం ఇందుకు దోహదపడనుంది. సదరు జాయింట్ వెంచర్లో రిలయన్స్ రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సోనీ, నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీనిచ్చేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన మీడియా వెంచర్స్ అన్నీ నెట్వర్క్18 కింద ఉన్నాయి. ఇది టీవీ18 బ్రాండ్ పేరిట న్యూస్ చానళ్లు, ఇతరత్రా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ చానల్స్‌ని నిర్వహిస్తోంది. అలాగే, మనీకంట్రోల్డాట్కామ్, బుక్‌మైషో వంటి సంస్థల్లోనూ నెట్ట్ వర్క్18కి వాటాలు ఉన్నాయి. వీటితో పాటు రిలయన్స్‌కి జియోసూ్టడియోస్ అనే సినిమా నిర్మాణ సంస్థ ఉంది. రెండు లిస్టెడ్ కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీల్లో (డెన్, హాథ్‌వే) మెజారిటీ వాటాలు ఉన్నాయి. -
అనంత్-రాధిక : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా?
వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేయడం ఆమెకు అలవాటు. తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్లో తన నాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాదు నీతా లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా నీతా ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. నీతా కాంచీపురం చీరలో హుందాగా కనిపించారు. రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర అద్భుతంగా ఆమెకు అమరింది. బోర్డర్‌పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్, బ్లౌజ్ స్లీవ్‌లపై ప్రత్యేకమైన గోటా వర్క్, చక్కటి మేకప్‌తో తన ఐకానిక్ సిగ్నేచర్ స్టయిలో మెరిసిపోయారు. కాంచీపురం చీరకు జతగా, కోట్ల విలువైన పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అందానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. పచ్చలు పొదిగిన, పొడవాటి నెక్లెస్‌లో ఆమె లుక్‌తో అతిథులు చూపు తిప్పుకోలేక పోయారంటే అతిశయోక్తి కాదు. దీనికి సరిపోయేలా చెవిపోగులు, బ్యాంగిల్స్ , వేలి రింగ్ ఆకట్టుకున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ పచ్చల హారం ధర దాదాపు రూ. 400-500 కోట్టు ఉంటుందని అంచనా. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కాక్టెయిల్ నైట్ ఈవెంట్లో వైన్ కలర్ కస్టమ్-మేడ్ గౌను, క్లాసిక్ ఫ్రెంచ్ ట్విస్ట్ బన్‌లో ఆమె లుక్ నీతా స్టయిలింగ్‌ను ప్రతిబింబించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement