-
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వైవి సుబ్బారెడ్డి
-
రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు. కాగా, ఈరోజు రాజ్యసభ ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాడు లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశాను. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ముందు నడిచాను. సీఎం జగన్ ఆశీస్సులతో మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది. రాజ్యసభలో 11కు 11 సీట్లు వైఎస్సార్సీపీనే గెలిచింది. ఈ సంఖ్యాబలం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మరింత మేలు జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు సాధిస్తాం. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని కామెంట్స్ చేశారు. -
రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ సోనియా గాంధీ చేత ప్రమాణం చేయించారు. సోనియా గాంధీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. సోనియాగాంధీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రమాణ స్వీకారం చేశారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly - elected member Shrimati Sonia Gandhi in the Parliament House.#RajyaSabha @VPIndia @SoniaGandhi_FC @harivansh1956 pic.twitter.com/HdeqVvUUh7 — SansadTV (@sansad_tv) April 4, 2024 మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. వద్దిరాజు రవిచంద్ర తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the re- elected member Ravi Chandra Vaddiraju in the Parliament House.#RajyaSabha @VPIndia @vaddirajumprs @harivansh1956 pic.twitter.com/2hCKkYkOAd — SansadTV (@sansad_tv) April 4, 2024 -
YSRCP: రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన ముగ్గురు ఎంపీలు
Live Updates.. ►వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ►వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Yerram Venkata Subba Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/iYPbG6qrHM — SansadTV (@sansad_tv) April 4, 2024 ►ఈ సందర్భంగా ఆంగ్లంలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Meda Raghunadha Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/cbYUwdztlC — SansadTV (@sansad_tv) April 4, 2024 ►హిందీలో దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన గొల్ల బాబురావు #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Golla Baburao in the Parliament House.#RajyaSabha @VPIndia @BaburaoGolla @harivansh1956 pic.twitter.com/LfsieauzrE — SansadTV (@sansad_tv) April 4, 2024 ►రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ►ఇక, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైఎస్సార్సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైఎస్సార్సీపీదే. ఇక, ప్రస్తుతం రాజ్యసభలో ఏపీ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య జీరో అయ్యింది. ►అంతకుముందు గొల్ల బాబురావు మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుల్లో దళితులకు సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఎన్నో ఒత్తిడిలు ఉన్నా నాలాంటి పేద, దళిత వర్గాలకు రాజ్యసభ సీటు ఇచ్చారు. నా పదవీకాలంలో పేదల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను. విశాఖ ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. ఈరోజు హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేస్తాను అని కామెంట్స్ చేశారు. -
వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు.. రాజ్యసభలో టీడీపీ జీరో
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించింది. రాజ్యసభలో బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ఇక, ఏపీలోని 11 రాజ్యసభ సీట్లకు గాను 11 సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. రాజ్యసభ సీట్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ విజయం సాధించింది. ఈ క్రమంలో నేటి నుంచి అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ ప్రాతినిధ్యం ఉంటుంది. రేపు రాజ్యసభ సభ్యులుగా నూతన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా.. రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. నిన్న(మంగళవారం)తో టీడీపీ ఏకైన రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ముగిసింది. దీంతో, రాజ్యసభలో టీడీపీ జీరో అయ్యింది. కాగా, టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement