-
T20 WC: జట్టు ఎంపిక ఫైనల్.. అతడిపై వేటు తప్పదా?
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోయే ఆటగాళ్లు ఎవరన్న చర్చకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యంలో ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచకప్‌లో భాగమయ్యే ఇరవై జట్ల ఎంపికను మే 1 వరకు ఖరారు చేయాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆయా దేశాలను ఆదేశించింది.ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించగా.. టీమిండియా కూడా అనౌన్స్మెంట్కు సిద్ధమైంది. జట్టు ఎంపిక గురించి ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.ఢిల్లీలో వీరు ముగ్గురు ఆదివారం సమావేశమై తీసుకున్న నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షాతో మంగళవారం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్నెస్, వికెట్ కీపర్ ఎంపిక గురించి మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.పాండ్యా గనుక బౌలింగ్ చేస్తే అదనపు పేసర్ అవసరం ఉండదు. కానీ అతడి ఫిట్నెస్ దృష్ట్యా బౌలర్‌గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పోటీపడుతున్నారు.వీరిలో సంజూ ఐపీఎల్-2024లో దుమ్ములేపుతుండగా.. పంత్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రాహుల్ కూడా బాగానే ఆడుతున్న నిలకడలేమి ఫామ్ కలవరపెడుతోంది.అతడిపై వేటు తప్పదా?మరోవైపు.. ఓపెనింగ్ స్లాట్‌లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి పేరు దాదాపుగా ఖరారు కాగా.. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ విషయంలో జైస్వాల్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జట్టు ప్రకటన తర్వాతే వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 15 మంది భారత ఆటగాళ్ల గురించి స్పష్టతరానుంది. -
క్యూలో నిలబడి ఓటు వేసిన ద్రవిడ్.. పవర్ఫుల్ మెసేజ్
టీమిండియా హెడ్ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. కర్ణాటకలో 14 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం రెండో విడత పోలింగ్ జరుగుతున్న వేళ.. బెంగళూరులో ఓటు వేశాడు.ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా అత్యంత సాదాగా పోలింగ్‌బూత్‌కు తరలివచ్చిన ద్రవిడ్.. ప్రజాస్వామ్యం తనకు ఇచ్చిన హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా భారత యువతను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చాడు.‘‘ఇది నా ఓటు. ప్రజాస్వామ్యం నాకు కల్పించిన అవకాశం. కాబట్టి కచ్చితంగా నేను దీనిని ఇలా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. పోలీసులు బాగా పనిచేస్తున్నారు.ఈసారి పోలింగ్ విషయంలో బెంగళూరు రికార్డు సృష్టిస్తుందని భావిస్తున్నా. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తరలిరావాలి. తమ హక్కును ఉపయోగించుకోవాలి. పౌరులను అప్రమత్తం చేయడంలో మీడియా కూడా ఇంకాస్త చొరవ తీసుకోవాలి’’ అని ఓటు వేసిన అనంతరం రాహుల్ ద్రవిడ్ ఇండియా టుడేతో వ్యాఖ్యానించాడు.కాగా వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉండే రాహుల్ ద్రవిడ్‌కు ప్రస్తుతం విరామం దొరికింది. ఐపీఎల్-2024 నేపథ్యంలో ఆటగాళ్లంతా క్యాష్ రిచ్ లీగ్‌లో భాగమైన వేళ.. ద్రవిడ్ కుటుంబానికి సమయం కేటాయించాడు.అయితే, జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, మే 1 లోగా జట్ల వివరాలను సమర్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి గడువు విధించిన వేళ టీమిండియా ఎంపిక గురించి రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే పలుమార్లు చీఫ్ సెలక్టర్‌తో భేటీ అయినట్లు సమాచారం. -
ఓటు హక్కు వినియోగించుకున్న ద్రవిడ్, కుంబ్లే
దేశంలో ఇవాళ (ఏప్రిల్ 26) సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కేరళలోని 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, ఉత్తర్‌ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 3, చత్తీస్ఘడ్ 3, జమ్మూ కశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపురలో ఒక లోక్‌సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగతుంది. #WATCH | Rahul Dravid casts his vote in Karnataka's Bengaluru.#LokSabhaElections2024 pic.twitter.com/gZ6Ybairc1— ANI (@ANI) April 26, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాల్టి ఉదయం నుంది వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రీడారంగానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇవాళ ఉదయం బెంగళూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య, కొడుకుతో సహా పోలింగ్ కేంద్రం వద్దకు చేరిన ద్రవిడ్ అతి సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు. #Vote #Indiaelections2024 #Karnataka #bengaluru pic.twitter.com/JDi9VYpIA6— Anil Kumble (@anilkumble1074) April 26, 2024 ఓటు వేసిన అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు అని ద్రవిడ్ తెలిపాడు. ద్రవిడ్ సహచరుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఇవాళ బెంగళూరులో ఓటు వేశారు. ఓటు వినియోగించుకున్న విషయాన్ని కుంబ్లే సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. కుంబ్లే తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. -
అవన్నీ అబద్ధాలు.. అసలు అగార్కర్..: రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకు మేనేజ్మెంట్తో ఎలాంటి చర్చలు జరుపలేదన్నాడు. అదే విధంగా.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో గత వారం తాను సమావేశమైనట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేసినపుడు మాత్రమే అవి నిజాలని నమ్మాలని విజ్ఞప్తి చేశాడు. కాగా ఐపీఎల్-2024కు మే 26న తెరపడనుండగా.. జూన్ 1 నుంచి ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈవెంట్ మొదలైన ఐదో రోజున టీమిండియా ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం ఆరంభించనుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఇక ఈ మెగా టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఉంటాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 ప్రదర్శన ఆధారంగానే వరల్డ్‌కప్ జట్టు ఎంపిక ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం ముంబైలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ సమావేశమై జట్టు కూర్పు గురించి జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓపెనర్‌గా విరాట్ కోహ్లి ఫిక్స్ అని.. బౌలింగ్ చేసే విషయంపైనే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక ఆధారపడి ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. అసలు అగార్కర్ ఇక్కడ లేనేలేడు ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ఈ విషయాలపై స్పందించాడు. ‘‘నేను ఎవరినీ కలవలేదు. అజిత్ అగార్కర్ అక్కడెక్కడో దుబాయ్‌లో ఉన్నాడు. ఇక రాహుల్ ద్రవిడ్ తన పిల్లల ఆట చూసేందుకు బెంగళూరులోనే ఉండిపోయాడు. అయితే.. తన కుమారుడి కోసం బహుశా ముంబై వచ్చి ఉంటాడు. ఎర్రమట్టి పిచ్‌పై ఆడించేందుకు ఇక్కడికి తీసుకువచ్చాడేమో! అంతే. అంతకు మించి ఏమీ లేదు. మేము అసలు ఒకరినొకరం కలుసుకోలేదు. అవన్నీ అబద్దాలే ఈరోజుల్లో నేనో, ద్రవిడో, అగార్కరో లేదంటే బీసీసీఐ స్వయంగా స్పందిస్తేనే అవి నిజాలు. మిగతావన్నీ ఫేక్’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. క్లబ్ ప్రైరీ ఫైర్ అనే పాడ్‌కాస్ట్‌లో మైకేల్ వాన్, ఆడం గిల్‌క్రిస్ట్‌లతో మాట్లాడుతూ రోహిత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటగాడిగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే Rohit Sharma said - "I think today's day and age unless you hear it from either myself or Rahul Dravid himself or Ajit Agarkar himself or someone coming from BCCI talking infront of camera everything is fake". (On Kohli-Rohit opening in T20 WC 2024). pic.twitter.com/NUs6Xbs4ek — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 Rohit Himself confirmed he hasn't Met Any bcci official's last week and stated this as a fake news 😂 https://t.co/uIXDn9v8Ew pic.twitter.com/fiNe8keK0Y — Manojkumar (@Manojkumar_099) April 18, 2024 That means reports are fake, Kohli is not in the preference list of BCCI FOR T20 world cup. (Source- Mufa and Johns Paid pr of Kohli) pic.twitter.com/AwP96Uza5w — CAPTAIN (@RoForLife45) April 18, 2024 -
T20 WC 2024: రోహిత్ శర్మకు జోడీగా కోహ్లి ఫిక్స్!
టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లిని భారత ఓపెనర్‌గా చూడబోతున్నామా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రన్‌మెషీన్ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా మెగా టోర్నీలో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఇప్పటికే రోహిత్ శర్మతో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్‌తో పాటు కోహ్లి కూడా సుదీర్ఘకాలం పాటు పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున బరిలోకి దిగలేదు. ఈ క్రమంలో ఇటీవల అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా విరాహిత్ ద్వయం పునరాగమనం చేశారు. అయితే, ఆ సిరీస్‌లో కోహ్లి తను రెగ్యులర్‌గా వచ్చే మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. మరోవైపు.. రోహిత్‌కు జోడీగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశాడు. ఇదిలా ఉంటే.. యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో ప్రపంచకప్-2024లో అసలు కోహ్లికి చోటే దక్కదంటూ గతంలో వార్తలు వచ్చాయి. అగార్కర్ ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా.. రోహిత్ శర్మ వాటిని ఖండించాడని.. కోహ్లి జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఐసీసీ ఈవెంట్లో తన పాత్ర ఏమిటన్న విషయం మీద క్లారిటీ కావాలని కోహ్లి సెలక్షన్ కమిటీని అడిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం ముంబైలో జరిగిన సమావేశంలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ ఇందుకు సంబంధించి కోహ్లిని ఓపెనర్‌గా పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దైనిక్ జాగరణ్.. కథనం వెలువరించింది. కాగా రాయల్ చాలెంజర్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి.. ఇప్పటి వరకు ఐపీఎల్-2024లో ఏడు మ్యాచ్‌లు ఆడి 361 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ఇటీవల కాలంలో రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న యశస్వి జైస్వాల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు రాజస్తాన్ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి 121 రన్స్ మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా సీజన్ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేంద్ర బలగాల అండ..
ఆడపడుచులకు అండగా ఉంటాం..
కాంగ్రెస్‌లోకి మధిర మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
ఖమ్మం బస్టాండ్‌లో వడదెబ్బతో సొమ్మసిల్లిన మహిళ
తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement