-
చాలా సంతోషంగా ఉంది: వర్మ
హైదరాబాద్: టాలీవుడ్ 'కింగ్' నాగార్జున హీరోగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఆఫీసర్. గత నెలలో విడుదలైన ఫస్ట్ టీజర్‌తో పాటు, శుక్రవారం రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. వర్మ, సుధీర్ చంద్ర నిర్మాతగా వ్యవహరించారు. అయితే చాలా కాలం తర్వాత నాగార్జున మాస్ లుక్‌లో కనిపించడంతో పాటు వర్మ డైరెక్షన్లో ఈ మూవీ రావడం ఆకట్టుకునే అంశం. ఆఫీసర్ రెండో టీజర్ విజయవంతమైన నేపథ్యంలో తనకు చాలా సంతోషంగా ఉందని వర్మ ట్వీట్ చేశారు. ‘నాగార్జున ఏ పాత్ర చేసిన అందులో తీవ్రత కనిపిస్తోంది. ఆయన యాక్షన్ హీరోగా బాగున్నారు. ఇటీవల విడుదలైన రెండో టీజర్లో ఆఫీసర్ పాత్రలో నాగార్జునను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని డైరెక్టర్ వర్మ ట్వీట్ చేశారు. నేరాలు జరగకుండా ఏం చేయాలో పోలీస్ ఆఫీసర్ క్రిమినల్స్ నుంచి నేర్చుకుంటాడు. కానీ ఆ క్రమంలో కొందరు పోలీసులు క్రిమినల్స్‌గా మారతారంటూ వర్మ తనదైన మార్కు విషయాలను రెండో టీజర్లో చూపించాడు. మైరా సరీన్ కీలకపాత్ర పోషించగా.. తెరంగేట్రం చేస్తున్న అన్వర్ ఖాన్ విలన్ రోల్ చేశాడు. ఈ 12న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మే 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా డైరెక్టర్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. మరోవైపు ఈ టీజర్‌కు లైక్స్ ఏ స్థాయిలో వస్తున్నాయో, డిస్‌లైక్స్ కూడా, కామెంట్లు కూడా అదే విధంగా రావడం గమనార్హం. I always saw @iamnagarjuna as an intense action hero and i am so happy to see people loving him in this space Teaser 2 of Officer https://t.co/Sctv90BS44 pic.twitter.com/R3yK3WrXXF — Ram Gopal Varma (@RGVzoomin) 5 May 2018 ఆఫీసర్ రెండో టీజర్ మరోసారి మీకోసం.. -
ఆఫీసర్ రెండో టీజర్ వచ్చేసింది
టాలీవుడ్ 'కింగ్' నాగార్జున హీరోగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఆఫీసర్. గత నెల ప్రథమార్థంలో ఫస్ట్ లుక్, లోగోతో పాటు తొలి టీజర్‌ను విడుదల చేసి వర్మ.. తాజాగా ఆఫీసర్ 2వ టీజర్‌ను రిలీజ్ చేశారు. చాలా కాలం తర్వాత నాగార్జున మాస్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆకట్టుకునే అంశం. గత కొంతకాలం నుంచి తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్న వర్మ నాగ్‌తో చేసిన మూవీలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. నేరాలు జరగకుండా ఏం చేయాలో పోలీస్ ఆఫీసర్ క్రిమినల్స్ నుంచి నేర్చుకుంటాడు. కానీ ఆ క్రమంలో కొందరు పోలీసులు క్రిమినల్స్‌గా మారతారంటూ వర్మ తనదైన మార్కును రెండో టీజర్లో చూపించాడు. ఇప్పటికే ఆఫీసర్ షూటింగ్ పూర్తైయింది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో, పోలీస్ ఆఫీసర్, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. నాగ్ కొలీగ్‌గా మైరా సరీన్ నటించారు. తెరంగేట్రం చేస్తున్న అన్వర్ ఖాన్ విలన్ రోల్ పోషించాడు. ఈ 12న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మే 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా డైరెక్టర్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్‌పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement