చాలా సంతోషంగా ఉంది: వర్మ

Ram gopal Varma Happy About Nagarjuna In Officer Teaser 2 - Sakshi

హైదరాబాద్: టాలీవుడ్ 'కింగ్' నాగార్జున హీరోగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఆఫీసర్‌. గత నెలలో విడుదలైన ఫస్ట్ టీజర్‌తో పాటు, శుక్రవారం రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. వర్మ, సుధీర్‌ చంద్ర నిర్మాతగా వ్యవహరించారు. అయితే చాలా కాలం తర్వాత నాగార్జున మాస్ లుక్‌లో కనిపించడంతో పాటు వర్మ డైరెక్షన్‌లో ఈ మూవీ రావడం ఆకట్టుకునే అంశం. ఆఫీసర్ రెండో టీజర్ విజయవంతమైన నేపథ్యంలో తనకు చాలా సంతోషంగా ఉందని వర్మ ట్వీట్ చేశారు. 

‘నాగార్జున ఏ పాత్ర చేసిన అందులో తీవ్రత కనిపిస్తోంది. ఆయన యాక్షన్ హీరోగా బాగున్నారు. ఇటీవల విడుదలైన రెండో టీజర్‌లో ఆఫీసర్ పాత్రలో నాగార్జునను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని డైరెక్టర్ వర్మ ట్వీట్ చేశారు. నేరాలు జరగకుండా ఏం చేయాలో పోలీస్ ఆఫీసర్ క్రిమినల్స్ నుంచి నేర్చుకుంటాడు. కానీ ఆ క్రమంలో కొందరు పోలీసులు క్రిమినల్స్‌గా మారతారంటూ వర్మ తనదైన మార్కు విషయాలను రెండో టీజర్‌లో చూపించాడు. మైరా సరీన్ కీలకపాత్ర పోషించగా..  తెరంగేట్రం చేస్తున్న అన్వర్ ఖాన్ విలన్‌ రోల్‌ చేశాడు.  ఈ 12న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మే 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా డైరెక్టర్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. మరోవైపు ఈ టీజర్‌కు లైక్స్ ఏ స్థాయిలో వస్తున్నాయో, డిస్‌లైక్స్ కూడా, కామెంట్లు కూడా అదే విధంగా రావడం గమనార్హం.

ఆఫీసర్ రెండో టీజర్‌ మరోసారి మీకోసం..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top