-
పిచ్చి పట్టిందా నీకు...
‘మంచిగా కనపడేవాళ్లందరూ మంచివాళ్లు కాదురా... ఫర్ ఎగ్జాంపుల్ నేను’ అంటూ మొదలవుతుంది ‘మనమే..’ సినిమా టీజర్. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్లేబాయ్ మనస్తత్వం ఉండే అబ్బాయి, బాధ్యతగా జీవించాలనుకునే ఓ అమ్మాయి జీవితాల్లోకి విక్రమాదిత్య అనే ఓ పిల్లవాడు వచ్చినప్పుడు వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి? అన్నదే ఈ చిత్రం కథాంశమన్నట్లుగా యూనిట్ చెబుతోంది. ‘వాడప్పట్నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలేం చేశావ్... (కృతీ శెట్టి), ‘తాగటానికెళ్లొచ్చా..’ (శర్వానంద్), ‘ఇల్లు చూసుకోవడం రాదు... పిల్లవాడిని చూసుకోవడం రాదు... పిచ్చిపట్టిందా నీకు...’ (కృతీ శెట్టి), ‘ఇద్దరిలో ఒకళ్లు ఏడ్వండి’ (శర్వానంద్) వంటి సంభాషణలు విడుదలైన టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
శర్వానంద్, కృతీ శెట్టి కొత్త సినిమా టీజర్ విడుదల
శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘మనమే’. శర్వానంద్ 35వ సినిమాగా విడుదలకు సిద్దంగా ఉంది. లండన్ నేపథ్యంలో, కొత్తతరం ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శర్వానంద్, కృతీ శెట్టి ఈ చత్రంలో భార్యాభర్తలుగా నటించినట్లు తెలుస్తోంది. వారిద్దరి కుమారుడిగా విక్రమ్ ఆదిత్య ఉన్నాడు. టీజీర్లో చాలా ముద్దుగా కనిపిస్తున్న ఆ బాబుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. శమంతకమణి, దేవదాస్,భలే మంచి రోజు వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీరామ్ ఆదిత్య 'మనమే' చిత్రంతో ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మనమే చిత్రం తర్వాత శర్వానంద్ మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో మాళవికా నాయర్ హీరోయిన్గా తన 36వ సినిమాగా రానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నుంచి 37వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో శర్వా బిజీగా ఉన్నారు. -
కృతి శెట్టి కిర్రాక్ లుక్స్.. లేటెస్ట్ (ఫొటోలు)
-
కృతిశెట్టి బెల్లీ డ్యాన్స్
-
కృతిశెట్టి బెల్లీ డ్యాన్స్... వైరల్ హిట్!
'ఉప్పెన'తో తెలుగులోకి అడుగుపెట్టి భారీ విజయాన్ని అందుకుంది కృతిశెట్టి . ఆ తర్వాత వరసగా విజయాలు అందుకున్న ఆ నాయికను ఈ ఏడాది మాత్రం పరాజయాలే పలకరించాయి. తాజాగా ఆమె మలయాళ చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బంగార్రాజు, శ్యాంసింగరాయ్ చిత్రాలతో పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన కస్టడీ ,మాచర్ల నియోజకవర్గం,వారియర్ వంటి చిత్రాలు పెద్దగా మెప్పించలేదు. దీంతో ఆమె తమిళ్,కన్నడ చిత్రాలపై ఆసక్తి చూపింది. అక్కడ పలు అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతుంది. తెలుగులో శర్వానంద్‌తో ఒక సినిమాలో నటిస్తుండగా తమిళ్లో లవ్ టుడే చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. ఆపై మలయాళంలో కూడా ఒక సినిమా ఒప్పుకుంది. దీంతో ప్రస్తుతం ఆమె మళ్లీ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఫ్యాన్స్ కోసం ఎప్పుడూ టచ్‌లో ఉండే బేబమ్మ తాజాగా బెల్లీ డ్యాన్స్ వీడియోతో యూత్ మతులు పోగొడుతుంది. విజయ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ కు బెల్లీ డాన్స్ చేసింది ఈ బ్యూటీ. తన అందంతో పాటు టాలెంట్‌ను కూడా చూపి అందరినీ మెస్మరైజ్ చేసింది. కృతిశెట్టి చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement