-
అందుకే రాహుల్‌ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు ఎంపికపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకపోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ మెగా టోర్నీకి రాహుల్‌ను సెలక్ట్ చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ తమకు కావాలనుకున్నామని, అందుకే రాహుల్‌ను ఎంపిక చేయలేదని అగార్కర్ చెప్పుకొచ్చాడు."రాహుల్ టీ20ల్లో ఎక్కువగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మేము మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్‌ను ఎంపిక చేయాలనకున్నాం. అందుకే రాహుల్‌ను పక్కన పెట్టి సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లకు స్పెషలిస్టు వికెట్ కీపర్ బ్యాటర్లగా ఎంపిక చేశాము. వీరిద్దరికి మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా ఉందని" ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో అగార్కర్ పేర్కొన్నాడు. ఈ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోన్నాడు.భారత టీ20 ప్రపంచకప్ జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్. -
T20 WC: డీకే అవసరమా?.. వాళ్లిద్దరు బెస్ట్!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 1ని డెడ్‌లైన్‌గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్ కీపర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.పోటీలో ఆ నలుగురు!కాగా ప్రపంచకప్ జట్టులో బెర్తు కోసం రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 195.52 స్ట్రైక్‌రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టినా.. ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు.ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా రాణిస్తూ.. వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్‌తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.డీకే అవసరమా?ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్ రాహుల్ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్‌కప్‌లో అతడు రాణించలేకపోయాడు.కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్ పంత్, సంజూ శాంసన్ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. -
వరల్డ్‌కప్ బెర్త్ పక్కా చేసుకున్న పంత్.. సంజూకు మరోసారి మొండిచెయ్యేనా..?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్ టీ20 వరల్డ్‌కప్ బెర్త్ పక్కా చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ వార్తా సంస్థ ఓ కథనంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. పంత్ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఉంటాడని సమాచారం. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా పంత్ వరల్డ్‌కప్ బెర్త్‌ను ఖరారు చేశారని తెలుస్తుంది. కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి ఇటీవలే బయటపడ్డ పంత్.. ఈ ఐపీఎల్ సీజన్లో ఇరగదీస్తున్నాడు. ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.అలాగే అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా..మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా..అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్‌గా..అత్యధిక స్ట్రయిక్‌రేట్ కలిగిన కెప్టెన్‌గా..రెండు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా..రెండు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక వికెట్‌కీపర్ బ్యాటర్‌గా..అత్యధిక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా పలు ఘనతలు సొంతం చేసుకున్నాడు. నిన్న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ పాత రోజులు గుర్తు చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న పంత్.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పంత్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు 2 క్యాచ్‌లు కూడా పట్టాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక కావాలంటే ఇంతకంటే ఏం కావాలని పంత్ అభిమానులు అంటున్నారు. పంత్ వరల్డ్‌కప్ బెర్త్ ఖరారైందనుకుంటే సెకెండ్ ఛాయిస్ వికెట్‌కీపర్ ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ స్థానంలో కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ తీవ్రంగా పోటీపడుతున్నారు. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఈ రేసులో రాహుల్ ముందున్నట్లు తెలుస్తుంది. రాహుల్ మిడిలార్డర్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగలడని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచెయ్యి ఖాయం.శాంసన్‌ను తృణీకరించేందుకు సెలెక్టర్ల వద్ద పెద్ద కారణాలు లేకపోయినా సమీకరణల పేరుతో అతన్ని పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. సంజూ సంబంధించిన ఈ విషయాన్ని ఇటీవలే మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కూడా ప్రస్తావించారు. జస్టిస్ ఫర్ సంజూ అని ఓ ట్వీట్ చేశారు. సంజూ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఈ నెలఖరులోగా టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. -
వారెవ్వా జడేజా.. క్రికెట్ చరిత్రలోనే సంచలన క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. జడ్డూ అద్బుతమైన క్యాచ్‌తో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మతీషా పతిరానా బౌలింగ్‌లో తొలి బంతిని రాహుల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా.. ఎడమవైపున్కు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన రాహుల్‌తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వారెవ్వా జడ్డూ సూపర్ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. జడేజా(57), ధోని(28 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డికాక్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, పతిరానా తలా వికెట్ సాధించారు. Ravi Shastri - "What a Catch, is that the Catch of IPL, WOW, that was Flying like a Trace of Bullet" Ravindra Jadeja took "One of the Greatest Catch of IPL 2024" 👏#CSKvLSG #CSKvsLSGpic.twitter.com/SQDFOz9Lmo — Richard Kettleborough (@RichKettle07) April 19, 2024 -
‘సూపర్’ పోరులో జెయింట్స్ పైచేయి
ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు ఓటముల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కోలుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ను నిలువరించిన లక్నో ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం చేరింది. ఛేదనలో కేఎల్ రాహుల్, డికాక్ కీలక పాత్ర పోషించగా... రెండు వరుస విజయాల తర్వాత చెన్నై తలవంచింది. లక్నో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో లక్నో కీలక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 8 వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... రహానే (24 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), మొయిన్ అలీ (20 బంతుల్లో 30; 3 సిక్స్‌లు), ధోని (9 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్నో 19 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 82; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్ డికాక్ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 90 బంతుల్లోనే 134 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. ధోని మెరుపులు... ఓపెనర్ రచిన్ రవీంద్ర (0) టోర్నీలో తన వరుస వైఫల్యాలను కొనసాగించగా... మరో ఎండ్‌లో రహానే కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై 51 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17) ప్రభావం చూపలేకపోగా, నాలుగో స్థానంలో వచ్చిన జడేజా పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే రహానేతో పాటు ఫామ్‌లో ఉన్న శివమ్ దూబే (3), సమీర్ రిజ్వీ (1)లను తక్కువ వ్యవధిలో అవుట్ చేసి లక్నో ఆధిక్యం ప్రదర్శించింది. ఈ సమయంలో కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా చెన్నై బ్యాటర్లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఒకదశలో వరుసగా 34 బంతుల పాటు బౌండరీనే రాలేదు! 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 113/5. అయితే చివరి 4 ఓవర్లలో సూపర్ కింగ్స్ చెలరేగి 63 పరుగులు రాబట్టింది. మొహసిన్ ఓవర్లో సిక్సర్‌తో 34 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... బిష్ణోయ్ వేసిన తర్వాతి ఓవర్లో అలీ వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. అనంతరం 19వ ఓవర్లో 4, 6 కొట్టిన ధోని... ఆఖరి ఓవర్లో మరో 2 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగాడు. ఏడో వికెట్‌కు ధోని, జడేజా 13 బంతుల్లో 35 పరుగులు జోడించారు. శతక భాగస్వామ్యం... ఛేదనను రాహుల్, డికాక్ ఘనంగా ఆరంభించారు. వీరిద్దరిని ఇబ్బంది పెట్టడంలో చెన్నై బౌలర్లంతా విఫలమయ్యారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 54 పరుగులు రాగా... 10.5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు దాటింది. 31 పరుగుల స్కోరు వద్ద డికాక్ ఇచ్చిన క్యాచ్‌ను పతిరణ వదిలేయగా, 31 బంతుల్లో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 41 బంతుల్లో డికాక్ కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. విజయానికి చేరువైన దశలో తక్కువ వ్యవధిలో వీరిద్దరు అవుటైనా... లక్ష్యం చేరేందుకు లక్నోకు ఇబ్బంది ఎదురు కాలేదు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (బి) కృనాల్ 36; రచిన్ (బి) మొహసిన్ 0; రుతురాజ్ (సి) రాహుల్ (బి) యశ్ 17; జడేజా (నాటౌట్) 57; దూబే (సి) రాహుల్ (బి) స్టొయినిస్ 3; రిజ్వీ (స్టంప్డ్) రాహుల్ (బి) కృనాల్ 1; అలీ (సి) బదోని (బి) బిష్ణోయ్ 30; ధోని (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు 176. వికెట్ల పతనం: 1–4, 2–33, 3–68, 4–87, 5–90, 6–141. బౌలింగ్: హెన్రీ 3–0–26–0, మొహసిన్ 4–0–37–1, యశ్ ఠాకూర్ 4–0–45–1, కృనాల్ పాండ్యా 3–0–16–2, రవి బిష్ణోయ్ 4–0–44–1, స్టొయినిస్ 2–0–7–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) ధోని (బి) ముస్తఫిజుర్ 54; రాహుల్ (సి) జడేజా (బి) పతిరణ 82; పూరన్ (నాటౌట్) 23; స్టొయినిస్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో 2 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–134, 2–161. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–26–0, తుషార్ 4–0–42–0, ముస్తఫిజుర్ 4–0–43–1, జడేజా 3–0–32–0, పతిరణ 4–0–29–1, అలీ 1–0–5–0. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X హైదరాబాద్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement