-
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
హిందీలో చాలా ఏళ్ల నుంచి దర్శకుడు, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కరణ్ జోహార్. ప్రస్తుతం డైరెక్షన్ పక్కనబెట్టి నిర్మాతగా వరస చిత్రాలు తీస్తున్నారు. కరణ్ నిర్మించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ఈ నెల చివర్లో రానుంది. సరే దాని గురించి పక్కనబెడితే ఈయన్ని ఇప్పుడు ఓ కమెడియన్ ఘోరంగా హర్ట్ చేశాడు. దీంతో కరణ్ ఫుల్ ఫైర్ అయ్యాడు. తనని చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇన్ స్టాలో స్టోరో కూడా పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)ఇంతకీ ఏమైంది?దర్శకనిర్మాత కరణ్ జోహార్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోల్స్, మీమ్స్ వస్తూనే ఉంటాయి. వాటిని చూసిచూడనట్లు వదిలేస్తుంటాడు. అయితే ప్రముఖ రియాలిటీ షోలో ఓ కమెడియన్.. కరణ్‌ని దారుణంగా అనుకరించాడట. తల్లితో కలిసి టీవీ చూస్తున్న టైంలో ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చిందని, దీంతో తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.కరణ్ పోస్టులో ఏముంది?'నేను, మా అమ్మతో కలిసి టీవీ చూస్తున్నాను. ఓ పేరున్న ఛానెల్లో రియాలిటీ కామెడీ షో ప్రోమో ఒకటి చూశాను. అయితే ఓ కమెడియన్.. నన్ను చాలా చీప్‌గా అనుకరించాడు. ఇలాంటివి ట్రోలర్స్ నుంచి వచ్చాయంటే అర్థముంది. కానీ ఇండస్ట్రీలో పేరున్న కమెడియన్ ఇలా చేయడం ఏం బాలేదు. దాదాపు 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను ఇలా అవమానించడం కరెక్టేనా? ఈ విషయంలో నాకు కోపం రావట్లేదు కానీ చాలా బాధ కలుగుతోంది' అని కరణ్ జోహార్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆ షో ఏంటి? కమెడియన్ ఎవరనేది మాత్రం బయటకు చెప్పలేదు.(ఇదీ చదవండి: శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా) -
అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
కరణ్ జోహార్ ఇంట్లో కనిపించిన త్రిప్తి దిమ్రీ
-
అందరూ చూస్తుండగా అతడి కాళ్లు మొక్కబోయిన సమంత!
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ మంగళవారం (మార్చి 19న) పెద్ద ఈవెంట్ నిర్వహించింది. త్వరలో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవేనంటూ పెద్ద లిస్ట్ విడుదల చేసింది. ఆయా సినిమాలకు సంబంధించిన తారలంతా ఈ ఈవెంట్లో తళుక్కుమని మెరిశారు. టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా సిటాడెల్ సిరీస్ కోసం స్టేజీపైకి వచ్చింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న హీరో వరుణ్ ధావన్.. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ పాదాలకు నమస్కరించాడు. దాన్ని గుర్తు చేయొద్దు ఇంతలో సమంత సైతం అతడి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన కరణ్.. వద్దు, వద్దంటూ సామ్‌ను ఆపాడు. దీంతో వరుణ్.. అందరూ కరణ్ పాదాలకు నమస్కరించాల్సిందేనన్నాడు. దీనికి కరణ్ బదులిస్తూ.. నన్ను అప్పుడే అంత పెద్దవాడిని చేసేయొద్దు ప్లీజ్.. ఈ మధ్యే ఓ ఏజ్(50 ఏళ్లు) దాటేశాను. దయచేసి నాకు దాన్ని గుర్తు చేయొద్దు అని చెప్పాడు. అయినప్పటికీ వినని వరుణ్.. మీ ముఖంలో వయసు కనిపించనీయకుండా మీ స్కిన్ డాక్టర్ చాలా బాగా కష్టపడుతున్నాడు అని సెటైర్స్ వేశాడు. నేనే ట్రీట్మెంట్ చేయించుకోలే నేనేమీ అందరిలా ముఖానికి సర్జరీలు, ట్రీట్మెంట్లు చేయించుకోలేదు.. అలాంటివారిలో నేను ఒకడిని కానే కాదు అని నొక్కి చెప్పాడు కరణ్. ఇకపోతే సిటాడెల్ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సిటాడెల్ అనే హాలీవుడ్ సిరీస్‌కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఇందులో సిమ్రాన్, కేకే మీనన్, శివశక్తి సింగ్, సఖీబ్ సలీం, సిఖిందర్ ఖేర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. गले 😍. . .#varundhawan #karanjohar #samantharuthprabhu #Reelswithtahirjasus #jasus007 pic.twitter.com/XwHon5qfVY — Tahir Jasus (@Tahirjasus) March 19, 2024 చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన ప్రేమలు హీరోయిన్ -
డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే
స్టార్ హీరోయిన్ నటించిన ఓ మూవీ ఓటీటీలో నేరుగా రిలీజ్ కానుంది. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్య కథతో తీసిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. విజువల్స్, స్టోరీ పరంగా కాస్త ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం కోసం ఇప్పుడు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఇదే సినిమా? ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తెలుగులో తక్కువ కానీ హిందీలో చాలా సినిమాలు నేరుగా ప్రముఖ ఓటీటీల్లో రిలీజై అయిపోతున్నాయి. లాక్డౌన్ తర్వాత నుంచి ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ సారా అలీ ఖాన్ కాంబోలో తీసిన సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఉషా మెహతా అనే స్వాతంత్ర్య ఉద్యమకారిణి జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1942లో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు చాలామంది నిస్వార్థంగా పనిచేశారు. అలా అండర్ గ్రౌండ్లో రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి, ఉద్యమకారుల్లో చైతన్యాన్ని రగిల్చిన ఓ మహిళ కథే ఈ సినిమా. సారా అలీ ఖాన్ టైటిల్ రోల్ పోషించింది. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మార్చి 21 నుంచి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement