-
మహిళా వలంటీర్లపై గూండాగిరి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులందరినీ గుండాలు, రౌడీలంటూ నోరు పారేసుకుంటుంటారు. కానీ, ఆయన పార్టీ అభ్యర్థులు, నాయకులు మహిళా వలంటీర్ల పైన కూడా దౌర్జన్యానికి దిగి, గృహ నిర్బంధానికి పాల్పడ్డారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ సహా ఆ పార్టీ నాయకులు గురువారం సాగించిన గూండాగిరీతో మహిళా వలంటీర్లు బెంబేలెత్తిపోయారు. ఓ మహిళా వలంటీరు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటుండగా ఆ భవనంలోకి చొరబడటమే కాకుండా, ఆమెతో పాటు వేడుకలకు వచ్చిన మిగతా మహిళా వలంటీర్లపై దౌర్జన్యం చేసి, కుర్చిలు విరగ్గొట్టి, వారిని గృహ నిర్బంధం చేసి భయభ్రాంతులకు గురి చేశారు. భయంతో మహిళలు కేకలు వేసినా, గర్భిణి ఉందని మొత్తుకున్నా ఖాతరు చేయలేదు. గంటన్నర పాటు మహిళలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాణ భయంతో పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆ మహిళలను విడిపించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహిళా వలంటీరు మొయ్యా దుర్గా భవాని కాకినాడ రూరల్ నియోజకవర్గం వినాయక కేఫ్ సమీపంలోని ఓ భవనంలో గురువారం ముందస్తు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకలకు ఆమె స్నేహితురాళ్లైన పలువురు మహిళా వలంటీర్లు హాజరయ్యారు. పుట్టిన రోజు కేకు, కూల్ డ్రింక్‌లు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే హఠాత్తుగా 30 మందిని వెంట బెట్టుకుని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) అక్కడకు వచ్చారు. ఇక్కడ పార్టీ సమావేశం పెట్టుకుంటున్నారంటూ పెద్దగా కేకలు వేస్తూ వారిపై విరుచుకుపడ్డారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నామని చెబుతున్నా వినకుండా తలుపులు తన్నుకుంటూ లోపలకు వెళ్లి వీరంగం సృష్టించారు. దీంతో మహిళా వలంటీర్లు భయాందోళనలకు గురయ్యారు. తమతో పాటు గర్భిణి ఉన్నారని, ఆమె భయపడిపోతున్నారని, కేకలు వేయవద్దని బతిమిలాడారు. అయినా వారు వినలేదు. నానా రచ్చ చేసి, వలంటీర్లు కూర్చున్న కుర్చిలను ధ్వంసం చేశారు. మహిళా వలంటీర్లు లోపల ఉండగానే నానాజీ కనుసైగలతో ఆ పార్టీ కార్యకర్తలు గది తలుపులు మూసేసి గొళ్లేలు పెట్టేసి, భవనం కింది భాగంలోకి వెళ్లిపోయారు. మహిళా వలంటీర్లు కిటికీల వద్దకు వచ్చి తలుపులు తీయాలని, ఊపిరి ఆడటంలేదని ఎంతసేపు అర్థించినా వినిపించుకోలేదు. జనసేన నాయకుల విధ్వంసంతో గర్భిణి నున్న చిట్టమ్మ గదిలోనే సొమ్మసిల్లి పడిపోవడంతో అంతా భయకంపితులయ్యారు. వారిలో ఒక వలంటీరు తన మొబైల్ ఫోను ద్వారా కాకినాడ డీఎస్పీ హనుమంతరావుకు సమాచారం అందించింది. దీంతో సర్పవరం సీఐ వైఆర్‌కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్నాయి. పోలీసులు తలుపులు తెరిచి మహిళా వలంటీర్లను విడిపించారు. అక్కడ రాజకీయ పార్టీ సమావేశం జరుగుతోందంటూ పంతం నానాజీ పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ కార్యాలయంలో రాజకీయ పార్టీకి సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవని ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి బీబీబీ రాజు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశామని, అన్ని వివరాలు రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్‌కు నివేదిస్తామని రాజు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు జనసేన నాయకుల దాడిపై రమణయ్యపేట కూరగాయల మార్కెట్ వీధికి చెందిన బాధిత వలంటీరు దుర్గాభవాని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు జనసేన అభ్యర్థి పంతం నానాజీతో పాటు పలువురిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మహిళల గృహ నిర్బంధం, భయభ్రాంతులకు గురి చేయడం, మూకుమ్మడిగా వచ్చి దౌర్జన్యం చేశారనే అభియోగాలపై ఐపీసీ 143, 452, 341, 342, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. భయంతో వణికిపోయాం ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి పడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నాకు ఏడో నెల. గర్భిణి అని కూడా కనీసం జాలి, కరుణ కూడా లేకుండా గదిలో నిర్బంధించి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోయాం. తీవ్ర ఆందోళనతో సొమ్మసిల్లి పడిపోయాను. – నున్న చిట్టమ్మ, రమణయ్యపేట మహిళలని కూడా చూడలేదు జనసేన నాయకులు, కార్యకర్తలు అమానుషంగా ప్రవర్తించారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న వారు మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు. కుర్చీలు విరగ్గొట్టేశారు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే దౌర్జన్యం చేసి, తలుపు గడియ పెట్టేసి వెళ్లిపోయారు. ఏ రాజకీయ పార్టీ సమావేశం పెట్టుకోవడంలేదని ఎంత చెప్పినా వినలేదు. – కుసనం శాంతకుమారి, రమణయ్యపేట పుట్టిన రోజు చేసుకుంటుంటే నిర్బంధించారు నా పుట్టిన రోజు శుక్రవారం అయినప్పటికీ స్నేహితులందరూ అందుబాటులో ఉండరని చెప్పడంతో గురువారమే వేడుకలు చేసుకునేందుకు వారందరినీ ఆహా్వనించాను. కేకు తెచ్చుకొని పార్టీ సిద్ధమవుతుండగా ఒకేసారి గుంపుగా వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మా కార్యాలయం గది తలుపులు మూసేసి, గడియ పెట్టి నిర్బంధించారు. ఎంత వేడుకున్నా తలుపులు తీయలేదు. – మొయ్యా దుర్గాభవాని, రమణయ్యపేట, కాకినాడ రూరల్ -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్‌ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. అనంతరం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఇది మంచిది కాదని తెలిపారు. బాధితులపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. హిందువులపై దాడి చేస్తే ఊరుకోమని అన్నారు. కాగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండగ సందర్భంగా హోలీ అడుకుంటున్న మహిళలపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు
-
నైరాశ్యంలో టీడీపీ నేతలు
సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ తమ అధినేత నిప్పులాంటి వాడని పదేపదే డప్పు కొట్టిన టీడీపీ శ్రేణులు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లడంతో తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయాయి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పలు అవినీతి ఆరోపణలు, కేసుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఆయన తొలిసారి జైలుకు వెళ్లడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వ్యవహారంలో రెండు రోజులుగా పలు నాటకీయాలు పరిణామాలు చోటు చేసుకుంటున్నా పార్టీ శ్రేణులు, నాయకులు బయటకు రావడానికి ఇష్టపడడంలేదు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పదేపదే ఫోన్లు చేసి ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, నిరసనలకు దిగాలని సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో స్పందన శూన్యం. అక్కడక్కడా ఒకటీ అరా ప్రచారం కోసమేనని స్పష్టమవుతోంది. ఆదివారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేయాలని పార్టీ పిలుపు ఇచ్చినా పట్టుమని పది చోట్ల కూడా జరగలేదు. తమను పోలీసులు హౌస్ అరెస్టు చేశారని చెబుతూ నియోజకవర్గ ఇన్చార్జీలు బయటకు రావడంలేదు. కనీసం పది మంది అయినా బయటకు రాకపోవడంతో ఏం చేయాలో తోచక ముఖ్య నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ద్వితీయ, తృతీయ స్థాయి క్యాడర్ సైతం పట్టించుకోకపోవడంపై పారీ్టలో ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా, గుంటూరులో మరీ తీసికట్టు టీడీపీకి బాగా పట్టుందని చెప్పుకునే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కనీస స్పందన లేకపోవడం పార్టీ ముఖ్య నాయకులకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబును విచారించిన సిట్ కార్యాలయం ఉన్న తాడేపల్లి, విజయవాడ కోర్టు పరిసరాల్లో అలజడి సృష్టించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. విజయవాడ నగర నాయకులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, కేశినేని చిన్ని, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలకు చెందిన బొండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు లాంటి నేతలు గృహ నిర్బంధం పేరుతో బయట కనపడకపోవడం చర్చనీయాంశమైంది. ముఖ్య నాయకులు ఫోన్లు చేసి ఏదో ఒక కార్యక్రమం చేయాలని వారిని కోరుతున్నా ఒక్కరు కూడా స్పందించలేదు. రకరకాల కారణాలు చెబుతూ ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. కళ్లెదుట పక్కా ఆధారాలు.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని సీఐడీ సాక్ష్యాధారాలతో వివరంగా బయట పెట్టడం, చంద్రబాబు అవినీతి చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుండడం టీడీపీ యంత్రాంగానికి ఇబ్బందిగా మారింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక నేతలు సతమతమవుతున్నారు. పక్కా ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుండడంతో అవినీతిని కొట్టి పారేయలేకపోతున్నారు. తమ నేత నిజాయితీపరుడని, దార్శనికుడని, చాణక్యుడని చెప్పుకునే వారంతా తాజా పరిణామంతో డీలా పడిపోయారు. రాజకీయాల్లో మర్రిచెట్టులా పాతుకుపోయి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో నైపుణ్యం కలిగిన తమ అధినేతను రాష్ట్ర ప్రభుత్వం జైలుకు పంపించిందనే విషయాన్ని టీడీపీ నేతలు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఏ రకంగానూ చంద్రబాబు అవినీతి సమర్థిచలేమని నాయకులు మదనపడుతున్నారు. అందుకే బయటకు రావడానికి ఇష్టపడడంలేదు. -
నేనంటే కేసీఆర్‌కు భయం
సాక్షి, హైదరాబాద్: తనను చూసి కేసీఆర్ భయపడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బంధు అక్రమాలపై నిరసన తెలపడానికి బయలుదేరిన ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేశారు.ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్న షర్మిలను, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల పోలీసులకు హారతి ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు సీఎం కేసీఆర్ తొత్తుల్లా పని చేయడం మానుకోవాలన్నారు. తనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు కొనసాగిన ఆమె దీక్షను తీగుల్ గ్రామస్తులు వచ్చి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. షర్మిల నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు తొమ్మిదేళ్లుగా గుడిసెల్లోనే.. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తాను వెళ్లాలనుకున్న తీగుల్ గ్రామంలో దళితులు తమ ఇళ్ల ఫొటోలు పంపి, వారి కోసం కొట్లాడాలని వినతి పత్రం పంపించారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు ఓట్లేసి గెలిపించినా.. తొమ్మిదేళ్లుగా ఈ ప్రజలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నారన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లోనే దళిత బంధు ఇంత దరిద్రంగా అమలవుతుంటే ఇతర నియోజకవర్గాల్లో ఎలా అమలవుతుందో ఊహించుకోవచ్చన్నా రు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలుంటే.. ఇప్పటి వరకు 38 వేల కుటుంబాలకే దళిత బంధు అమలైందన్నారు. ప్రతి ఒక్కరికీ దళితబంధు పథకం అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement