-
Betel Leaf: తమల పాకులతో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్!
తమలపాకు లేకుండా శుభాకార్యాలను అసలు ఊహించలేం కదా. అలాగే విందుభోజనం తరువాత తాంబూలం సేవించడం కూడా చాలామందికి అలవాటు. విటమిన్ ఎ, సి, బి1, బి2, పొటాషియం, థయామిన్, నియాసిన్ , రైబోఫ్లావిన్ వంటి పోషకాలు తమలపాకులలో లభిస్తాయి. అలాగే జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. కానీ తమలపాకుతో జుట్టు సమస్యలకు చెక్ చెప్పవచ్చని మీకు తెలుసా? సహజంగా దొరికే తమలపాకుద్వారా జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు. తలలో దురద, తెల్లజుట్టు సమస్య కూడా నయమ వుతుంది. తమలపాకుల్లో ఉండే విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు జుట్టు చిట్లడం మరియు రాలడాన్ని నివారిస్తాయి. కాబట్టి జుట్టు రాలకుండా ఉండేందుకు తమలపాకులను ఉపయోగించే మార్గాన్ని తెలుసుకుందాం.తమలపాకు నీటితో జుట్టును కడగాలితల కడుక్కోవడానికి 15-20 తమలపాకులను ఒక పాత్రలో వేసి మరిగించాలి. చల్లారిన తరువాత దీంతో జుట్టులో వాచ్ చేయాలి. తమలపాకులో యాంటీమైక్రోబయల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్ సమస్యను దూరం చేస్తుంది. తమలపాకు,నెయ్యి హెయిర్ మాస్క్తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టు చేయాలి. ఇందులో టీస్పూను నెయ్యి వేసి కలిపి, మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. మసాజ్తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారంలో ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.తమలపాకులతో చేసిన నూనెజుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే తమలపాకుతో చేసిన నూనె కంటే గొప్పది ఏదీ ఉండదు. కొబ్బరి లేదా ఆవనూనెలో 10 నుండి 15 తమలపాకులను వేసి సన్నని మంటపై మరిగించాలి. తమలపాకులు నల్లగా మారాగా, ఈ నూనెను వడపోసి, స్కాల్ప్ నుంచి జుట్టంతా బాగా పట్టించాలి. ఇది రాత్రంతా ఉంచుకోవచ్చు. తలస్నానానికి ఒక గంట ముందు రాసు కోవచ్చు. తమలపాకులను తినండిఉదయం ఖాళీ కడుపుతో 5-6 తమలపాకులను నమలవచ్చు లేదా 10-5 తమలపాకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తీసుకోవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. -
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
ఉసిరి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయో తెలిసిందే. అయితే దీన్ని వేసవిలో తీసుకోవచ్చా. తింటే మంచిదేనా..? అని చాలామందికి ఎదురయ్యే సందేహం. ఆయుర్వేదం పరంగా ఔషధంగా ఉపయోగించే ఈ ఉసిరిని వేసవిలో తీసుకోవచ్చా అంటే..నిపుణులు బేషుగ్గా తీసుకోవచ్చని చెబుతున్నారు. సమ్మర్ హీట్‌కి సరైన ఫ్రూట్ అని చెబుతున్నారు. వేసవిలో ఉసిరి తీసుకోవడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో సవివరంగా తెలుసుకుందామా..!వేసవిలో అందరూ ఎదుర్కొనే సమస్య డీహైడ్రేషన్. దీని కారణంగా జీర్ణ సమస్యలు, అలర్జీలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి పలు సమస్యలు ఎదుర్కొంటారు. వాటికి చెక్‌పెట్టడంలో ఉసిరి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సమ్మర్ హీట్‌ని తట్టుకునేలా రోగనిరోధక శక్తినిపెంచి, పొట్టలో వచ్చే మంటను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక విటమిన్ సీ కంటెంట్ ఫ్రీ రాడికల్స్‌గా పిలిచే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టాన్ని అరికడుతుంది. అలాగే శరీర కణాలు, కణాజాలా ఆరోగ్యకరమైన పనితీరులో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఉసిరి హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి ఉష్ణ సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. శరీరానికి చలువ చేస్తోంది. ఇది హైడ్రేట్‌గా ఉంచడంతో అంతర్గత ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా చాలా నీరు చెమట రూపంలో వెళ్లినా.. శరీరాన్ని హైడ్రేటడ్గా ఉంచడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. అందువల్ల జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడటమే గాక మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రించి ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు దగ్గు, జలుబు, జ్వరం, అలెర్జీలు వంటి వ్యాధుల నుంచి వేగంగా కోలుకునేలా చేస్తుంది. కొలస్ట్రాల్‌కి చెక్‌పెడుతుంది. ముఖ్యంగా రక్తంలో ఎల్డీఎల్ లేదా చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఇది ఆకలిని తగ్గించి, బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యూవీ రేడియేషన్, పర్యావరణ కారకాల నుంచి రక్షిస్తుంది. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉండేలా చేసి ముఖంపై పడే ముడతలను నివారిస్తుంది. అందువల్ల సమ్మర్లో ఎండ వేడిని తట్టుకోవడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుందని, తప్పక తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: కే బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ కూతురు!) Breadcrumb -
Black Salt Benefits : బ్లాక్ సాల్ట్‌తో ఇన్ని లాభాలా?
కోవిడ్-19 సంక్షోభం తరువాతఅందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి బ్లాక్ సాల్ట్ లేదా నల్ల ఉప్పు. నల్ల ఉప్పుతో ఎలాంటి ప్రయోజ నాలున్నాయో తెలుసుకుందాంఉప్పులేని వంటిల్లు లేదు. కానీ మనం రెగ్యులర్‌గా వాడే తెల్ల ఉప్పుతో కంటే కూడా బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కలిగిన బ్లాక్‌సాల్ట్ ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. ఇది రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో సహాయపడే ఈ నల్ల ఉప్పు చాలాబాగా పనిచేస్తుంది. అలాగే నల్ల ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచిది. నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మందికి తెలియదు.ఎసిడిటీ, మెరుగైన జీర్ణక్రియ తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి నల్ల ఉప్పు నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నల్ల ఉప్పును సరైన పరిమాణంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. బ్లాక్ సాల్ట్ చాట్ లేదా సలాడ్ అయినా వాటి రుచిని పెంచుతుంది. ఇది అనేక యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాల నిధి.గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా దీని వినియోగం చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మితిమీరి ఎలాంటిది తీసుకున్నా హానికరం కాబట్టి, దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.బరువు తగ్గడానికినల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది.సలాడ్, పానీయం వంటి మొదలైన వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే మంచిది.నోటి ఆరోగ్యం గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు వేసి నిద్రించే ముందు పుక్కిలిస్తే దంతాలు బలపడతాయి. దీంతో పంటి నొప్పి, కుహరం సమస్యలు కూడా నయం అవుతాయి. చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన సమస్యను కూడా వదిలించుకోవచ్చు.చర్మ సమస్యలు నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అందుకే నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిది. సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు. నోట్: ఇది కేవలం సమాచారంగా మాత్రమే అని గమనించగలరు. బీపీ రోగులు ఉప్పును ఎంత పరిమితంగా వాడితే అంత మంచిది. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
చింత చిగురు పులిహోర.. అద్భుతమైన రుచి
చింతపండుతోపాటు చింత చిగురు లేదా చింతాకు కూడా చాలా వంటకాల్లో ఉపయోగపడుతుంది. చింత చిగురును మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. చింత చిగురు సీజనల్‌గా దొరికే ఆకుకూర లాంటిదనే చెప్పవచ్చు. చింతపండులాగానే ఈ చింత చిగురు రుచిగా పుల్లగా ఉంటుంది. (మటన్‌కు షాకిస్తున్న చింతచిగురు! ఈ ప్రయోజనాలు తెలుసా?)చింతాకు ఎముకల గట్టితనానికి, జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురుతో పప్పు, పచ్చడి, మటన్, చికెన్, చేపలు, రొయ్యలతో కలిపి కూర చేసుకోవచ్చు. వీటిన్నింటిలో ప్రధానమైంది చింతచిగురు పులిహోర.కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు బియ్యంకప్పు సన్నగా తరిగిన లేత చిగురు టేబుల్ స్పూన్లు నూనె 3 - 4 పెద్ద పచ్చిమిర్చి 5, 6 ఎండు మిరపకాయలు కొద్దిగా వేరు శనగపప్పు,లేదంటే జీడిపప్పు పసుపు, ఇంగువ పోపు కోసం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర , ఆవాలు, కరివేపాకు తయారీ: బియ్యాన్ని బాగా కడిగి, మరీమెత్తగా కాకుండా పొడిగా ఉండేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, శెనగపప్పు, జీడిపప్పు, ఎండు మిరపకాయలు వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిసేపువేగనివ్వాలి. కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. వేగిన తరువాత శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసి బాగా కలపాలి. పసుపు, ఉప్పు వేసి మూత పెట్టాలి. (క్రికెట్ గాడ్ సచిన్‌కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా? )సాధారణంగా ఉప్పు వేసిన తరువాత వచ్చే నీరుతో చింత చిగురు ఉడికిపోతుంది. లేదంటే కొద్దిగా నీరు చిలకరించుకుంటే సరిపోతుంది. చిగురు ఉడికి కమ్మటి వాసన వచ్చి, నూనెపైకి తేలేవరకు సన్నని మంటమీద ఉడికించాలి. చివరగా ఉడికిన అన్నంలో, ఈ మిశ్రమం వేసి అన్నం పగలకుండా కలుపుకుంటే కమ్మ కమ్మగా..పుల్లపుల్లగా చింతచిగురుపులిహోర రడీ. -
దాల్చిన చెక్కతో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ నిజంగా తగ్గుతుందా?
సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క. శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి.దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది. నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్‌తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement