-
ఎట్టకేలకు ఓటీటీకి గోపిచంద్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అభిమానులు అంతా భావించారు. గతవారమే ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో భీమా ఓటీటీ కొత్త తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఉగాది సందర్భంగా అఫీషియల్ డేట్‌ను రివీల్ చేసింది. ఈనెల 25 నుంచి భీమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. Surprise surprise! Bringing the action-packed, thrilling entertainer, #Bhimaa to your screens on April 25th!#BhimaaonHotstar@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/9wIjhzLigr — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 9, 2024 -
This Week OTT Releases: అసలే పండుగ సీజన్.. ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. అసలే వేసవి సెలవులు. అంతే కాకుండా వరుసగా ఉగాది, రంజాన్ పండుగలు వస్తున్నాయి. దీంతో సినీ ప్రియులు కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అలాంటి వారి కోసం ఓటీటీలు సైతం రెడీ అయిపోయాయి. ఈ వారం మిమ్మల్ని అలరించేందుకు సరికొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ నటించిన గామి ఈ వారంలోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ప్రేమలు మూవీ సైతం స్ట్రీమింగ్కు సిద్ధమైంది. వీటితో పాటు బాలీవుడ్లో పరిణీతి చోప్రా నటించిన మూవీ అమర్ సింగ్ చమ్కిలా ఓటీటీలో రిలీజ్ కానుంది. అంతే కాకుండా హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు, యానిమేషన్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ స్పిరిట్ రేంజర్స్- సీజన్- 3 (కిడ్స్ యానిమేటెడ్ సిరీస్)- ఏప్రిల్ 08 నీల్ బ్రెన్నాన్: క్రేజీ గుడ్ (స్టాండ్-అప్ కామెడీ స్పెషల్)- ఏప్రిల్ 09 ఆంత్రాసైట్- (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10 ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్ 601 -(కొలంబియా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10 అన్లాక్డ్: ఏ జైల్ ఎక్స్పెరిమెంట్- (డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 10 జెన్నిఫర్ వాట్ డిడ్ - (బ్రిటిష్ రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 10 యాజ్ ది క్రో ఫైల్స్- సీజన్ 3- (టర్కిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11 హార్ట్‌బ్రేక్ హై -సీజన్ 2 (ఆస్ట్రేలియన్ టీన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11 మిడ్ సమ్మర్ నైట్ -సీజన్ 1 -(నార్వే థ్రిల్లర్ సిరీస్)- ఏప్రిల్ 11 అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12 గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్కామ్)- ఏప్రిల్ 12 లవ్ డివైడెడ్ - (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12 స్టోలెన్ - (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12 ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్) జీ5 గామి(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేమలు(మలయాళ వర్షన్)- ఏప్రిల్ 12 అమెజాన్ ప్రైమ్ అన్‌ఫర్‌గాటన్ సీజన్-5(వెబ్ సిరీస్) - ఏప్రిల్ 08 ది ఎక్సార్సిస్ట్: బిలీవర్(హారర్ మూవీ)- ఏప్రిల్ 09 ఫాల్ అవుట్(అమెరికన్ సిరీస్)- ఏప్రిల్ 11 ఎన్డబ్ల్యూఎస్ఎల్(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12 -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్!
మహి వీ రాఘవ్ డైరెక్షన్లో వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్-2. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సిరీస్‌కు ఇండియాలోనే టాప్-3 ప్లేస్ దక్కించుకుంది. ఓటీటీల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన జాబితాలో టాప్-3లో నిలిచింది. ఈ విజయం పట్ల మహి వి రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. ఈ సందర్భంగా మహి వి.రాఘవ్ మాట్లాడుతూ..'సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను మీరంతా ఆదరించి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి విజయాలను సాధిస్తాయని మరోసారి రుజువైంది. కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరింది’’ అని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సేవ్ ది టైగర్ రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతోసీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైయాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్- 3 సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ వాకి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ కోరింది. వారు పంపిన ఆలోచనలు, రచనలు బాగుంటే రచయిత, ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని పేర్కొన్నారు. -
ఓటీటీకి సూపర్ హిట్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ. అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం కేవలం మలయాళంలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటనైతే రాలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో ప్రేమలు థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 15 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఇక రాబోయే రెండు నెలల్లో విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. ఈ హాలీడేస్‌లో ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేది ఒక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ముఖ్యంగా సినీ ప్రియుల కోసం ఈ వారంలో అలరించేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ వారం థియేటర్లలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ చిత్రం మాయవన్ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్లో ప్రాజెక్ట్-జెడ్ పేరుతో రిలీజవుతోంది. వీటితో పాటు భరతనాట్యం, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బహుముఖం లాంటి చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అయితే ఈ వారంలో ఓటీటీలోనూ సందడి చేసేందుకు పలు చిత్రాలు వచ్చేస్తున్నాయి. గోపీచంద్ నటించిన భీమా, టాలీవుడ్ భామ దివి చిత్రం లంబసింగి, హనుమాన్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. దీంతో పాటు బాలీవుడ్ మూవీ ఫర్రీ ఓటీటీకి వచ్చేస్తోంది. అంతే కాకుండా పలు వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ టుగెదర్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 02 ఫైల్స్ ఆప్ ది ఆన్ఎక్స్ప్లెయిన్డ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03 రిప్ లే(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 04 పారాసైట్- ది గ్రే(కొరియన్ సిరీస్)- ఏప్రిల్ 05 స్కూప్- హాలీవుడ్ సినిమా- ఏప్రిల్ 025 అమెజాన్ ప్రైమ్ మ్యూజికా(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 04 యే మేరీ ఫ్యామిలీ(వెబ్ సిరీస్)- సీజన్ 3- ఏప్రిల్ 04 హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్- (హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లంబసింగి- (తెలుగు సినిమా)- ఏప్రిల్ 02 భీమా (టాలీవుడ్ చిత్రం) ఏప్రిల్ 5 హనుమాన్(తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05 జీ5 ఫర్రీ- (బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 05 యాపిల్ టీవీ ప్లస్ లూట్ సీజన్- 2(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03 సుగర్(హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05 సోనీలివ్ ఫ్యామిలీ ఆజ్ కల్(హిందీ సినిమా)- ఏప్రిల్ 03
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్‌తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
Advertisement