-
మీ అమూల్యమైన ఓటుతో ఆయన్ను గెలిపించండి: దిల్ రాజు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియతో పాటుగా ఎన్నికల ప్రచారం కూడా పీక్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా నటులు విశాల్, భాను చందర్, కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు వంటి స్టార్స్ అందరూ వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలుపుతూ మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగుతారని చెప్పారు. ఏపీలో సీఎం జగన్ చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ వారందరు కూడా పలు వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్ దిగ్గజ నిర్మాతగా కొనసాగుతున్న 'దిల్ రాజు' తాజాగా ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా ఎన్నికలో బరిలో ఉన్న తన మిత్రుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డిని గెలిపించాలని కోరుతూ దిల్ రాజు ఇలా చెప్పుకొచ్చారు. 'బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్నో మంచి పనులు ఒంగోలు కోసం చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ గారి కేబినెట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేతృత్వంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఇప్పటి వరకు ఐదుసార్లు ఒంగోలు నుంచి బాలినేని గెలిచారు. అనేక అభివృద్ధి పనులతో ఒంగోలు పట్టణాన్ని ముందంజలో ఉంచారు.ఇప్పుడు ఆరోసారి ఒంగోలు నుంచి ఎన్నికల బరిలో బాలినేని ఉన్నారు. ఆయన్ను తప్పకుండా అక్కడి ప్రజలు గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. కొద్దిరోజుల క్రితం బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారి మీద ఒక డాక్యుమెంటరీని తీశాను. అందులో ఆయన రాజకీయ ప్రస్థానంతో పాటు ఒంగోలు కోసం ఆయన ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరూ తెలుసుకోవచ్చు. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ నందు అందుబాటులో ఉంది. మీ అమూల్యమైన ఓటు బాలినేని శ్రీనివాసులుకు వేస్తారని ప్రార్థిస్తున్నాను. అని ఆయన కోరారు. దిల్ రాజు మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. Ace Producer #DilRaju Supports YCP ongole Mla Candidate #BalineniSrinivasReddy pic.twitter.com/d6mtAKZxHH— cinee worldd (@Cinee_Worldd) April 24, 2024 -
పవన్ బాక్ మనీ దందా.. ఐటీకి దిల్ రాజు ఫిర్యాదు
-
MM Keeravani: డ్యాన్స్ చేశాం
‘‘లవ్ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్‌గారు. ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్‌గారితో ఫైట్ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్ ఈవెంట్స్‌ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్ పీసీ శ్రీరామ్ తదితరులు ΄ాల్గొన్నారు. -
'లవ్ మీ' మూవీ ఆడియో వేడుక (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. థియేటర్లు ఫుల్!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. ఉగాది, రంజాన్ పండుగలు వెంటవెంటనే రావడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఇవాళ ఉగాది సందర్భంగా ఏపీ, తెలంగాణలోని థియేటర్స్, మల్టీప్లెక్సుల వద్ద హౌస్ ఫుల్ బోర్డులే దర్శమిస్తున్నాయి. వరుసగా సెలవులు రావడంతో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద రద్దీ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లోనూ ఫ్యామిలీ స్టార్‌కు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది. సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం కాగా.. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత స్వయంగా థియేటర్లకు వెళ్లి ఆడియన్స్ నుంచి రివ్యూ తీసుకున్నారు. నెగెటివ్ రివ్యూలపై ఆయన మండిపడ్డారు. ఇలా చేయడం ఇండస్ట్రీకి మంచిది కాదని అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement