-
‘అతడు 70 శాతం ఇండియన్.. 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్’
‘‘నేను కలిసిన అత్యంత నిస్వార్థమైన వ్యక్తుల్లో అతడూ ఒకడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అతడు సమయం కేటాయించగలడు. సాయం చేయడానికి 24/7 అందుబాటులోనే ఉంటాడు.ఎక్కడి హోటల్‌కు వెళ్లినా నా గదికి రెండు గదుల అవతల అతడు ఉంటాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్లవచ్చు. ప్రతి రోజూ ఉదయం అక్కడే నేను కాఫీ తాగుతాను కూడా!ఇండియన్ అనడం బెటర్నిజం చెప్పాలంటే అతడు ఆస్ట్రేలియన్ అనడం కంటే ఇండియన్ అనడం బెటర్. అతడికి కూడా ఇదే మాట చెబుతూ ఉంటా. నా దృష్టిలో అతడు 70 శాతం ఇండియన్.కేవలం 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్‌గా ఉంటాడు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం, ఆసీస్ స్టార్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ సహచర ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై ప్రశంసలు కురిపించాడు.తనకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే వార్నర్ దగ్గరికి వెళ్లి అడిగేంత చొరవ ఉందని తెలిపాడు. సీనియర్ అన్న పొగరు ఏమాత్రం చూపించడని.. అందరితోనూ సరదాగా ఉంటాడని మెగర్క్ చెప్పుకొచ్చాడు.హైదరాబాదీలతో బంధంకాగా ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ద్వారా భారతీయులకు చేరువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన సమయంలో హైదరాబాదీలతో బంధం పెనవేసుకున్నాడు.టాలీవుడ్ స్టార్ హీరోల తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వార్నర్ భాయ్.. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్లోనూ నటించి మెప్పించాడు.ఈ నేపథ్యంలో మెగర్క్ వార్నర్ గురించి డీసీ(ఢిల్లీ క్యాపిటల్స్) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీకి ఆడుతున్న సౌతాఫ్రికా స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం వార్నర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. అతడితో కలిసి గోల్ఫ్ ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2024లో ఇలాకాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. మరోవైపు.. ఈ సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్-మెగర్క్ 6 ఇన్నింగ్స్‌లో కలిపి 259 పరుగులు చేశాడు.ఇక ట్రిస్టన్ స్టబ్స్ 10 ఇన్నింగ్స్ ఆడి 277 రన్స్ చేయగా.. డేవిడ్ వార్నర్ కేవలం 7 మ్యాచ్‌లలో భాగమై 167 పరుగులు చేయగలిగాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వార్నర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. -
DC Vs KKR: రిషభ్ పంత్‌దే తప్పు.. అతడి వల్లే ఓటమి!
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీరును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తప్పుబట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి అనంతరం అతడు చేసిన వ్యాఖ్యలను విమర్శించాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై పరుగులు రాబట్టడంలో విఫలమైన తరుణంలో పంత్ తన నిర్ణయాన్ని సమర్థించుకోవడం ఏమీ బాలేదన్నాడు.పవర్‌ప్లే ముగిసేసరికిఐపీఎల్-2024లో సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ కేకేఆర్‌ను ఢీకొట్టింది. టాస్ గెలిచిన పంత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో మొదలు పెట్టినా... పృథ్వీ షా (13) ఎక్కువసేపు నిలవలేదు.స్టార్క్ తర్వాతి ఓవర్లోనే వరుసగా 6, 4 కొట్టిన జేక్ ఫ్రేజర్ (12) తర్వాతి బంతికి వెనుదిరగడంతో ఢిల్లీకి ఆశించిన ఆరంభం లభించలేదు. షై హోప్ (6) విఫలం కాగా... హర్షిత్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అభిషేక్ పొరేల్ (18) కూడా జోరు కొనసాగించలేకపోయాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 67 పరుగులకు చేరింది.కెప్టెన్ రిషభ్ పంత్ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తనదైన శైలిలో ఆడలేకపోవడంతో క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. 18 పరుగుల వద్ద తాను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హర్షిత్ వదిలేయడంతో బతికిపోయిన పంత్ దానిని వాడుకోలేకపోయాడు.కుల్దీప్ చక్కటి షాట్లుఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, స్టబ్స్ (4), అక్షర్ (15) వెనుదిరగ్గా... 101/7 వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది. అయితే కుల్దీప్ కొన్ని చక్కటి షాట్ల(26 బంతుల్లో 35)తో చివరి వరకు నిలబడటంతో క్యాపిటల్స్ 150 పరుగులు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీని మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సారథి పంత్ మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం మంచి ఆప్షనే. కాకపోతే మా బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.రిషభ్ పంత్‌దే తప్పు.. అతడి వల్లే ఓటమి!ఇక్కడ 180 -210 పరుగులు స్కోరు చేయవచ్చు. కాకపోతే ఈరోజు మాత్రం కాస్త పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని పేర్కొన్నాడు.ఈ మేరకు పంత్ చేసిన వ్యాఖ్యలపై మైకేల్ క్లార్క్ స్పందిస్తూ.. ‘‘ఓటమి తర్వాత పంత్ మాట్లాడిన తీరుతో నేను ఏకీభవించను. ఒకవేళ గెలిచి ఉంటే ఆ నిర్ణయం(టాస్) సరైందిగా ఉండేది.ఓడిపోయారు కాబట్టి తప్పును అంగీకరించాల్సిందే. ఇలాంటి పిచ్‌పై పంత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని కచ్చితంగా తప్పు చేశాడనే నా అభిప్రాయం. వాళ్లు కేవలం పది పరుగులు కాదు.. తక్కువలో తక్కువ యాభై పరుగులు వెనుకబడి ఉన్నారు.ఎందుకంటే లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఇంకా 3.3 ఓవర్లు మిగిలే ఉన్నాయన్న విషయం మరవొద్దు. చేతిలో ఏడు వికెట్లు కూడా ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ కనీసం 200 పరుగులు చేయాల్సింది’’ అని అభిప్రాయపడ్డాడు. A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
చరిత్ర సృష్టించిన సాల్ట్.. గంగూలీ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పరుగుల వరద పారించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడిన చోట.. సాల్ట్ 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో ఏకంగా 68 పరుగులు రాబట్టాడు. తద్వారా ఢిల్లీ విధించిన 154 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేకేఆర్ 16.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.ఇక తన అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును సాల్ట్ బద్దలు కొట్టాడు. ఢిల్లీ డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ ముందే సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు1. ఫిలిప్ సాల్ట్- ఆరు ఇన్నింగ్స్‌లో 344 రన్స్- 20242. సౌరవ్ గంగూలీ- ఏడు ఇన్నింగ్స్‌లో 331 రన్స్- 20103. ఆండ్రీ రసెల్- ఏడు ఇన్నింగ్స్‌లో 311 రన్స్- 20194. క్రిస్ లిన్- తొమ్మిది ఇన్నింగ్స్‌లో 303 రన్స్- 2018.కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లువేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా, సోమవారంటాస్: ఢిల్లీ.. బ్యాటింగ్ఢిల్లీ స్కోరు: 153/9 (20)కేకేఆర్ స్కోరు: 157/3 (16.3)ఫలితం: ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(కేకేఆర్)- 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.టాప్ స్కోరర్ ఆఫ్ ది మ్యాచ్: ఫిలిప్ సాల్ట్(68).A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
ఐపీఎల్-2024 : ఢిల్లీపై కోల్‌కతా అద్భుత విజయం (ఫొటోలు)
-
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్
సొంత మైదానంలో మూడు రోజుల క్రితం 261 పరుగులు చేసి కూడా ఓడి షాక్‌కు గురైన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తర్వాతి మ్యాచ్‌లోనే తేరుకుంది. అదే ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈసారి చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యరి్థపై పైచేయి సాధించింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన కేకేఆర్ ఆ తర్వాత పెద్దగా శ్రమ లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరోవైపు ఢిల్లీ గడ్డపై గత రెండు మ్యాచ్‌లు గెలిచి మళ్లీ దారిలో పడినట్లు కనిపించిన క్యాపిటల్స్ పేలవ బ్యాటింగ్‌తో తమ ఓటమికి బాట వేసుకుంది. కోల్‌కతా: పరుగుల వరద పారుతున్న ఐపీఎల్లో మరో చిన్న విరామం. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు స్వల్ప స్కోరుకే ఆట ముగించగా... ప్రత్యర్థి సులువుగానే లక్ష్యం చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (26 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. కోల్‌కతా లెగ్ స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశాడు. అనంతరం కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 68; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 57 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు. ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్ కుల్దీప్ యాదవ్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారుభారీ భాగస్వామ్యం... ఛేదనలో తొలి బంతి నుంచే సాల్ట్ దూకుడు మొదలైంది. లిజాడ్ వేసిన మొదటి ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, సిక్స్ బాదగా మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆపై 15 పరుగుల వద్ద సాల్ట్ ఇచి్చన క్యాచ్‌ను లిజాడ్ వదిలేశాడు. ఖలీల్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ బాదిన సాల్ట్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లలో కేకేఆర్ 79పరుగులు సాధించింది. అయితే అక్షర్ తన తొలి రెండు ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేయగా, రింకూ సింగ్ (11) విఫలమయ్యాడు. అయితే ‘అయ్యర్’ ద్వయం ఇబ్బంది లేకుండా ఆడి మరో 21 బంతులు మిగిలి ఉండగానే గెలిపించింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) సాల్ట్ (బి) అరోరా 13; జేక్ ఫ్రేజర్ (సి) వెంకటేశ్ (బి) స్టార్క్ 12; పొరేల్ (బి) హర్షిత్ 18; హోప్ (బి) అరోరా 6; పంత్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 27; అక్షర్ (బి) నరైన్ 15; స్టబ్స్ (సి) సాల్ట్ (బి) వరుణ్ 4; కుశాగ్ర (సి) సాల్ట్ (బి) వరుణ్ 1; కుల్దీప్ (నాటౌట్) 35; సలామ్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 8; లిజాడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–17, 2–30, 3–37, 4–68, 5–93, 6–99, 7–101, 8–111, 9–140. బౌలింగ్: స్టార్క్ 3–0–43–1, అరోరా 4–0–29–2, హర్షిత్ 4–0–28–2, నరైన్ 4–0–24–1, వరుణ్ చక్రవర్తి 4–0–16–3, రసెల్ 1–0–10–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అక్షర్ 68; నరైన్ (సి) ఫ్రేజర్ (బి) అక్షర్ 15; రింకూ (సి) కుల్దీప్ (బి) లిజాడ్ 11; శ్రేయస్ (నాటౌట్) 33; వెంకటేశ్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–79, 2–96, 3–100. బౌలింగ్: లిజాడ్ 3–0–38–1, ఖలీల్ అహ్మద్ 3–0–28–0, సలామ్ 2.3–0–30–0, అక్షర్ పటేల్ 4–0–25–2, కుల్దీప్ 4–0–34–0. .
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement