-
కన్నప్పకి బై బై
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్లో అక్షయ్ కుమార్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్‌ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్ కుమార్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్. -
జాలీ రైడ్
బాలీవుడ్ హిట్ మూవీ ఫ్రాంచైజీలో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘జాలీ ఎల్ఎల్బీ’, ‘జాలీ ఎల్ఎల్బీ 2’ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి థర్డ్ పార్ట్ ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమా రానుంది. ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీలోని తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన సుభాష్ కపూరే మూడో భాగాన్నీ తెరకెక్కిస్తున్నారు.అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో సౌరభ్ శుక్లా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ‘‘ఒరిజినల్ ఎవరో, డూప్లికేట్ ఎవరో తెలియడం లేదు. కానీ ఈ సినిమా మాత్రం ఓ జాలీ రైడ్‌గా ఉండబోతోంది’’ అంటూ ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమా షూటింగ్లో తాను పాల్గొంటున్నట్లుగా వీడియోను షేర్ చేశారు అక్షయ్ కుమార్. నకిలీ లాయర్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. -
కన్నప్పలో అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు టైటిల్ రోల్లో రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా మోహన్‌బాబు, విష్ణు మంచు కలిసి అక్షయ్‌కి స్వాగతం పలికారు. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. అక్షయ్‌తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. -
రూ. 350 కోట్ల సినిమా.. 1+1 ఆఫర్ ఇచ్చినా చూసేవాళ్లు లేరు
బాలీవుడ్లో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరు కలిసి నటించిన చిత్రం 'బడేమియా ఛోటేమియా'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి నాలుగు రోజులకు గాను రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్లో రూ.100 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది. ఈ చిత్రాన్ని పూజ ఎంటర్టైన్మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వశు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.400 కోట్లు అందుకుంటుందని అంచనా వేసి సినిమా విడుదల చేస్తే.. భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతుంది. ఓ మై గాడ్ 2 తర్వాత అక్షయ్ కుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆపై ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు నటించడంతో మొదటిరోజు కలెక్షన్స్ కాస్త మెరుగ్గానే వచ్చాయి. ఆ తర్వాత సినిమా బాగాలేదని టాక్ రావడంతో రెండో రోజే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఆదివారం నాడు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను ప్రకటించేశారు. ఈ నిర్ణయంతో ఆదివారం బుకింగ్స్ కాస్త పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆఫర్లు ప్రకటించినా కూడా రూ. 350 కోట్లు పెట్టిన సినిమాకు నాలుగురోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ దాటకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు.. డైట్ సీక్రెట్స్ ఇవే..
బాలీవుడ్ టీవీ నటుడు, ప్రముఖ కమిడియన్, ప్రోడ్యూసర్, సింగర్ అయిన కపిల్ శర్మ సెటబ్రిటీలతో చేసిన 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోతో మంచి పేరు సంపాదించికున్నాడు. ఇటీవల ఆ షో ఫస్ట్ ఎపిసోడ్ నెట్పిక్స్లో విడుదల అయ్యింది అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ షోలో సెలబ్రిటీలు రణబీర్ కపూర్, నీతూ కపూర్ మరియు రిద్ధిమా కపూర్ సహానితో షేర్ చేసుకున్న ఆసక్తికర విషయాల తోపాటు హాస్యంతో కూడిన చిందులు అన్నింటిని ప్రేక్షక్షులు అలరించాయి. ఆ ఐదు షోల్లో ప్రముఖ సెలబ్రిటీలు ఫాలో అయ్యే డైట్ సీక్రెట్స్ కూడా కపిల్ వెల్లడించడం జరిగింది. స్రీన్‌పై మంచి అందంతో, పిట్‌నెస్‌తో కనిపించే హీరో/హీరోయిన్ల బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలన్న కుతుహలం అందరికీ ఉంటుంది. అది కపిల్ శర్మ షో ద్వారా ప్రేక్షకులు తెలుసకునే అరుదైన అవకాశం లభించింది. అవేంటీ, ఎవరెవరు? ఎలాంటి డైట్స్ ఫాలో అవుతారో సవివరంగా చూద్దామా..! జాన్ అబ్రహం బాలీవుడ్ నటుడు, మోడల్, నిర్మాత అయిన జాన్అబ్రహం ఫిజిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆరడుగుల ఆజానుబాహుడు అంటే అతడేనేమో అన్నట్లు ఉంటుంది అతడి ఆహార్యం. చక్కటి బాడీని మెయింటెయిన్ చేస్తూ మంచి ఫిట్నెస్తో కనిపిస్తాడు. 2021లో తన మూవీ 'సత్యమేవ జయతే2' ప్రమోషన్ సందర్భంగా కపిల్ శర్మ షోకి వచ్చినప్పుడూ తన ఫిట్నెస్ సీక్రెట్స్‌ని పంచుకున్నాడు. మంచి బాడీ మెయింటెయిన్ చేయాలంటే మంచి ఆహారం అనేది చాలా ముఖ్యం అని చెప్పాడు. అలాగే ఆహారంపై నియంత్రణ ఉండాలని అన్నారు. ప్రోటీన్ కోసం నాన్‌వెజ్ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. చాలామంది శాకాహారంతో ప్రోటీన్లు అందుతాయని చెబుతారు గానీ అందులో నిజం లేదని జాన్ చెప్పడం జరిగింది. ఇక్కడ జాన్ కండల దేహ సౌష్టవాన్ని చూస్తే.. పోషకాల తోకూడిన ఆహారం తినాల్సిందేనని స్పష్టమవుతుంది. అక్షయ్ కుమార్ ఇక అక్షయ్ కుమార్ తన 'హౌస్‌ఫుల్ 3' చిత్రం ప్రమోట్ చేసేందుకు కపిల్ శర్మ షోకి రావడం జరిగింది. ఆ షోలో ఆ మూవీ నటులంతా రావడం జరిగింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఆ షోలో అక్షయ్ కుమార్ ఫాలో అయ్యే స్ట్రీట్ డైట్ గురించి వెల్లడించారు. "తాను రితేష్ చక్కగా వ్యాయామం చేసి అలసిపోయి ఉన్నాం. అందువల్ల చాలా ఆకలిగా అనిపించి బటర్ చికెన్ తినాలని అనుకున్నాం. అయితే ఆ టైంలో అక్షయ్ వారికి ఉడకబెట్టిన క్యారెట్లు, బచ్చలి కూర ఇచ్చాడని, కనీసం అన్నం గానీ రోటీ గానీ లేదు. ఇంత స్ట్రీట్‌గా డైట్ ఫాలో అవుతాడని,అందువల్లే అక్షయ్ ఇప్పటికీ యంగ్ లుక్‌లోనే కనిపస్తాడని". అమితాబ్ అన్నారు. కేక్ అంటే చాలా ఇష్టం: కత్రినా కైఫ్.. కపిల్ శర్మ షోకి సంబంధించి ఒక ఎపిసోడ్లో కత్రినా తన డైట్ గురించి మాట్లాడింది. "నిజంగా ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు కేక్‌లంటే మహా ఇష్టం కానీ దాన్ని తింటే జిమ్‌లో ఎక్కువసేపు గడపక తప్పదు. అందుకని ప్రతి ఆదివారం మనం కలుసుకుందామని కేక్‌తో సర్ది చెప్పుకుని నోటిని కంట్రోల్ చేసేందుకు కష్టపడతానని అంటోంది." కత్రినా. ఇక్కడ సెలబ్రిటీలు కూడా మనలానే ఒక్కోసారి ఫుడ్ స్కిప్ చేస్తారు. ఐతే తినాలనుకుంటే మాత్రం కంట్రోల్గానో లేక ఏదో ఒక రోజు కేటాయించుకుని పరిమితంగా తిని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. గులాబ్ జామూన్లు, సమోసాలు తినాల్సిందే: రాజ్‌కుమార్ రావ్ కపిల్ శర్మ షో 2020లో రాజ్‌కుమార్ రావ్ సందడి చేశారు. అయితే రాజ్ కుమార్ తనకు తినడమంటే ఇష్టమని చెప్పాడు. ఐతే రాజ్ ఫిటనెస్ చూస్తే.. ఆయన చెబుతుంది నమ్మశక్యంగా లేదని కపిల్ ఆ షోలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో తన డైట్ గరించి క్లియర్‌గా చెప్పారు. "తనకు గులాబ్ జామూన్లు, సమోసాలంటే ఎంతో ఇష్టమో ఎలా తినేసేవాడో చెప్పారు. టీనేజ్‌లో ఉండగా వర్కౌట్స్ అయ్యాక తిన్నగా స్వీట్ షాక్కివెళ్లి ఏకంగా ఆరు గులాబ్ జామూన్లు, రెండు సమోసాలు తినాల్సిందే. అయితే సినీ పరిశ్రమలో ప్రవేశించాక డైట్ మీద దృష్టికేంద్రీకరించడంతో అలా తినడం మానేశానని, స్వీట్ తినాలనుకుంటే మాత్రం లిమిట్‌గా తింటానని అన్నారు." ఆదిత్య రాయ్: అరకేజీ ఐస్‌క్రీమ్ ఉండాల్సిందే.. ఇక ఆదిత్య రాయ్ మృణాల్ ఠాకూర్‌తో కలిసి కపిల్ శర్మ షోకి వచ్చి డైట్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. తాను రాత్రిపూట ఏకంగా అరకేజీ ఐసీక్రీం తినేవాడినని అన్నారు. చాల సమయం డైట్‌లోనే ఉంటాను కాబట్టి సడెన్‌గా నాలోపల ఉన్నవాడికి తినాలనే కోరిక మొదలవ్వగానే వెంటనే వెళ్లి ఏదో ఒకటి రెండు ఐస్‌క్రీమ్‌లు కాదు ఏకంగా 1/2 కేజీ ఐస్‌క్రీం లాగించేస్తాను. ఆ తర్వాత రోజు పూర్తిగా డైట్లో ఉండి, కసరత్తు చేస్తుంటానని అన్నారు. బరువు తగ్గే యత్నంలో ఉన్నప్పుడూ రోజుకి 1700 కేలరీలు ఉండే పిండి పదార్థాలు, కొవ్వు తక్కువుగా ఉన్నా ఆహారం, అలాగే 15 నుంచి 20 నిమిషాలు కార్డియో సెషన్లు చేయండి చాలు. మంచి ఫిట్నెస్గా ఉంటారు. ఇలా చేసే క్రమంలో ఒక్కోసారి డైట్ స్కిప్ అవుతుంది. అంతమాత్రాన వదిలేయకుండా మరసటి రోజు నార్మల్‌గా డైట్ ఫాలో అయిపోవాలంతే అన్నారు ఆదిత్య రాయ్. ఈ సెలబ్రిటీల డైట్ సీక్రెట్స్ అన్ని చూశాక కచ్చితంగా ఎవ్వరైనా అంతలా నోరు కట్టేసుకుని ఉండటం ఈజీ కాదు. అలా అని నోరు కట్టేసుకుని ఇబ్బంది పడక.. తినాలనిపించిన ఐటెమ్స్ హాయిగా తినేసి కాస్త వర్కౌట్ డోస్ పెంచడం తోపాటు డైట్లో కేలరీల తక్కువగా ఉన్నవి తీసుకుంటే చాలు. ఒక్కరోజుని డైట్‌ని స్కిప్ చేసినంత మాత్రన పూర్తిగా వదిలేయకూడదన్నది క్లియర్‌గా అర్థమవుతుంది. సో..! మీరు కూడా మీ వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సాయంతో మంచి ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అవ్వండి, మంచి ఫిట్ నెస్‌తో బరువుని అదుపులో ఉంచుకోండి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement