-
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
News about Hardeep Singh Nijjar, murder and S Jaishankarభారత్‌లోని అఫ్గనిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై వ్యక్తిగత దాడులు, నిరంతర పరువునష్టం తన రాజీనామాకు కారణమని ఆమె పేర్కొన్నారు. మహిళా ప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని తనపై దాడులు జరిగాయని వార్దక్ అన్నారు.ముంబైలో ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్‌గా ఉండటంతో పాటు న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక రాయబారి బాధ్యతలను కూడా జకియా వార్దక్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె ముంబై విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు రూ 18 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి భారత్‌కు తన వస్త్రాల్లో తరలించారని, ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. ముంబయిలో ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జకియా వార్ధక్ శనివారం తెలిపారు.కాగా వార్ధక్ బంగారాన్నిఅక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబయికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్‌పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెును తనిఖీలు చేయలేదు. అయితే, ఎయిర్‌పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తొలుత స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ఆమె వాటిని తోసిపుచ్చారు. అనంతరం ఆమెను గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా... ఆమె దుస్తుల్లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలను ఆమె సమర్పించకపోవడంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్టు చేస్తారు. అయితే వార్ధక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదు.News about Hardeep Singh Nijjar, murder and S Jaishanka -
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. అఫ్గాన్ రాయబారి జకియా రాజీనామా
న్యూఢిల్లీ: రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమ రవాణా చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన అఫ్గానిస్తాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తొలుత ముంబైలో అఫ్గాన్ కాన్సూల్ జనరల్‌గా రెండేళ్లు పనిచేశారు. గత ఏడాది ఇండియాలో అఫ్గాన్ రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. గత నెల 25వ తేదీన ముంబై ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు జకియా వార్దక్ నుంచి 25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆమె బంగారాన్ని దుబాయి నుంచి చట్టవిరుద్ధంగా తరలిస్తూ దొరికిపోయినట్లు వార్తలొచ్చాయి. దౌత్యవేత్త కావడంతో ఈ కేసులో అరెస్టు కాకుండా ఆమె మినహాయింపు పొందారు. అయితే, తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జకియా వార్దక్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తనపై వ్యక్తిగతంగా విమర్శల దాడి జరుగుతోందని, దీనివల్ల విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. -
Afghanistan T20 WC Squad: టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇదే.. కెప్టెన్‌గా స్పిన్ మాంత్రికుడు
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. 19 ఏళ్ల యువ వికెట్‌కీపింగ్ బ్యాటర్ మొహమ్మద్ ఇషాక్, 20 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నంగ్యాల్ ఖరోటిలకు వరల్డ్‌కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది. గత వరల్డ్‌కప్‌లో ఆడని కరీం జనత్, నూర్ అహ్మద్‌లకు ఈసారి అవకాశం దక్కింది. ఆఫ్ఘన్ల ప్రధాన బలమైన స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్‌తో పాటు మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ ఉన్నారు. పేసర్ల విభాగంలో నవీన్ ఉల్ హాక్, ఫరీద్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యారు. వికెట్కీపర్ల కోటాలో రహ్మానుల్లా గుర్భాజ్ జట్టులోకి రాగా.. స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్ ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్ల కోటాలో కరీం జనత్, గుల్బదిన్ నైబ్, హజ్రతుల్లా ఒమర్జాయ్ వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చారు. సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం జూన్ 3న మొదలవుతుంది. ఆ రోజు గయానా వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు ఉగాండతో తలపడతారు. జూన్ 7న ఇదే వేదికపై వీరు పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఢీకొంటారు. గ్రూప్-సిలో ఆఫ్ఘనిస్తాన్.. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఉగాండ, పపువా న్యూ గినియా జట్లతో పోటీపడుతుంది. టీ20 వరల్డ్‌కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్ (వికెట్‌కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హాక్, ఫజల్హాక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్ట్రావెలింగ్ రిజర్వ్స్: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ -
దయనీయ స్థితిలో ఆఫ్గన్ శరణార్థులు
పొరుగుదేశం పాకిస్తాన్లో ఆఫ్గన్ శరణార్థులు దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లబుచ్చుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకూ సుమారు ఆరు లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను పాకిస్తాన్ వారి స్వస్థలాలకు బలవంతంగా తిరిగి పంపింది. అయితే ఇప్పటికీ పాక్‌లో కనీసం 10 లక్షల మంది ఆఫ్గన్ శరణార్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.బహిష్కరణ భయంతో ఆఫ్గన్ శరణార్థులు అజ్ఞాతంలో జీవిస్తున్నారు. పాకిస్తాన్లో తల దాచుకుంటున్న వీరు తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. తలదాచుకున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. దీంతో వీరికి జీవనోపాధి, అద్దె ఇల్లు, నిత్యావసరాల కొనుగోలు మొదలైనవి ఎంతో కష్టతరంగా మారాయి.తాజాగా కరాచీ పోలీసులు 18 ఏళ్ల ఆఫ్గన్ యువకుడి నుంచి నగదు, ఫోన్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని డిపోర్టేషన్ సెంటర్‌కు పంపారు. అక్కడి నుంచి ఆ యువకుడిని ఆఫ్ఘనిస్థాన్‌కు తరలించారు. కాగా అతని తల్లిదండ్రులు 50 ఏళ్ల క్రితం ఆఫ్గనిస్తాన్ వదిలి పాక్ తరలివచ్చారు.ఆ యువకుడు ఇంతవరకూ ఎప్పుడూ ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లలేదు. అతనిని ఆఫ్గనిస్తాన్ తరలించినప్పుడు అతని దగ్గర కట్టుబట్టలు తప్ప మరేమీ లేవని స్థానికులు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్‌లో యుద్ధ పరిస్థితుల మధ్య 17 లక్షల మంది పాకిస్తాన్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. ఇలా చట్టపరమైన అనుమతులు లేకుండా వచ్చినవారిని తిరిగి ఆ దేశానికి పంపేందుకు పాక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. -
IPL 2024: కండల వీరుడిని ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ నుంచి అర్దంతరంగా వైదొలిగిన మిచెల్ మార్ష్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్, కండల వీరుడు గుల్బదిన్ నైబ్‌ను ఎంపిక చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నైబ్‌ను డీసీ మేనేజ్మెంట్ 50 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. త్వరలో నైబ్ జట్టుతో చేరతాడని డీసీ ఓ ప్రకటనలో తెలిపింది. నైబ్కు ఇది తొలి ఐపీఎల్.ఆఫ్ఘనిస్తాన్ తరఫున 82 వన్డేలు, 62 టీ20లు ఆడిన నైబ్.. రెండు ఫార్మాట్లలో కలిపి 99 వికెట్లు పడగొట్టి, 2038 పరుగులు చేశాడు. నైబ్ ఖాతాలో ఓ ఐదు వికెట్ల ఘనత, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 33 ఏళ్ల నైబ్ 2019లో ఆఫ్ఘన్ వన్డే జట్టుకు సారధిగా కూడా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరిలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నైబ్ విశేషంగా రాణించాడు. ఈ సిరీస్‌లో బంతితో పర్వాలేదనిపించిన నైబ్.. బ్యాటింగ్‌లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.మార్ష్ విషయానికొస్తే.. ఈ ఐపీఎల్ సీజన్లో మార్ష్ తొలి నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత అతను గాయపడటంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ సీజన్లో మార్ష్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. డీసీ యాజమాన్యం మార్ష్‌ను ఈ ఏడాది వేలంలో 6.5 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.ఢిల్లీ విషయానికొస్తే.. సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు..ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ఇందులో తప్పక గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఢిల్లీ ఏప్రిల్ 27న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 26) కేకేఆర్, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement