-
ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
తల్లాహస్సీ: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు. అయితే ఈ యాత్ర ఆగిపోయింది. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే తిరిగి యాత్ర ఎప్పుడు ఉంటుందనేదానిపై నాసా స్పష్టత ఇవ్వలేదు.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ Starliner వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ఈ వ్యోమనౌక అట్లాస్-V రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. Today's #Starliner launch is scrubbed as teams evaluate an oxygen relief valve on the Centaur Stage on the Atlas V. Our astronauts have exited Starliner and will return to crew quarters. For updates, watch our live coverage: https://t.co/plfuHQtv4l— NASA (@NASA) May 7, 2024అయితే 90 నిమిషాల ముందర రాకెట్లో సమస్యతో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో సునీత.. మిషన్ పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా వెళ్లాల్సి ఉంది.మిషన్ ప్రకారం.. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వారం పాటు బసచేస్తారు. వాస్తవానికి స్టార్‌లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.ప్రస్తుతం ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఈ తరహా సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి.అందుకే ఒకింత ఆత్రుత.: సునీతతాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఐఎస్ఎస్కు వెళ్తుంటే.. సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది. స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల ఒకింత ఆత్రుతగా ఉంది. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదు. రోదసిలో సమోసాను ఆస్వాదించడమంటే ఇష్టం. నేను ఆధ్యాత్మికవాదిని. గణేశుడు నా అదృష్ట దైవం. అందువల్ల గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళతాను’’ అని ఆమె పేర్కొన్నారు. సునీత ఒక మారథాన్ రన్నర్. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. -
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక పేరు ( Name ) పెట్టడం సహజం. అవి వాళ్ళు పూజించే కులదైవం, పూర్వీకులు, ప్రముఖులు ఎవరివైనా కావచ్చు. ఇవి చాలవన్నట్లు వారి రంగు రూపు రేఖా విలాసాలను బట్టి ఏదో ఒకటి జత చేసి పిలుస్తుంటారు. ఒక ఊరిలో ఎల్లయ్య, మల్లయ్య, రామయ్య, సోమయ్యలు ఎందరో ఉండొచ్చు. వాళ్ళను గుర్తు పట్టడానికి ఉపయోగపడేవి ఇంటిపేర్లు ( Surnames ). ఇవి సాధారణంగా వాళ్ళ వాళ్ళ వంశాన్ని, వృత్తిని బట్టి, నివసించే పరిసరాలు, వలస వచ్చిన ప్రాంతాలను బట్టి రకరకాలుగా వస్తుంటాయి, మన దేశంలోనే కాదు బయట కూడా. తెలుగు వారికి ఇంటిపేరు ముందు అసలు పేరు తర్వాత వస్తుంది. ఉత్తరాది ఇందుకు భిన్నం. ఐతే అమెరికా వంటి దేశాల్లో కూడా ఇదే తీరుమనలానే పేర్లు వెనుక వృత్తులు..అమెరికా వంటి బయటి దేశాలకు వెళ్ళాక మనవాళ్ళు కూడా అదే అనుసరిస్తున్నారు. ఇండియాలో ఉన్నప్పుడు ముందు ఇంటి పేరు ఉంటుంది, అమెరికాకు వెళ్లగానే మన వాళ్లు ఇంటి పేరును వెనక్కి నెట్టేస్తారు. నేను అమెరికా వెళ్లిన ప్రతిసారి అక్కడి వారి పేర్లు, ఇంటిపేర్ల సమాచారం మా పిల్లలు, కుటుంబ మిత్రులను అడిగి తెలుసుకుంటుంటాను . అమెరికాలో మనం వినే చాలా పేర్ల వెనక మనలాగే వృత్తులు (చేసే పని) ముడిపడి ఉంటాయి. అలాగే వారి వంశానికి సంబంధించిన ఇతివృత్తానికి ముడిపడి ఉంటాయి. ఉదాహారణకు స్మిత్ ( Smith ), గోల్డ్ స్మిత్ ( Gold smith ), బట్లర్ ( Butler ), కుక్ ( Cook ), టైలర్ ( Tailor ), టర్నర్ ( Turner ) వంటివి వృత్తి పరమైన పేర్లు. అలాగే కిమ్ ( Kim ) బంగారు పనిచేసే కొరియా వారు , కిండర్మన్ ( Kindermann ) అంటే ఉపాధ్యాయుడు, గాగ్నెక్స్ ( Gagneux ) అంటే ఫ్రెంచ్ రైతు, సెటిల్మైర్ ( Tenant farmer - German ) అంటే జర్మన్లో కౌలుదారు కూడా అలాంటివే. ఇక మరికొన్ని ఎక్కడి నుంచి వచ్చారన్నదానికి ముడిపడి ఉంటాయి. రామోస్ ( Ramos ) హిస్పానిక్ పేరు, గోల్మన్ ( Gole man ) తూర్పు జర్మనీ ప్రాంతాన్ని బట్టి, పెర్రీ ( పెర్రీ ) ఆంగ్ల పియర్ చెట్టు దగ్గరి నివాసి, రివేరా ( Rivera ) హిస్పానిక్ నది ఒడ్డు నివాసి, టోర్రెస్ ( Torres ) స్పానీష్ టవర్ దగ్గరి నివాసి వంటివి పరిసరాలను బట్టి వచ్చిన పేర్లు. వాషింగ్టన్ ఒక సెటిల్మెంట్ పేరు. మనిషిని బట్టి వచ్చే పేర్లు..ఇక మనిషిని చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించే లక్షణాన్ని బట్టి మరికొందరి పేర్లు వచ్చాయి. గ్రే ( Gray ) బూడిద రంగు జుట్టున్న వ్యక్తి , వైట్ ( White ) తెల్ల జుట్టున్న వ్యక్తి, బ్రౌన్ ( Brown ) వంటివి వాళ్ళ జాతిని బట్టి వచ్చినవి. సమాజంలో బాగా బతికిన వాళ్లకు సంబంధించిన వాళ్ల పిల్లలు తమ తాత ముత్తాతల పేర్లు కలిసి వచ్చేట్టు పేర్లు కూడా పెట్టుకుంటారు. డేవిస్ ( Davis ) అంటే డేవిస్ కుమారుడు అని వాళ్ళ తండ్రిని బట్టి వచ్చిన పేరు. అలాంటివే జాన్సన్ ( Johnson ),ప్యాటర్సన్ ( Patterson ), నెల్సన్ ( Nelson ), రాబిన్సన్ ( Robinson ) వంటివి. మన దగ్గర తండ్రి పేర్లు ఉంటాయి.సినీ తారలు కూడా..అలాగే తల్లిప్రేమ కూడా కొందరిలో కనిపిస్తుంది గౌతమీపుత్ర శాతకర్ణి లాగా. దేశం ఏదైనా, మతం ఏదైనా ఆస్తికులు అన్ని చోట్లా ఉంటారు. దేవుడి పేరును తమ పేరులో పెట్టుకుంటారు. హేస్ ( Hayes ), హ్యూస్ ( Hughes ) ఐరిష్ దేవుడి పేర్లు. అలాంటిదే మార్టిన్ ( Mortin రోమన్ దేవుడు ) కూడా. మర్ఫి (Murphy ), ఫిలిప్స్ ( Phillips ) మనం ఎప్పుడో వాడి మూలకు పడేసిన రేడియో పేర్లు వాళ్లకు మాత్రం గొప్ప బలవంతులు. ఇక సినిమా నటుల సంగతి దగ్గరకుస్తే.. హాలీవుడ్ అయినా బాలీవుడ్, టాలీవుడ్ వారైనా చాలామంది తమ అసలు పేర్లు మొత్తానికే మార్చుకోవడం తెలిసిందే కదా . అలాంటిదే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అభిమాన తార, ఫ్యాషన్ ఐకాన్ మెరిలిన్ మన్రో ( Marilin Monroe ), ఆమె గారి అసలు పేరు మాత్రం నోరు తిరగని నోర్మా మార్టెన్సన్ !. --వేముల ప్రభాకర్(చదవండి: అమెరికాలో పెళ్లిళ్లు పెటాకులు !) -
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్‌పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. -
సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో పుస్తక సమీక్ష
శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో, సింగపూర్‌లో ప్రవాసభారతీయులతో డా. రామ్ మాధవ్ రచించిన నూతనగ్రంధ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. డా రామ్ మాధవ్ ఇటీవల రచించిన *ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్ (“The Indian Reality: Changing Narratives, Shifting Perceptions”) పుస్తక పరిచయం,విశ్లేషణ కార్యక్రమం సింగపూర్‌లో మే 4న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక స్థానిక భారతీయ సంస్థల అధిపతులతో పాటు సుమారు 100 మంది సింగపూర్ వాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుస్తక రచయిత, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ పాలక మండలి అధ్యక్షుడు డా రామ్ మాధవ్ భారతదేశం చుట్టూ అభివృద్ధి చెందుతున్న కథనంపై అంతర్దృష్టి దృక్కోణాలను పంచుకున్నారు. భారతదేశంలోని ప్రస్తుత పరిపాలన ద్వారా అందించబడిన జవాబుదారీతనాన్ని ఆయన నొక్కిచెప్పారు, సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి ప్రధాన స్రవంతి రాజకీయాల్లో యువకులు విద్యావంతులు పెరుగుతున్న భాగస్వామ్యాన్ని హైలైట్ చేశారు. అంతేకాకుండా, భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని గురుంచి నొక్కిచెప్పారు. అనంతరం రామ్ మాధవ్ , వామరాజు సత్యమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అతిధులకు, ఇంకా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, నిర్మల్ కుమార్, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అతిధుల విందు భోజనంతో ఈ కార్యక్రమం ముగిసింది. -
అమెరికాలో పెళ్లిళ్లు పెటాకులు !
పెళ్లిళ్ల విషయాల్లో మనకూ వాళ్లకున్న స్పష్టమైన తేడా , మనవి చాలావరకు పెద్దలు నిశ్చయించిన అరేంజ్డ్ మ్యారేజెస్ కాగా వాళ్ళవి ప్రేమ వివాహాలు. అమెరికన్ల వివాహ వ్యవస్థ గురించి మాట్లాడడమంటే ఒక తేనె తెట్టెను కదిల్చినట్లే. వివాహం ఒక జీవితకాల బంధంగా భావించేవారు ఆ దేశంలో దినదినం తగ్గిపోతున్నారు. పెళ్ళి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం రెండూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కావడంతో అసలు పెళ్లెందుకు ? అని ప్రశ్నించేవారు ఎక్కువవుతున్నారు . పెళ్ళైనా కాకున్నా తప్పవు చికాకులు అందుకే పెళ్ళి.. బెటర్ విందువినోదాలు బెల్లమైనా పెళ్ళామైనా కొత్తలో చాలాతీపి పాతబెల్లం మందులకు.. పెళ్ళాం పిల్లలకు నచ్చినవాడే కాదు మెచ్చినవాడు కూడా ఎప్పుడు దొరికితే అప్పుడే కళ్యాణం కలిసివుండడం గుడ్.. కుదరనప్పుడు నిత్యకలహాలకన్నా విడిపోవడం వెరీగుడ్ఇందులో మొదటి రెండు భారతీయుల మనస్తత్వాన్ని , చివరి రెండు అమెరికా వాళ్ళ ఆలోచనా ధోరణిని తెలిపే కవితలు. పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే యువతీ యువకులు , సేమ్ సెక్స్ ( స్వలింగులు ) జంటలు ఆ దేశంలో పెరిగిపోతున్నాయి. వీళ్లను అదుపు చేయగలగిన కుటుంబ పెద్దల వ్యవస్థ అక్కడ బలహీనమై పోయింది. పేరెంట్స్ డే నాడు కలుసుకోడానికి వచ్చినప్పుడే పిల్లలు ఎవరు ఎక్కడ ఉంటున్నారో పెద్దలకు తెలిసే పరిస్థితులు. మన దేశంలో పొద్దున్నుండి రాత్రి వరకు స్త్రీ చేసిన ఇంటి వంట పనులు, పిల్లల పోషణ లెక్కలోకి రావడం లేదు. కులాలు, మతాలు ప్రాతిపదికనళ్లు పెళ్లిళ్లే ఉండవు..ఆమె భర్త చాటు అబల మాత్రమే, సమవుజ్జి కాలేని పరిస్థితులు ఇప్పటికీ నెలకొనివున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. బయటకు వెళ్లి మగవాడు చేసిందే సంపాదన , ఆయనే కుటుంబ యజమాని. అమెరికాలో పరిస్థితి భిన్నం. మహిళ సబల, భర్త వెనక నడిచే భార్య కాదు. ఆమె స్వయంగా కారు నడుపుకుంటూ షాపింగ్, జిమ్, బ్యూటీ పార్లర్, సినిమా షికార్లకు వెళ్లి రాగలదు. అక్కడ భార్యభర్తలు ఇద్దరూ ఏదో ఓ ఉద్యోగం చేసేవారే. తండ్రి మాత్రమే బ్రెడ్ విన్నర్, తల్లి గృహ సంరక్షకురాలు మాత్రమే అనడానికి లేదు. ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర ఉంటుంది. వాళ్ళు కలిసివున్నా ఎవరి సంపాదన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎవరికెవరు భయపడాల్సిన పనిలేదు.తేడాలు వస్తే , కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. పిల్లల పెంపక బాధ్యతలు పంచుకుంటున్నారు. అమెరికాలో కులాలు, మతాల ప్రాతిపదికన పెళ్లిళ్లు ఉండవుఎవరికి నచ్చిన వాళ్లను వాళ్లు ఎంచుకోవచ్చుపెళ్లికి ముందే తప్పనిసరిగా పరిచయం అయి ఉంటుందిఒకరి గురించి మరొకరికి సంపూర్ణంగా అవగాహన కలిగే వారకు కలిసి ఉంటారుఇద్దరి అభిప్రాయాలు ఒక్కటై.. కలిసి ఉంటామన్న నమ్మకం ఏర్పడ్డ తర్వాతే పెళ్లి చేసుకుంటారుఅమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పెళ్లికి సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పద్ధతులున్నాయివయస్సులో భర్త పెద్దగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం, ఇష్టం ఉంటే చాలుఅమెరికాలో పెళ్లిళ్లకు ముందే చాలా మంది కౌన్సిలర్లను కలుస్తారు. భాగస్వామితో కలిసి ఒకరి గురించి మరొకరు చర్చిస్తారు. బంధం ధృడమయ్యేందుకు చర్చలు జరుపుతారుఆడ-మగ అనే కాదు, స్వలింగ వివాహాలు కూడా ఇక్కడ చట్టబద్ధమేపెళ్లికి ఎంతో విలువ ఇస్తారు. చట్ట ప్రకారం ఇద్దరికి అన్ని హక్కులు సమానంగా ఉంటాయిభారతదేశంతో పోలిస్తే విడాకులు ఇక్కడ సర్వసాధారణంవిడాకుల విషయంలో కోర్టులు విధించే భారీ పరిహారమే భయపెట్టేలా ఉంటుందిభారత్లో జరిగినట్టుగా పెళ్లిళ్లు భారీ హడావిడితో జరగవు.డెస్టినేషన్ వెడ్డింగ్‌లు కూడా జరుగుతాయి. మంచి పర్యాటక ప్రాంతాల్లో పెళ్లి చేసుకోవడమంటే అమెరికన్లకు ఇష్టంపెళ్లి ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. వర్చువల్‌గా విషెస్ చెబుతారు.చాలా వరకు పెళ్లిల్లు వీకెండ్లోనే జరుగుతాయి.మన దగ్గర పెళ్లి చీరకు ఎంత విలువ ఉంటుందో.. అక్కడ వెడ్డింగ్ గౌన్‌కు అంత ప్రాధాన్యత.భారత్ నుంచి వెళ్లి సెటిలయ్యే వారిలో కొందరు అమెరికన్లను పెళ్లి చేసుకున్నవారున్నారు. అయితే ఈ పెళ్లిళ్ల వెనక కూడా లీగల్ పాయింట్లు లాగే వారున్నారు. పౌరసత్వం కోసం కొందరు పెళ్లికి ఆరాట పడ్డా.. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినమయ్యాయి. పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చే వాళ్లను కఠిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎక్కడ పరిచయం, ఎన్నిసార్లు కలుసుకున్నారు, ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు? పెళ్లికి ఇద్దరికి ఎప్పుడు ఒప్పందం కుదిరింది? ఇలాంటి ప్రశ్నలతో పాటు ఆధారాలు చూపించమంటున్నారు. పెరుగుతున్న విడాకులతో పాటు సహజంగానే పునర్వివాహాలు కూడా ఎక్కువవుతున్నాయి. అమెరికాలో సగానికి పైగా కుటుంబాలు పునర్వివాహాలు చేసుకున్నవారే. ఇప్పుడు ఒకే ఇంట్లో ఆమె పిల్లలు, ఆయన పిల్లలు, వారి పిల్లలు ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. పెరిగిపోతున్న విడాకుల ప్రభావం పిల్లల మానసిక స్థితి పై పడుతుంది వాస్తవం. వీటికి తోడు పెళ్లికాని టీనేజ్ పిల్లలు గర్భం దాల్చడం, అసలు పెళ్లే చేసుకోకుండా కలిసివున్నవారు కన్న పిల్లలు ఇప్పుడు అమెరికా సమాజానికి పెద్ద సవాలుగా నిలుస్తున్నారు . నల్ల జాతీయుల్లోనైతే వివాహేతర జననాలు 25 శాతం వరకు ఉంటాయంటున్నారు !.వేముల ప్రభాకర్(చదవండి: టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement