వెడ్డింగ్ కార్నివాల్ | Sakshi
Sakshi News home page

వెడ్డింగ్ కార్నివాల్

Published Sun, Mar 23 2014 12:41 AM

వెడ్డింగ్ కార్నివాల్

మాదాపూర్, న్యూస్‌లైన్: అధునాతన డిజైన్లు... జిగేల్‌మనే రంగులు... వధూవరుల మనసు దోచే విభిన్న వస్త్రాభరణాలతో ఏర్పాటు చేసిన ‘రాయల్ వెడ్డింగ్ కార్నివాల్’ విశేషంగా ఆకట్టుకుంటోంది. మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల కార్నివాల్‌ను హీరో నితిన్ శనివారం ప్రారంభించారు. ‘అన్ని రకాల వెడ్డింగ్ ప్లానర్స్ ఒకే చోట అందుబాటులో ఉండటంవల్ల ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

అంతేకాదు... ఇందులో కొత్త కొత్త డిజైన్లు, వెరైటీ అలంకరణ పద్ధతులు తెలుచుకోవచ్చు’ అని నితిన్ అన్నారు. నిర్వాహకురాలు నికితారెడ్డి మాట్లాడుతూ... ‘దాదాపు యాభైకి పైగా వెడ్డింగ్ ప్లానర్స్ ఇక్కడి స్టాల్స్‌లో ఉన్నాయి. సందర్శకులకు వీటి గురించి వివరిస్తున్నాం. వధూవరులకు కావల్సిన ఆభరణాలు, వస్త్రాలు, మేకప్ సామగ్రి వంటివెన్నో ఉన్నాయి’ అన్నారు.
 
ప్రత్యేక ఆకర్షణ... ‘సాక్షి’ స్టాల్
 
ఈ కార్నివాల్‌లో ఏర్పాటు చేసిన ‘సాక్షి’ దినపత్రిక స్టాల్ ప్రత్యేక ఆకర్షణ. ఇందులో సాక్షి పత్రికలో వచ్చే స్పెషల్ పేజీలతో ఓ వీల్ ఏర్పాటు చేశారు. సందర్శకులు దాన్ని తిప్పినప్పుడు ‘యారో’ మార్కు తొలుత ఎక్కడుందో మళ్లీ అదే చోటికి వచ్చి ఆగితే... మూడు నెలలు ఉచితంగా సాక్షి పత్రిక గెలుపొందవచ్చు.

Advertisement
Advertisement