కేసీఆరే సిసలైన కమ్యూనిస్టు: కేటీఆర్‌

కేసీఆరే సిసలైన కమ్యూనిస్టు: కేటీఆర్‌


టీఆర్‌ఎస్‌లో చేరిన వరంగల్‌ సీపీఎం నేతలు

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో అసలు సిసలైన కమ్యూనిస్టు సీఎం కేసీఆర్‌. ఆయన స్థాపించిన టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలో ఎరుపు రంగు లేకపోయినప్పటికీ ఆలోచ నలు, ఆశయాలన్నీ కమ్యూనిస్టు భావాలను అనుకరించే ఉంటాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఆ ఎజెండానే అమలు చేస్తున్నారు’ అని ఐటీ మంత్రి తారకరామారావు అన్నారు.


సోమవారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో సీపీఎం సీనియర్‌ నేత మెట్టు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ జిల్లాకు చెందిన వేలాది కార్యకర్తలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటీ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. వృద్ధులు, వికలాంగులు, వితంతు కేటగిరీలో సంతృప్తికర స్థాయిలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, రేషన్‌ బియ్యం కోటాను 6 కిలోలకు పెంచామని, మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు సన్నబియ్యం భోజనాన్ని వడ్డిస్తున్నామని, ఇవన్నీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాయకున్నా అమలు చేశామని చెప్పారు.

Back to Top