వేదికపై సొమ్మసిల్లిన కడియం | Sakshi
Sakshi News home page

వేదికపై సొమ్మసిల్లిన కడియం

Published Sat, Jun 3 2017 1:43 AM

వేదికపై సొమ్మసిల్లిన కడియం - Sakshi

- ప్రసంగిస్తూ తూలిపోయిన డిప్యూటీ సీఎం
కొద్ది సేపటి తర్వాత కార్యక్రమం కొనసాగింపు
- రాష్ట్ర అవతరణ వేడుకలో అపశృతి
 
సాక్షి, వరంగల్‌: రాష్ట్ర అవతరణ వేడుకలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన ప్రసంగిస్తూనే తూలిపడ్డారు. ఆయన అకస్మాత్తుగా అలా కిందపడిపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆందో ళనకు గురయ్యారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం కార్య క్రమాన్ని కొనసాగించారు.  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంద ర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేడుకలను హన్మకొండలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వ అతిథిగా కార్య క్రమంలో పాల్గొన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రగతిపై రూపొందించిన నివేదికను ఆయన చదువుతూ ఒక్కసారిగా తూలిపో యారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకపోవడంతో అందరు ఆందోళనపడ్డారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, అధికారులు, అంగరక్షకులు కడియం శ్రీహరిని వేదిక వెనుక ఉన్న ఆయన వాహనం వద్దకు తీసుకెళ్లి అందులో కూర్చోబెట్టారు. అప్పటికే ఆందోళనలో ఉన్న జిల్లా ఉన్నతాధికారులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నాలుగు నిమిషాల తర్వాత కడియం శ్రీహరి మళ్లీ వేదికపైకి వచ్చి ప్రసంగం పూర్తి చేశారు. ప్రసంగం పూర్తయిన తర్వాత కడియం  వేదికపై నుంచి వచ్చి పక్కన ఉన్న గ్యాలరీలో కూర్చుకున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా వైద్యాధికారి హరీశ్‌రాజ్‌ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ప్రసంగం పాఠం సైతం గతంలో ఎప్పుడూ లేనంత పెద్దగా 16 పేజీలు ఉండడంతో ఎక్కువ సమయం ఎండలో ఉండి చదవాల్సి వచ్చింది. ‘ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం. ఎక్కువ సేపు నిలబడి ప్రసంగ పాఠం చదవాల్సి రావడం వల్ల బీపీ తగ్గడంతో ఇలా జరిగింది’అని వైద్యులు వివరించారు.

Advertisement
Advertisement