చిన్నాయి గూడెంలో చైన్ స్నాచింగ్ | Sakshi
Sakshi News home page

చిన్నాయి గూడెంలో చైన్ స్నాచింగ్

Published Mon, Feb 8 2016 4:13 PM

Chain snatching in Chinnayagudem

తిప్పర్తి (నల్లగొండ జిల్లా) : తిప్పర్తి మండలం చిన్నాయి గూడెంలో సోమవారం చైన్ స్నాచింగ్ జరిగింది. గ్రామానికి చెందిన బైరగొని రాజేశ్వరి అనే మహిళపై దాడి చేసి 4 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఆమె వ్యవసాయ పనులకు వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement