దక్షిణాది స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే ఇష్టం | Sakshi
Sakshi News home page

దక్షిణాది స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే ఇష్టం

Published Fri, Apr 22 2016 2:06 AM

దక్షిణాది స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే ఇష్టం - Sakshi

బెంగళూరులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి
‘సరైనోడు’ సినిమా ప్రమోషన్ కోసం బెంగళూరుకు


బెంగళూరు: ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ బెంగళూరులో సందడి చేశారు. శుక్రవారం విడుదల కానున్న ‘సరైనోడు’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని గురువారం బెంగళూరులో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ... కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా దక్షిణాది స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే తనకు ఇష్టమని తెలిపారు. తన తరువాతి చిత్రం తమిళంలో ఉండబోతోందని అల్లు అర్జున్ ప్రకటించారు. ఇక తనకు బెంగళూరులో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని అందువల్లనే ‘సరైనోడు’ సినిమా ప్రమోషన్ కోసం బెంగళూరు వచ్చానని పేర్కొన్నారు.


ఇదే సందర్భంలో కర్ణాటకతో పాటు తమిళనాడు, కేరళలో సైతం తన అభిమానులు ఉన్నారని, అందువల్ల  కథ నచ్చితే కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో సినిమాలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక కన్నడ సినీ పరిశ్రమలో ఇటీవల వైవిధ్యభరితమైన సినిమాల సంఖ్య పెరుగుతోందన్న అల్లు అర్జున్ ‘రంగితరంగ’ సినిమాను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘సరైనోడు’ సినిమా కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడిందని, సినిమాను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉందని అల్లు అర్జున్ తెలిపారు.

 

 

 

 

 

Advertisement
Advertisement