అవినీతి కేసులో డీఈఈకి ఏడాది జైలు | Sakshi
Sakshi News home page

అవినీతి కేసులో డీఈఈకి ఏడాది జైలు

Published Fri, Dec 16 2016 2:24 AM

acb court judgement on Corruption case over DEE

హైదరాబాద్‌: అవినీతి వ్యవహారంలో మెదక్‌ జిల్లా రామాయంపేట డివిజన్‌ నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ) వి.రాజయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే రూ.వెయ్యి జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి విక్టర్‌ ఇమాన్యుయేల్‌ గురువారం తీర్పునిచ్చారు. 2004 ఫిబ్రవరి 4న ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రాజయ్య దగ్గర రూ.10 వేల అవినీతి సొమ్ము లభించింది. ఈ డబ్బును శంకర్‌పేట్‌ మండలం అంభాజీపేట నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడి నుంచి లంచం రూపంలో తీసుకున్నట్లు విచారణలో తెలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీబీ.. అన్ని ఆధారాలతో కోర్టుకు చార్జిషీట్‌ సమర్పించింది. 

Advertisement
Advertisement