మిక్కీ మౌస్‌తో చిందేసిన ఫెదరర్‌ | Sakshi
Sakshi News home page

మిక్కీ మౌస్‌తో చిందేసిన ఫెదరర్‌

Published Tue, Oct 10 2017 3:02 PM

roger federer danced with mickey mouse

టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ రాకెట్ పట్టి కోర్టులోకి దిగితే చాలూ అభిమానుల్లో ఓ ఉత్సాహం నెలకొంటుంది. 19 గ్రాండ్ స్లామ్ టోర్నీల విజేతగా చరిత్రకెక్కిన రోజర్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అయితే తాజాగా ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కార్టూన్‌ పాత్ర మిక్కీ మౌస్‌తో ఫెదరర్‌ చిందులేశాడు. చైనాలోని షాంగై రోలెక్స్‌ మాస్టర్స్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీ జరుగుతోంది. దీంట్లో రోజర్ ఫెదరర్ కూడా పాల్గొనబోతున్నాడు. మ్యాచ్‌ సన్నాహాల కోసం జరిగిన ఈవెంట్‌లో ఆయన కోర్టుకు రాగా.. మిక్కీ మౌస్‌ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి ఫెదరర్ వద్దకు వచ్చి, తనతో డాన్స్ చేయాలని కోరాడు. అంతే ఏ మాత్రం మొహమాటం లేకుండా ఫెదరర్ సరదాగా స్టెప్పులేసేశాడు. 

ఇక వీడియోను ఏటీపీ టెన్నిస్ టీవీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అవుతోంది. దర్పం ప్రదర్శించకుండా సరదాగా ఫెదరర్‌ వేసిన చిందులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Advertisement