అదృష్టం కలిసొచ్చింది! | Sakshi
Sakshi News home page

అదృష్టం కలిసొచ్చింది!

Published Wed, Apr 16 2014 1:02 AM

అదృష్టం కలిసొచ్చింది! - Sakshi

ఆసియా జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్‌లో చైతన్యకు మూడు కాంస్యాలు
 సాక్షి, హైదరాబాద్: గత ఏడాది జూలైలో కిర్గిస్థాన్‌లో ఆసియా జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం. రాజేంద్ర చైతన్య (ఏపీ క్రీడా పాఠశాల విద్యార్థి) నాలుగో స్థానంలో నిలిచాడు. పురుషుల 105 కేజీల విభాగంలో అతను స్నాచ్‌లో 127 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 165 కిలోల (ఓవరాల్‌గా 292 కిలోలు) బరువు ఎత్తాడు. ఈ విభాగంలో కజకిస్థాన్‌కు చెందిన లక్టీనోవ్ మాగ్జిమ్ తొలి స్థానంలో నిలిచి స్వర్ణం అందుకున్నాడు.
 
 అయితే తాజాగా రెండు రోజుల క్రితం నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను పట్టుబట్టాడు. దాంతో మాగ్జిమ్‌పై నిషేధం విధిస్తూ అతను గెలుచుకున్న పతకాలను వెనక్కి తీసుకున్నారు. తాజా పరిణామంతో ఫలితాల్లో చైతన్య మూడో స్థానానికి ఎగబాకాడు. అతనికి స్నాచ్, క్లీన్ అండ్ జర్క్, ఓవరాల్ విభాగాల్లో విడివిడిగా మూడు కాంస్య పతకాలు లభించాయి. దీనిని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) నిర్ధారించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement