ఆస్ట్రేలియాదే వన్డే సిరీస్ | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాదే వన్డే సిరీస్

Published Thu, Sep 1 2016 12:19 AM

ఆస్ట్రేలియాదే వన్డే సిరీస్

లంకతో నాలుగో వన్డేలో 6 వికెట్ల విజయం 


దంబుల్లా: శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో గెలుచుకుంది. బుధవారం జరిగిన నాలుగో వన్డేలో 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటరుుంది. ధనుంజయ డిసిల్వా (76) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేస్టింగ్‌‌స 6 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్ కేవలం 31 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోరుు 217 పరుగులు చేసి గెలిచింది.

ఫించ్ (19 బంతుల్లో 55; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా. బెరుులీ (85 బంతుల్లో 90 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఫించ్ కేవలం 18 బంతుల్లో అర్ధసెంచరీ చేసి, ఆస్ట్రేలియా తరఫున వేగంగా అర్ధసెంచరీ చేసిన రికార్డును సమం చేశాడు. 

 

Advertisement
Advertisement