డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

Published Thu, Oct 25 2018 7:58 AM

Dallas NATS chapter conducts Childrens Festival - Sakshi

డల్లాస్‌ : అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) డల్లాస్‌ చాప్టర్, వరుసగా ఎనిమిదవ సంవత్సరం బాలల సంబరాలను ఘనంగా నిర్వహించింది. డల్లాస్‌లో ఫార్మర్స్ బ్రాంచ్‌లోని సెయింట్ మేరీస్ చర్చి ఆడిటోరియం వేదికగా, దాదాపు పన్నెండు గంటల పాటు జరిగిన ఈ సంబరాలలో భారత దేశ సంస్కృతిని, పిల్లలలోని మేధస్సును ప్రోత్సహించే దిశగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 మంది బాల బాలికలు గణితం, చదరంగం, క్లాసికల్, నాన్ క్లాసికల్ సంగీతం, నృత్యం, తెలుగు పదకేళి పోటీలలో పాల్గొన్నారు. ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, సీనియర్ స్కూల్ పిల్లలకు విడిగా నిర్వహించారు.

సాఫ్ట్ స్కూల్స్ తరఫున గూడవల్లి మణిధర్ పిల్లలకు గణితంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. యూఎస్‌సీఎఫ్‌ స్థానిక చాఫ్టర్ సహకారంతో నిర్వహించిన చదరంగం పోటీలో 80 మంది పిల్లలు పాల్గొన్నారు. స్థానిక సంగీత, నృత్య పాఠశాలల గురువులు, ప్రసిద్ధ కళాకారులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో మొదటి రెండు లేదా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి డల్లాస్‌ నాట్స్ వారు బహుమతులు అందించారు. విద్యార్ధుల్లో సృజనాత్మకతను పెంచేందుకు వారిని ప్రోత్సాహించేందుకు నాట్స్ బాలల సంబరాలు నిర్వహిస్తుందని నాట్స్ ఉపాధ్యక్షులు బాపు నూతి అన్నారు. నాట్స్ చేసే వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించి అందరిని భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరారు. ఇతర వక్తలు మాట్లాడుతూ ప్రవాసాంద్రుల పిల్లల కోసం నాట్స్ చేస్తున్న సేవలను ప్రశంసించారు.

ఈ బాలల సంబరాలు కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా బాపు నూతి, కిషోర్ వీరగంధం వ్యవహరించారు. నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ కిషోర్ కంచర్ల , రాజేంద్ర మాదాల, ఆది గెల్లి, జాతీయ కార్యవర్గ సభ్యులు బాపు నూతి, శేఖర్ అన్నే, కిషోర్ వీరగంధం, జ్యోతి వనం, శ్రీనివాస్ కొమ్మినేని, డల్లాస్‌ చాప్టర్ కార్యవర్గ సభ్యులు సురేంద్ర ధూళిపాళ్ల, ప్రసాద్ దాస్తి, నాగిరెడ్డి మండల, భాను లంక, అశోక్ గుత్తా, కృష్ణ వల్లపరెడ్డి, అను అడుసుమల్లి, తేజ వాసంగి, శ్రీధర్ న్యాలమడుగుల, కిరణ్ జాలాది, శ్రీధర్ వింజమూరి, శ్రీని కాసర్ల, దేవీప్రసాద్, మోహన్ మల్లిపెద్ది, వంశీ వడ్లమూడి, విజయ్ కొండా, వెంకట్ పోలినీడు, జీవన్ గోగినేనిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో తమవంతు సహాయసహకారాలు అందించారు.





Advertisement
Advertisement