విమానంలో దుస్తులు విప్పి నగ్నంగా..

Passenger Strips Naked On Air India Express Flight - Sakshi

ల​క్నో : విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన ఒంటిపై దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా తిరుగుతూ కలకలం స్పష్టించాడు. ఈ ఘటన దుబాయ్-లక్నో ఎయిరిండియా విమానంలో శనివారం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా దుస్తులు విప్పేసి అటూఇటూ తిరగడంతో విమానంలో ప్రయాణిస్తున్న  ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ప్రయాణికుడి బిత్తిరి చర్యకు వెంటనే స్పందించిన సిబ్బంది అతడి ఒంటిపై దుప్పటి కప్పి సీట్లో కూర్చోబెట్టారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆ వ్యక్తి అకస్మాత్తుగా దుస్తులు ఎందుకు విప్పాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రయాణికుడిని భద్రతా సిబ్బందికి అప్పగించామని, అతడు ఎందుకు అలా ప్రవర్తించాడన్న దానిపై దర్యాప్తు జరుగుతోందని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top