అలహాబాద్ః స్కూల్లోని విద్యార్థులు, సిబ్బంది జాతీయ గీతం ఆలపించకూడదని నిబంధన విధించిన ఓ స్కూల్ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయగీతంలోని పదాలు ఇస్లాం మతాన్ని ఉల్లంఘిస్తున్నట్లుగా ఉన్నాయని అతడు ఆరోపించడమే కాక, ఆ గీతాన్ని పాడకూడదన్న షరతులు విధించడంతో విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు స్కూల్ మేనేజర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలహాబాద్ బఘారా ప్రాంతంలో ఉన్న ఎం ఏ కాన్వెంట్ స్కూల్ మేనేజర్ జియా ఉల్ హక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కూల్లో సిబ్బంది, విద్యార్థులు జాతీయగీతం పాడకూడదని, ఇస్లాం మతాన్ని ఉల్లంఘించే పదాలు ఆ గీతంలో ఉన్నాయని హక్ నిబంధన విధించాడు. దీంతో హక్ పై విద్యాధికారులు నగరంలోని కొలోనెల్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలు జియా ఉల్ హక్ ఎటువంటి అనుమతి లేకుండా స్థానికంగా పాఠశాల నడిపుతున్నాడని, హక్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కంప్లైంట్ లో తెలిపారు. అంతేకాక ఎంఏ కాన్వెంట్ స్కూల్ కు ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ నుంచి ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా హక్ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. విద్యాశాఖ ఫిర్యాదు మేరకు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రవర్తిస్తున్న స్కూల్ మేనేజర్ జియా ఉల్ హక్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ రాజేష్ యాదవ్ తెలిపారు.
స్కూల్ మేనేజర్ పెట్టిన కఠినమైన షరతులకు నిరసనగా ఎంఏ కాన్వెంట్ స్కూల్ నుంచి మొత్తం ఎనిమిదిమంది ఉపాధ్యాయులు సహా ప్రిన్సిపాల్ కూడా రాజీనామా చేశారు. పాఠశాల్లో ఉపాధ్యాయులు చాలామంది ఈమధ్య కాలంలోనే చేరిన వారేనని, గత 12 ఏళ్ళుగా ఇక్కడ జాతీయగీతం పాడేందుకు అనుమతిలేదన్న షరతు విని తామంతా ఆశ్యర్యానికి గురయ్యామని, మేనేజర్ నిబంధనలకు తమ మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతోనే తామంతా రిజైన్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ రీతూ త్రిపాఠీ తెలిపారు. మొత్తం 300 మంది విద్యార్థులతో నడుస్తున్న ఎంఏ కాన్వెంట్ నిర్వహణ వైఖరికి నిరసనగా తనతోపాటు ఏడుగురు సహోపాధ్యాయులు రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. అయితే జాతీయ గీతంలోని మొదటి చరణంలో ఉండే 'భారత భాగ్య విధాతా' పదాలు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని, దీంతో ఆ గీతాన్ని పాడకూడదన్న హక్ నిబంధనతో రెండురోజుల క్రితం తామంతా పాఠశాలనుంచీ రాజీనామా చేసినట్లు తెలిపారు.
అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ఇన్నాళ్ళుగా ఎంఏ స్కూల్ నడవటంతోపాటు, సిబ్బంది, విద్యార్థులకు తీవ్రమైన నిబంధనలు విధిస్తున్నస్కూల్ వివరాలు తెలుసుకొని ఆశ్చర్యపోయామని, వారంరోజుల క్రితమే స్కూల్ మూసివేయాలంటూ తాము నోటీసులు జారీ చేసినట్లు అలహాబాద్ బేసిక్ శిక్షా అధికారి జై కరణ్ యాదవ్ తెలిపారు. మరోవైపు తమ పాఠశాల నిబంధనలను పాటించలేని పరిస్థితుల్లోనే సదరు ఉపాధ్యాయులు రిజైన్ చేయాల్సి వచ్చిందని, జాతీయ గీతంలోని మొదటి చరణంలో ఉండే 'భారత భాగ్య విధాతా' అంటే భారత్ విధి నిర్ణయిస్తుందన్న అర్థం వస్తోందని, అల్లాయే మా విధి విధాత అని, భారత్ విధి నిర్ణయిస్తుందని మేం ఎలా చెప్తాం? అంటూ జియా ఉల్ హక్ ప్రశ్నిస్తున్నాడు. అయితే జనగణమన లోని అధినాయక్ పదంపై ఒక్క ముస్లిం మతస్థులే కాక ఇతరులు అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే.
జాతీయగీతం బ్యాన్.. వ్యక్తి అరెస్ట్..!
Published Mon, Aug 8 2016 10:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
అరసవల్లిలో భక్తుల రద్దీ
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement