‘అక్షయ్‌తో అందుకే నటించలేదు’ | Sakshi
Sakshi News home page

అక్షయ్‌తో నటించనిది అందుకే: షారుక్‌

Published Tue, Feb 5 2019 4:58 PM

Shah Rukh Khan Comments On Acting With Akshay Kumar - Sakshi

ముంబై : అనేక మంది హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుని అభిమానులకు వినోదం పంచిన బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌.. ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌తో మాత్రం ఒక్కసారి కూడా కలిసి నటించలేదు. షారూక్‌.. ‘దిల్‌ తో పాగల్‌ హై’ సినిమాలో అక్షయ్‌ అతిథి పాత్ర చేయగా.. అక్షయ్‌ సినిమా ‘మస్త్‌ కలందర్‌’ లోని ఓ పాటకు షారూక్‌ స్టెప్పులేశాడు. అంతేగానీ వీరిద్దరు పూర్తి స్థాయిలో కలిసి నటించలేదు. అయితే ప్రస్తుతం షారుక్‌ మాటలు వింటుంటే మాత్రం వీరిద్దరి కాంబినేషన్‌ కుదిరే అవకాశమే లేనట్లుగా కన్పిస్తోంది.

ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన షారుక్‌.. ‘అక్షయ్‌లాగా నాకు పొద్దున్నే లేచే అలవాటు లేదు. నేను పడుకునే సమయానికి తను లేస్తాడు. తను లేచే సమయానికి నేను పడుకుంటాను. నేను షూటింగ్‌ వెళ్లే సమయానికి అక్షయ్‌ ప్యాకప్‌ చెప్పేస్తాడు. చాలా మందికి నాలాగా రాత్రి షూటింగ్‌ చేయడం ఇష్టం ఉండదు కదా. నాకూ తనతో నటించాలని ఉంది. కానీ మా టైమింగ్స్‌ మ్యాచ్‌ అవ్వవు. నేను సెట్‌లోకి వస్తుంటే.. తను వెళ్లిపోతూ ఉంటాడు. అంతేకదా... ఇంతకన్నా నేను ఏం చెప్పగలను’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో బాద్‌షా, ఖిలాడీల క్రేజీ కాంబినేషన్‌ ఎప్పటికీ కుదరదేమోననంటూ అభిమానులు ఫీలైపోతున్నారు.

Advertisement
Advertisement