కొణిదెలలో కుదిరింది! | Sakshi
Sakshi News home page

కొణిదెలలో కుదిరింది!

Published Wed, Jul 12 2017 12:39 AM

కొణిదెలలో కుదిరింది!

కుదిరింది... కొరటాల శివతో రామ్‌చరణ్‌కు కుదిరింది. వీళ్లిద్దరి కలయిలో రూపొందే సినిమాకు ముహూర్తం కూడా కుదిరినట్టే! ఈసారి ఓన్లీ యాక్షన్‌... నో కట్‌! ఎందుకంటే.. ఈ సినిమాను చరణే నిర్మిస్తున్నారు. నిజం చెప్పాలంటే... ఇప్పటికే రామ్‌చరణ్‌–కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రావలసింది. శివ దర్శకుడిగా పరిచయమైన ‘మిర్చి’ తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా బండ్ల గణేశ్‌ నిర్మాతగా ఓ సినిమా ప్రారంభమైంది. కానీ, కొబ్బరికాయ కొట్టిన కొన్నాళ్లకు కొన్ని కారణాల వల్ల ఆ కథ, సినిమాను పక్కన పెట్టారు.

మళ్లీ ఇప్పుడీ కాంబినేషన్‌ కుదిరింది. రామ్‌చరణ్‌ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ నిరంజన్‌రెడ్డి నిర్మాణ భాగస్వామి. వచ్చే ఏడాది వేసవిలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని తెలిపారు. నిర్మాతగా రామ్‌చరణ్‌కు మూడో సినిమా ఇది. ‘ఖైదీ నంబర్‌ 150’తో నిర్మాతగా మారిన చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీపై చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాను ప్రొడక్షన్‌ నెం.2గా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఉయ్యాలవాడ...’ ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

Advertisement
Advertisement