ఫిబ్రవరిలో ఫుల్‌ జోరు | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో ఫుల్‌ జోరు

Published Sat, Dec 16 2017 12:06 AM

Nagarjuna opens up about film with Nani - Sakshi

ఎన్‌ అండ్‌ ఎన్‌.. త్వరలో రన్‌ మొదలుపెట్టనున్నారు. ఎన్‌ అండ్‌ ఎన్‌ అంటే నాగార్జున అండ్‌ నాని. ఈ ఇద్దరు ఎందుకు రన్‌ చేస్తారు? ఎప్పుడు చేస్తారు అనుకుంటున్నారా? మరేం లేదు. ఇద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ ఓ మల్టీస్టారర్‌ మూవీ నిర్మించనున్న విషయం తెలిసిందే. ‘భలే మంచిరోజు, శమంతకమణి’ వంటి హిట్‌ చిత్రాలు చేసిన శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

ఈ సినిమా షూటింగ్‌కు ఫిబ్రవరిలో కొబ్బరికాయ కొట్టనున్నారు. అప్పటినుంచి ఎన్‌ అండ్‌ ఎన్‌ రన్‌ చేస్తారు. అదేనండీ హుషారుగా షూటింగ్‌ చేస్తారు. ‘‘స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. ప్రసుత్తం నాగార్జున, నానిగార్లు బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి ఫస్ట్‌ వీక్‌లో మంచి రోజు చూసి సినిమాని సెట్స్‌కి తీసుకెళతాం. అశ్వినీదత్‌గారు ఎంతో హెల్ప్‌ చేస్తున్నారు. ఆయన బేనర్‌లో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని శ్రీరామ్‌ ఆదిత్య అన్నారు.

Advertisement
Advertisement