ఎన్ని కోణాల్లో తెరపై ఆవిష్కరించినా బోర్ కొట్టని అంశం ప్రేమ ఒక్కటే. జాతి, మతం, ఆస్తి, అంతస్తులు చూడకుండా కలిగేదీ ఒక్క ప్రేమే. ఎలాంటి అవరోధాలనైనా ఎదిరించి గెలిచేది ప్రేమ. అలాంటి ప్రేమను మరో కోణంలో ఆవిష్కరించే చిత్రం ఇంద్రకోబై .అయూమ్ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మీప్రియ అయూమ్ గణపతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరిదారం చిత్రం ఫేమ్ విజయ్.టి.అలెగ్జాండర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.
రోనాల్డ్‌రీగన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో రాజ్, ఆశాలత, విక్కీ, మంజు, జయలక్ష్మీ, కిచ్చా, దామోదరన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ 1990లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం ఇంద్రకోబై అని తెలిపారు. ప్రేమించి,పెళ్లి చేసుకున్న జంటను వారి తల్లిదండ్రులు, సమాజం వెలి వేస్తే జరిగే పరిణామాలేమిటన్నది చిత్ర ఇతివృత్తం అని చెప్పారు.ఈ కథ కోసం చాలా శోధించి తయారు చేసినట్లు తెలిపారు. అదే విధంగా చిత్రం హీరో ఎంపిక జరగకుండానే షూటింగ్‌ను ప్రారంభించి హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించినట్లు వివరించారు.
అలా షూటింగ్ చేస్తున్న సమయంలో అది చూడడానికి వ చ్చి వారిలో ఒక వ్యక్తి తన కంట పడ్డారన్నారు. ఆయనతో నటిస్తావా? అని అడగ్గా తనూ రెడీ అన్నారని, దీంతో మీరే చిత్ర హీరో అని చెప్పానన్నారు. అలా రాజ్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నారని తెలిపారు. అదే విధంగా చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను ఒక కొండపై భాగంలో చిత్రీకరిస్తుండగా బలమైన గాలి వీచడంతో కథానాయకి ఓణి ఎగిరి పోయిందన్నారు. దీంతో షూటింగ్ కొంత సేపు అంతరాయం కలిగిందని, మరో ఓణిని తెప్పించే వరకూ హీరోయిన్ చాలా అవస్థపడాల్సి వచ్చిందని తెలిపారు. మొత్తం మీద చిత్రం తాము ఊహించిన దానికంటే చాలా బాగా వచ్చిందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.
విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఇంద్రకోబై
Published Sun, Oct 2 2016 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement