ఇటు గుమ్మడికాయ... అటు కొబ్బరికాయ | Sakshi
Sakshi News home page

ఇటు గుమ్మడికాయ... అటు కొబ్బరికాయ

Published Sun, Jul 23 2017 12:57 AM

ఇటు గుమ్మడికాయ... అటు కొబ్బరికాయ - Sakshi

బాలకృష్ణ జోరుగా హుషారుగా ఉన్నట్లున్నారు.  ఆయన 101వ చిత్రం ‘పైసా వసూల్‌’ చిత్రీకరణ మరో ఏడు రోజులు చేస్తే పూర్తయిపోతుంది. ఆ సినిమాకి గుమ్మడికాయ కొట్టేసి, 102వ సినిమాకి కొబ్బరికాయ కొట్టేందుకు రెడీ అవుతున్నా రాయన. కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ ఈ సినిమా నిర్మించనున్నారు. ‘శ్రీరామరాజ్యం’, ‘సింహా’ వంటి హిట్‌ మూవీస్‌ తర్వాత బాలకృష్ణ, నయన తార జంటగా నటించనున్న చిత్రమిది.

సి. కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో బాలకృష్ణగారి 102వ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎమ్‌. రత్నం అద్భుతమైన కథ అందించారు. చిరంతన్‌ భట్‌ సంగీత దర్శకుడు. వచ్చే నెల 3న హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో చిత్రీకరణ మొదలుపెట్టి 30 రోజుల పాటు చేయనున్నాం’’ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement